
హైదరాబాద్: అతి అరుదైన ‘శివ రహస్యం’ ప్రవచన మహా యజ్ఞం ప్రముఖ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. డిసెంబరు 3 నుంచి జనవరి 12 వరకూ హైదరాబాద్ సాకేత్ కాలనీ క్షిప్ర గణపతి దేవాలయంలో దాదాపు 40 రోజుల పాటు జరిగిన ఈ మహత్కార్యంలో లక్షా ఇరవై ఐదు వేల శ్లోకాలు కలిగిన శివ జ్ఞానం, శివ రహస్యం గ్రంథంలోని ఎన్నో అరుదైన విషయాలను సామవేదం షణ్ముఖ శర్మ విశదీకరించారు. ఇందులో భాగంగా శివపదార్చన రుషిపీఠం ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన వాణి గుండ్లాపల్లి సానోజ్ శివపద బృందం రోజూ శివ రహస్య ప్రవచనాన్ని యూట్యూబ్ వేదికగా దేశ-విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఎనిమిది దేశాల నుంచి దాదాపు 137 మంది గాయనీ గాయకులూ ఈ కార్యక్రమంలో పాల్గొని, శివపదాలను ఆలపించారు. పలువురు సంగీత విద్వాంసులు కూడా మహాయజ్ఞంలో భాగమయ్యారు.
వార్తలు / కథనాలు
జిల్లా వార్తలు
దేవతార్చన
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
- భలే పంత్ రోజు..