close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘సరిలేరు నీకెవ్వరు’ కలెక్షన్స్‌.. దద్దరిల్లిపోయాయ్‌!

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీసు వద్ద విశేషమైన కలెక్షన్స్‌తో ప్రారంభమైంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలి రోజున అద్భుతమైన వసూళ్లు రాబట్టినట్లు విశ్లేషకులు తెలిపారు. తెలుగు రాష్ట్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్‌ రాబట్టినట్లు పేర్కొన్నారు. నైజాంలో రూ.8.66 కోట్లు, సీడెడ్‌లో రూ.4.15 కోట్లు, యూఏలో రూ.4.4 కోట్లు, కృష్ణలో రూ.3.07 కోట్లు, గుంటూరులో రూ.5.15 కోట్లు, తూ.గోలో రూ.3.35 కోట్లు, ప.గోలో రూ.2.72 కోట్లు, నెల్లూరులో రూ.1.27 కోట్లు సాధించిందని చెప్పారు. అంతేకాదు చిత్రం విదేశాల్లోనూ సత్తా చాటిందట. అమెరికాలోని 294 స్క్రీన్లలో సినిమా రూ.5.39 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నారు. ఇది ఓ అద్భుతమైన ఆరంభమని విశ్లేషకులు కామెంట్లు చేశారు.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. రష్మిక కథానాయిక. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, సంగీత, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో కనిపించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం మంచి రివ్యూలతోపాటు టాక్‌ అందుకుంది.



మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు