close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఘనంగా ‘ఆటా’ ఝుమ్మంది నాదం పాటల పోటీలు

అమెరికా తెలుగు సంఘం (ఆటా)  “ఝుమ్మంది నాదం”  పాటల పోటీలు ఘనంగా కొనసాగుతున్నాయి. జూన్ 28న ప్రారంభమైన ఈ పోటీలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జూన్ 28న  సబ్ జూనియర్స్ నాన్ క్లాసికల్, జులై 4, 5 తేదీల్లో  జూనియర్స్ నాన్ క్లాసికల్ పాటల పోటీలను ఆన్‌లౌన్‌లో జూమ్ ద్వారా నిర్వహించారు. దాదాపుగా 82 మంది గాయనీగాయకులు అమెరికాలో పలు రాష్ట్రాల నుంచి ఆసక్తితో పాల్గొన్నారు. బోర్డు అఫ్ ట్రస్టీ రామ క్రిష్ణా రెడ్డి ఆల, ఝుమ్మంది నాదం ఛైర్ శారదా సింగిరెడ్డి  కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు.

అమెరికా, భారత్‌ నుంచి కర్నాటిక్ సంగీత విద్వాంసులు వాసగోపినాధ్  రావు, సంగీత దర్శకులు శ్రీని ప్రభల, రాజశేఖర్  సూరిభొట్ల,  ప్లేబ్యాక్ సింగర్, సంగీత దర్శకులు  నిహాల్ కొండూరి, ప్లేబ్యాక్ సింగర్లు నూతన మోహన్, మానస ఆచార్య, ప్రవీణ్ కుమార్ కొప్పోలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

ఆటా సంస్థ నార్త్  ఈస్ట్, సౌత్ ఈస్ట్, మిడ్ వెస్ట్,  సౌత్ వెస్ట్,  వెస్ట్‌ల నుంచి సబ్ జూనియర్స్ నాన్ క్లాసికల్ కేటగిరి గాయనీమణులు అమృత వుడుముల, అనన్య జొన్నాదుల, అనన్య  యెర గుడిపాటి, కృతి రాచకొండ, మహి  ఓత్ర, మిత్ర  చెబియం, పర్ణిక  వుల్లగంటి ,  శరణ్య ఎస్ , తన్వి గొంగల,  వైష్ణవి రెండుచింతలను “ఫైనలిస్ట్స్”గా ఎంపిక చేశారు.

ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీం రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్  భువనేశ్ రెడ్డి భుజాల , బోర్డు అఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజినల్ కోఆర్డినేటర్స్, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్, కాన్ఫరెన్స్ టీం, ఝుమ్మంది నాదం టీం,సోషల్ మీడియా టీం.. ఆటా సంస్థ కల్పించిన ఈగొప్ప సదవకాశాన్ని ఉపయోగించుకొని సంగీత విద్వాంసుల ముందు వారి సంగీత ప్రతిభను ప్రదర్శిస్తున్న గాయనీ గాయకులందరికి అభినందనలు తెలియజేశారు.

ఆటా సంస్థ లైవ్ ప్రచారం చేస్తున్న మన టీవి, మన టీవి ఇంటర్నేషనల్, టీవీ5 ,  జి.యన్‌.యన్‌, ఎ.బి.ఆర్ ప్రొడక్షన్స్.. అలాగే  తెలుగు ఎన్నారై రేడియో, టోరీ రేడియో మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియచేసింది.  ఝుమ్మంది నాదం పాటల పోటీలు విజయవంతానికి కృషి చేసిన ఆటా కార్యవర్గ బృందానికి ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి అభినందనలు తెలిపారు.

Tags :

మరిన్ని