
కాబోయే భర్తతో కలిసి రెస్టారెంట్లో నిరీక్షించిన జసిండా ఆర్డెర్న్
వెలింగ్టన్: కాబోయే భర్తతో కలిసి తమ రెస్టారెంట్‌కు వచ్చిన న్యూజిలాండ్ ప్రధానికి చోటు లేదని చెప్పేశారు... ఆ దేశ రాజధాని వెలింగ్టన్‌లోని ‘ఆలివ్’ నిర్వాహకులు! అందుకు ప్రధాని నొచ్చుకోలేదు సరికదా, తమ వంతు కోసం కాసేపు నిరీక్షించారు. న్యూజిలాండ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గడంతో రెండు రోజుల కిందటే దేశంలో ఆంక్షలను సడలించారు. ఈ క్రమంలో కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్‌తో కలిసి ప్రధాని జసిండా ఆర్డెర్న్ శనివారం ఆలివ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే అప్పటికే అక్కడి కుర్చీలన్నీ నిండిపోయినట్టు నిర్వాహకులు చెప్పారు. దీంతో వారిద్దరూ తమ వంతు కోసం కాసేపు నిరీక్షించి, వెనుతిరిగి వెళ్తుండగా... మేనేజర్ ఒకరు పరుగున వెళ్లి సీట్లు ఖాళీ అయ్యాయని చెప్పారు. దీంతో వారు మళ్లీ రెస్టారెంట్లోకి వెళ్లారు.
వార్తలు / కథనాలు
దేవతార్చన
- ‘బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను’
- అక్కాచెల్లెళ్ల మరణానికి ఆ నమ్మకమే కారణమా?
- దోచుకున్న నాలుగు గంటలకే దొరికేశారు
- RRR రిలీజ్.. ఇది అన్యాయం: బోనీకపూర్
- థాంక్యూ.. టీమ్ఇండియా అంటున్న లైయన్
- 21 ఏళ్లకే వ్యాపార పాఠాలు!
- వెజ్ బఫె రూ.500, నాన్‌వెజ్ బఫె రూ.700
- ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి
- అచ్యుతానందగిరి స్వామి దారుణ హత్య
- మదనపల్లె కేసు: రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు