ట్రంప్‌ వలసల నిషేధంతో భారత్‌పై ప్రభావమెంత?
close
ట్రంప్‌ వలసల నిషేధంతో భారత్‌పై ప్రభావమెంత?

అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం

దిల్లీ: అమెరికాలో వలసల్ని తాత్కాలికంగా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం భారతీయులపై ఎంతమేరకు ప్రభావం చూపుతుందో కేంద్రం అధ్యయనం చేస్తోందని సమాచారం. ఇప్పటికే ఆ దేశంలో స్థిరపడిన భారతీయులపై ఈ ప్రభావం ఉండబోదని భావిస్తున్నట్టు తెలిసింది.

కరోనా వైరస్‌ ముప్పుతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా నష్టపోతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌, ఆంక్షల కారణంగా అమెరికాలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో వలసల్ని ఆరు నెలల పాటు నిషేధించే ఉత్తర్వుపై ట్రంప్‌ బుధవారం సంతకం చేశారు.

 ట్రంప్‌ ఉత్తర్వు ప్రభావం ఎంతమంది భారతీయులపై ఉంటుందో ఇప్పటికిప్పుడే తెలియదు. అమెరికాలో స్థిరపడేందుకు దరఖాస్తులు చేస్తున్న వారిపై ప్రభావం పడొచ్చని తెలుస్తోంది.

‘అమెరికా ఉద్యోగులను కాపాడేందుకు వలసల్ని తాత్కాలికంగా నిషేధించే ఉత్తర్వుపై ఇప్పుడే సంతకం చేశాను’ అని ట్రంప్‌ బుధవారం అన్నారు. ఆ దేశంలో స్థిరపడాలనుకొనే వైద్యులు, నర్సులు, పెట్టుబడిదారులకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుత ఉత్తర్వు ఆరు నెలలు అమల్లో ఉండగా అవసరాన్ని బట్టి నిషేధాన్ని తగ్గించడం, పొడగించడం ఉంటుందని అమెరికా తెలిపింది.

చదవండి: మోదీపై 93.5% భారతీయులకు విశ్వాసం

చదవండి: సోనియాజీ.. చిల్లర రాజకీయాలొద్దు


మరిన్ని