US: కమలాహారిస్‌కు తప్పిన ప్రమాదం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
US: కమలాహారిస్‌కు తప్పిన ప్రమాదం

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసరంగా విమానాన్ని దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

గ్వాటెమాలా వెళ్లేందుకు కమలా హారిస్‌ ఆదివారం సాయంత్రం వాషింగ్టన్‌ నుంచి ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో బయల్దేరారు. అయితే టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో సిబ్బంది విమానాన్ని తిరిగి ఎయిర్‌బేస్‌కు మళ్లించి అత్యవసరంగా దించేశారు. టేకాఫ్‌ అయిన తర్వాత కొద్ది క్షణాలకు ల్యాండింగ్‌ గేర్‌లో అసాధారణ శబ్దం వచ్చినట్లు విమానంలో ఉన్న జర్నలిస్టు ఒకరు తెలిపారు అయితే ల్యాండింగ్‌లో ఎలాంటి సమస్య రాలేదని, విమానం క్షేమంగా దిగినట్లు చెప్పారు.

తాను క్షేమంగానే ఉన్నట్లు కమలా హారిస్‌ విమానం నుంచి బయటకు వస్తూ విలేకరులకు తెలిపారు. ఆ తర్వాత మరో విమానంలో ఆమె గ్వాటెమాలా వెళ్లిపోయారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వారంలో ఆమె గ్వాటెమాలా, మెక్సికోలో పర్యటించనున్నారు.


మరిన్ని