ఆస్టిన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఆస్టిన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలు అంగరంగవైభవం ముగిశాయి. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా, దేశ విదేశాల్లోని ఈ సంబరాలను ఘనంగా జరుపుకొన్నారు. విదేశాల్లో ఉన్నా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోకుండా ఈ వేడుకను కొనసాగిస్తున్నారు. తాజాగా ఆస్టిన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. మహిళలంతా కలిసి సంప్రదాయ దుస్తులు ధరించి పూలతో బతుకమ్మను పేర్చి, ఆడి పాడారు. చిన్నారులు కూడా ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని