కరోనా కట్టడిలో అందరితో ముందుకు
close
కరోనా కట్టడిలో అందరితో ముందుకు

అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు

వాషింగ్టన్‌: కరోనాపై పోరులో అమెరికా, ఇజ్రాయెల్‌సహా ఇతర దేశాలతోనూ భారత్‌ సమన్వయంతో ముందుకు వెళ్తున్నట్లు అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు వెల్లడించారు. ఈ విషయంలో న్యూదిల్లీ నాయకత్వం.. తన మిత్రదేశాలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. అమెరికన్‌ జ్యూయిష్‌ కమిటీ(ఏజేసీ) సమావేశంలో సంధు మాట్లాడుతూ.. భారతదేశం, అమెరికా వ్యూహాత్మక భాగస్వాములని, కొవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కలిసి నడుస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా మందుల సరఫరా, శాస్త్రీయ సహకారం అందజేతకు భారత్‌ సుముఖంగా ఉందని వివరించారు. ఇండియాలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉందని.. లాక్‌డౌన్‌ అమలుకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఆయన అన్నారు. స్థానికంగా భారత ఆరోగ్యసిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని.. అమెరికా వారికి రుణపడి ఉందని ఏజేసీ ప్రతినిధి జేసన్‌ ఐజాక్సన్‌ తెలిపారు. భారత్‌ వైద్యపరికరాల తయారీ రంగం, ఔషద రంగం ప్రపంచాన్ని ఆదుకుంటోందన్నారు. కరోనా కారణంగా అమెరికా అతలాకుతలం అవుతోన్న విషయం తెలిసిందే.


మరిన్ని