బ్రిటన్‌లోని ప్రవాస విద్యార్థులకు నిత్యావసర సరకులు
close
బ్రిటన్‌లోని ప్రవాస విద్యార్థులకు నిత్యావసర సరకులు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నేపథ్యంలో బ్రిటన్‌లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న తెలంగాణ విద్యార్థులకు నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని స్థానిక తెరాస విభాగం నిర్ణయించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఆయా విద్యార్థులకు సీఎం కేసీఆర్‌ పేరిట ముద్రించిన కూపన్లు ఇచ్చి, వాటి ద్వారా సరకులు పొందే అవకాశం కల్పించనున్నారు. ఈ విషయాన్ని తెరాస యూకే అధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌, వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం తెలిపారు. దీనిలోభాగంగా సంబంధిత కూపన్లను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఆదివారమిక్కడ ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు.

 
Tags :

మరిన్ని