close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విదేశాల్లో విలవిల్లాడుతున్న తెలుగు విద్యార్థులు

హైదరాబాద్‌: విదేశాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కరోనా ప్రభావంతో విమానాశ్రయాల్లో చిక్కుకు పోయారు. భారత్‌కు వచ్చే విమానాలు రద్దు కావడంతో ఫిలిప్పీన్స్‌లోని మనీలా విమానాశ్రయంలో పలువురు తెలుగు విద్యార్థులు అవస్థపడుతున్నారు. మనీలాలో సుమారు 40గంటలుగా నిద్రాహారాలు లేకుండా పడిగాపులు కాస్తున్నారు. నేలపైనే పడుకుంటూ 80 మంది ఇబ్బంది పడుతున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు పంపడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 
మరో వైపు మలేసియాలోని కౌలాంలంపూర్‌ నుంచి 185 విద్యార్థులు విశాఖకు చేరుకోగా వారిని పరీక్షించిన వైద్యులు అనంతరం వారి ప్రాంతాలకు తరలించారు. వారిలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. మనీలాలో చిక్కుకొన్న ఏపీ, తెలంగాణకు చెందిన 80 మంది విద్యార్థులు కౌలాలంపూర్‌ మీదుగా విశాఖ వచ్చేందుకు ఎయిర్‌ ఏసియా విమానంలో టికెట్లు బుక్‌ చేసుకున్నారు. కానీ, భారత్‌కు వచ్చే విమాన సర్వీసులు మంగళవారం నుంచి రద్దు చేయడంతో వారు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. వీరిలో  కర్నూలు,చిత్తూరు,ప్రకాశం,గుంటూరు,అనంతపురం సహా తెలంగాణలోని హైదరాబాద్‌, వరంగల్‌ ప్రాంత వాసులు కూడా ఉన్నారు. భారత్‌కు వెళ్లలేక, ఫిలిప్పీన్స్‌లో ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని