దుబాయ్‌లో తెలుగు వారికి సాయం
close
దుబాయ్‌లో తెలుగు వారికి సాయం

దుబాయి: కరోనా వైరస్‌ దుబాయ్‌లోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి లాక్‌డౌన్‌ విధించడంతో అక్కడ చిన్నపాటి పనులు చేస్తూ జీవిస్తున్న తెలుగు వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు దుబాయ్‌లో నివాసముంటున్న తిరుపతి నియోజకవర్గానికి చెందిన ముక్కు తులసి కుమార్‌, కట్టారు సుదర్శన్‌, విశ్వేశ్వర్‌రావు ముందుకొచ్చారు. వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న పేదవారికి ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున 1000 కిలోల సోనా మసూరి బియ్యాన్ని పంపిణీ చేశారు. మున్ముందు మరిన్ని సహాయక కార్యక్రమాలు చేపడతామని వారు చెప్పారు. తెలుగు పేద ప్రజలెవరైనా ఇబ్బందుల్లో ఉంటే 971 582435489 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని ముక్కు తులసికుమార్‌ సూచించారు.


 


మరిన్ని