కిమ్‌ బాగుండాలని కోరుకుంటున్నా: ట్రంప్‌
close
కిమ్‌ బాగుండాలని కోరుకుంటున్నా: ట్రంప్‌

వాషింగ్టన్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బాగుండాలని కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. కిమ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌ మాట్లాడారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయని, అది ఒకవేళ నిజమైతే ఆయన బాగుండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కిమ్‌తో తనకి మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన క్షేమంగా ఉండాలని భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నట్లుగా ఆశిస్తున్నానని తెలిపారు. అయితే కిమ్‌ ఆరోగ్యం గురించి ప్రత్యక్ష సమాచారం ఏమైనా ఉందా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ సమాధానాన్ని నిరాకరించారు. వస్తున్న కథనాల ఆధారంగానే మాట్లాడుతున్నానని వెల్లడించానన్నారు.

కిమ్‌ గుండె శస్త్రచికిత్స నుంచి కోలుకుంటూ కోమాలోకి జారిపోయారని, బ్రెయిన్‌ డెడ్‌ అయ్యారని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దక్షిణ కొరియా అధికార వర్గాలు దీన్ని తోసిపుచ్చాయి. ఆయన తీవ్రస్థాయిలో అస్వస్థులయ్యారని చెప్పే నిర్దిష్ట సంకేతాలేవీ లేవని పేర్కొన్నాయి. అత్యంత సన్నిహితులతో కలిసి ఆయన రాజధాని ప్యాంగ్యాంగ్‌కు వెలుపల ఒక ప్రదేశంలో ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించాయి.

ఇదీ చదవండి

కిమ్‌కేమైంది?

వలసల నిషేధం 60 రోజులే: ట్రంప్‌

Tags :

మరిన్ని