close
అనఘా దత్త సొసైటీ ఆధ్వర్యంలో మహా విష్ణు సుదర్శన యజ్ఞం

కాల్గరి (కెనడా): కెనడా కాల్గరి అనఘా దత్త సొసైటీ (సాయిబాబా మందిరం) ఆధ్వర్యంలో మహా విష్ణు సుదర్శన యజ్ఞం తలపెట్టారు. ప్రపంచ శాంతి కోసం ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 26 వరకు ఆలయంలో నిత్య పూజలు, యాగాల్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆలయ ప్రధాన నిర్వాహకులు లలిత, శైలేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మూడేళ్లుగా భక్తి శ్రద్ధలతో ఆలయంలో పంచాయతన పూజలు, యాగాలు, నిత్య పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు రాజకుమార్‌ శర్మ, ఎంతో మంది వాలంటీర్లతో ఈ యాగ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మార్చి 28న మహా సుదర్శన యాగం నిర్వహించారని, ఏప్రిల్‌ 26న లక్ష్మీ నారాయణ శాంతి కల్యాణంతో ఈ క్రతువు పూర్తవుతుందని తెలిపారు. అందరూ మహా విష్ణు సుదర్శన మంత్రం, విష్ణు సహస్ర నామ పారాయణ పఠించి ఇందులో భాగస్వాములు కావాలని, విరాళాలు అందించి ఆలయానికి సహకరించాలని కోరారు.

 


వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.