close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయ్‌

కాలిఫోర్నియా: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా చికిత్సకు 69 మందులు సహా వాటి సమ్మేళనాలు చాలా ప్రభావ వంతంగా పని చేస్తాయని భారతీయ శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం గుర్తించింది. ఇప్పటికే వాటిలో కొన్ని డయాబెటిస్‌, రక్తపోటు చికిత్సల్లో ఉపయోగపడుతుండగా కొవిడ్‌-19 చికిత్స కోసం తిరిగి తయారు చేయనుంది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను కనిపెట్టే ప్రయత్నంలో వాటి తయారీ వేగంగా ఉండొచ్చని పరిశోధనలో తేలింది. 29 కరోనా వైరస్‌ జన్యువుల్లో 26 జన్యువులను పరిశోధించిన బృందం.. వైరల్‌ ప్రోటీన్‌ల ఉత్పత్తిని ప్రత్యక్షంగా చేస్తాయని గుర్తించారు. అయితే, ఈ శాస్త్రవేత్తల బృందం వైరల్‌ ప్రోటీన్‌లను కాకుండా హోస్ట్‌ ప్రోటీన్‌లను లక్ష్యంగా చేసుకుని వేరే విధానాన్ని తీసుకుంది. ఏ మానవ ప్రోటీన్‌లతో అవి కలిసి పోతాయో తెలుసుకోవడానికి అధ్యయనం చేస్తున్నట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం తెలిపింది. 

 

 



మరిన్ని