
జలపాతంలో జారి పడి మృతి
గుడ్లవల్లేరు, న్యూస్టుడే: అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి కృష్ణా జిల్లా యువతి ఒకరు దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కమల (26) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం కొలంబియాలో ఉంటున్నారు. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతంవద్ద ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందారు. నాట్స్ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వార్తలు / కథనాలు
జిల్లా వార్తలు
దేవతార్చన
- నేను కాళికను.. ఆయన నా భర్తే కాదు..
- ద్వివేది, గిరిజా శంకర్ల అభిశంసన
- నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?
- బాధ్యతల నుంచి తప్పుకున్న చిత్తూరు కలెక్టర్
- అందుకు పశ్చాత్తాప పడుతున్నా
- తెల్ల బియ్యమా? దంపుడు బియ్యమా?
- మాక్సీకి రూ.10 కోట్లు చెల్లిస్తే తెలివిలేనట్లే!
- అమ్మకానికి 60 లక్షల మంది భారతీయుల నెంబర్లు
- ఎర్రకోటపై రైతుజెండా
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!