బైడెన్‌ కార్యవర్గంలోకి మరో ఇండో-అమెరికన్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బైడెన్‌ కార్యవర్గంలోకి మరో ఇండో-అమెరికన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యవర్గంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక స్థానం దక్కింది. భారత-అమెరికా సంతతికి చెందిన అరుణ్‌ వెంకట్రామన్‌ వాణిజ్య శాఖలోని గ్లోబల్‌ మార్కెట్స్‌కు  డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ అండ్‌ ఫారిన్‌ కమర్షియల్‌ సర్వీసుగా నియమించారు. ఆయన పలు కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలకు, అమెరికా ప్రభుత్వానికి అంతర్జాతీయ  వాణిజ్యంపై సలహాదారునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సెక్రటరీ ఆఫ్‌ కామర్స్‌కు కౌన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. బైడెన్‌-హారిస్‌ జట్టులో చేరక మందు వీసా సంస్థలో సీనియర్‌ డెరెక్టర్‌గా పనిచేశారు.

వెంకట్రామన్‌కు గతంలో స్టెప్టే అండ్‌ జాన్సన్‌ ఎల్‌ఎల్‌పీలో ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ అడ్వైజర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాదు చాలా సంస్థలకు ఈకామర్స్‌, ఇంటెలెక్చువల్‌ రైట్స్‌, ఫారిన్‌ ట్రేడ్‌ పాలసీల వంటి విషయాల్లో సలహాలు ఇచ్చారు. గతంలో ఒబామా  పాలనలో కూడా వెంకట్రామన్‌ కీలక పదవుల్లో ఉన్నారు. అప్పట్లో ఆయన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో పాలసీ డెరెక్టర్‌గా వ్యవహరించారు. అమెరికాకు చెందిన వాణిజ్య సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొనే సవాళ్లపై ఆయన పనిచేశారు. ఆయన యూఎస్‌టీఆర్‌లో భారత-అమెరికా వాణిజ్య విధానాల అభివృద్ధి, అమలు అంశాలకు సంబంధించి డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. యూఎస్‌టీఆర్‌లోకి రాక ముందు ప్రపంచ వాణిజ్య సంస్థలో లీగల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన కెరీర్‌ మొదట్లో అమెరికా  కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో జడ్జి వద్ద క్లర్క్‌గా పనిచేశారు.


మరిన్ని