close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యూకేలో తెలుగు విద్యార్థుల అవస్థలు

లండన్‌: యూకేలోని హీత్రూ విమానాశ్రయం వద్ద తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పది రోజుల క్రితం భారత్‌ వచ్చేందుకు 70 మంది విద్యార్థులు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. కానీ, విమాన సర్వీసులు లేకపోవడంతో అక్కడే చిక్కకున్నారు. వీరితోపాటు పలు రాష్ట్రాల విద్యార్థులు కూడా అక్కడే ఉన్నారు. మొదటి నాలుగు రోజులు భారత రాయబార అధికారులు వసతి, ఆహారం అందజేశారు. అయితే, గత ఐదు రోజుల నుంచి ఆహారం, వసతి లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని ఎంపీలకు ఫోన్లు చేసి విలపిస్తున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయడంతో ఇక్కట్లు పడుతున్నామని వాపోతున్నారు.


మరిన్ని