యూఎస్ ఎన్నారైల ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు 
close
యూఎస్ ఎన్నారైల ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు 

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలో యూఎస్‌ ఎన్నారైల ఆధ్వర్యంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బవికాటి రంగప్ప అండ్‌ లక్ష్మమ్మ మెమోరియల్ ట్రస్టు వ్యవస్థాపకులు డా. జయరాం నాయుడు, గుడివాడకు చెందిన ప్రవాసాంధ్రుడు శశికాంత్ వల్లేపల్లి, హెల్పర్ ఫౌండేషన్ అధ్యక్షుడు శేషు బాబు కానూరుల ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిపారు. తెదేపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సౌమ్య తంగిరాల ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ ఈ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా 20 వార్డుల్లో సోడియం హైపోక్లోరైడ్‌తో శానిటైజ్‌ చేశారు. 1500 కుటుంబాలకు నిత్యావసర సరకులను అందజేశారు. పోలీసులు, వైద్య సిబ్బంది, మీడియా ప్రతినిధులకు బాడీ సూట్లు, గ్లవ్స్, ఫేస్ మాస్కులు, ఇతర రక్షణ పరికరాలను పంపిణీ చేశారు. తెదేపా నేతలు విద్యాసాగర్, సత్యవతి, స్వర్ణలత, వెంకటరావు, సూర్యనారాయణ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. తమ సేవా దృక్పథాన్ని చాటుకుని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న ప్రవాసాంధ్రులను మాజీ ఎమ్మెల్యే సౌమ్య అభినందించారు.

Tags :

మరిన్ని