యూఏఈలో నిత్యావసరాల పంపిణీ
close
యూఏఈలో నిత్యావసరాల పంపిణీ

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస ప్రవాస విభాగం సమన్వయకర్త బిగాల మహేశ్‌ ఆధ్వర్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోని తెలంగాణ కార్మికులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. దుబాయ్‌, షార్జా, అబూదాబి, పుజేరహ్‌, ఉమ్మాలుక్కువైన్‌లలో లాక్‌డౌన్‌తో కంపెనీలు మూతపడటంతో కార్మికులు ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న మహేశ్‌ సుమారు వేయి మంది కార్మికులకు నిత్యావసర వస్తువులను శనివారం అందజేశారు. కార్యక్రమంలో గల్ఫ్‌ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నర్సింహ, ఉపాధ్యక్షుడు శేఖర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

మరిన్ని