ఎన్‌ఆర్‌ఐల పెద్ద మనసు
close
ఎన్‌ఆర్‌ఐల పెద్ద మనసు

ఎమ్మెల్యే సీతక్క కృతజ్ఞతలు

ఈనాడు, వరంగల్‌: కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ములుగు నియోజకవర్గ ప్రజలను ఆదుకోవాలంటూ అమెరికాలోని పలువురు కాంగ్రెస్‌ మద్దతుదారులు రూ.3.2 లక్షలను విరాళంగా అందజేశారు. నియోజకవర్గ ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు గాను ఎమ్మెల్యే సీతక్క వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం లేఖ రాశారు. వారు అందజేసిన ప్రతి పైసాను పేదరికంలో ఉన్న తమ నియోజకవర్గ ప్రజల కడుపు నింపేందుకు వినియోగిస్తానని అందులో పేర్కొన్నారు. విరాళాలు అందజేసిన విజయ్‌ వెన్నం, రాజేశ్వర్‌రెడ్డి గంగసాని, తిరుపతిరెడ్డి ఎర్రంరెడ్డి, శ్రవంత్‌ పోరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి రామసహాయం, నరేందర్‌రెడ్డి ఎలమరెడ్డి, ధ్రువ చౌదరి నాగండ్ల, రాజేందర్‌ డిచ్‌పల్లిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

మరిన్ని