మే 3 తర్వాత స్వదేశానికి భారతీయులు?
close
మే 3 తర్వాత స్వదేశానికి భారతీయులు?

దిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మే 3తో లాక్‌డౌన్‌ గడువు ముగియనుండడంతో ఆ తర్వాతే వారిని భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు దీనితో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరగడంతో కేంద్రం దీనిపై దృష్టి సారించినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం ఓ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు విదేశాల్లో చిక్కుకుపోయిన పౌరుల జాబితాను రాష్ట్రాలను కేంద్రం కోరిందని సమాచారం. వారిని భారత్‌కు తీసుకొచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ప్రధానమంత్రి కార్యాలయం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించినట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం. వారు రాష్ట్రాల్లోకి వచ్చిన వెంటనే ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి స్థానిక కరోనా వైరస్‌ బాధితులతో వారిని కలవకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 

వివిధ దేశాలకు చెందిన రాయబారులు, ఉన్నతాధికారులతోనూ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపుతున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

ఇవీ చదవండి..

కిమ్‌ అక్కడ ఉన్నారా?

భారత్‌లో కరోనా: 24 గంటల్లో 1990 కేసులు

Tags :

మరిన్ని