close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమరావతి కోసం ఎన్నారైల వెబ్‌సైట్‌

అమరావతి: రాజధానిగా అమరావతిని నిలుపుకొనేందుకు రైతులు చేస్తున్న ఉద్యమానికి వాసాంధ్రులు దన్నుగా నిలిచారు. మూడు రాజ‌ధానులను తీవ్రంగా నిర‌సిస్తూ వారు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ nrisforamaravati.org అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. రాజధాని అమరావతిని కాపాడుకోవాలనే సంకల్పంలో భాగంగా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆన్‌లైన్‌ వేదికగా ఓ కార్యక్రమం నిర్వహించారు. రాజ‌ధాని ఉద్యమంలో పోలీసు లాఠీల‌కు సైతం ఎదురొడ్డి నిలిచిన మ‌హిళలు శ్రీల‌క్ష్మి, కుక్కుమ‌ళ్ల పిచ్చమ్మ ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జయరాం కోమటి తొలుత ప్రసంగించారు. డాక్టర్‌ శ్రీనివాసరావు కొడాలి సహా రైతు, దళిత, ఇతర జేఏసీ నాయకులు మాట్లాడారు. ఉద్యమంలో ఆది నుంచి కీల‌క పాత్ర పోషిస్తున్న మ‌హిళా రైతులు, మ‌హిళ‌లు, యువ‌తులు కూడా త‌మ అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలను వివరించారు. 

ఈ వెబ్‌సైట్‌ రూపకల్పనలో చందు గొర్రపాటి, స‌తీశ్ వేమ‌న‌, ర‌త్న ప్రసాద్‌, ఠాగూర్‌, సాయి స‌హా అనేక మంది త‌మ విలువైన స‌మ‌యాన్ని వెచ్చించారు. వెబ్‌సైట్ ప్రారంభోత్స కార్యక్రమంలో బుచ్చి రామ్ ప్రసాద్, కృష్ణా గంపా, ప్యాలా ప్రసాద్‌, ర‌జ‌నీకాంత్‌, శ్రీమంత్‌, శివ‌శంకర్,‌ గంగాధ‌ర్, శ్రీనివాస్ గుత్తికొండ‌, మోహ‌న్‌కృష్ణ మ‌న్నవ, శ్రీధ‌ర్ అప్పసాని, కిశోర్ కంచెర్ల‌, సంప‌త్ కామినేని, శ్యాం మ‌ద్దాలి, విజ‌య్ శేఖ‌ర్ అన్నే, డాక్టర్‌ మధు కొర్రపాటి, డాక్టర్‌ ర‌వీంద్ర ఆల‌పాటి, శ్రీనివాస మంచిక‌ల‌పూడి, ప్రసాద్‌ చుక్కపల్లి, అంజ‌య్య చౌద‌రి లావు, డాక్టర్‌ అప్పారావు ముక్కాముల‌, ప్రశాంత్‌ పిన్నమనేని, గంగాధ‌ర్ నాదెళ్ల‌, ర‌వి మండ‌లాపు, సురేష్ పుట్టగుంట, సతీష్‌ వేమూరి, ముర‌ళి వెన్నం, చ‌ల‌ప‌తి కొండ్రగుంట, శ్రీనివాస లావు, సత్యనారాయణ వాసిరెడ్డి పాల్గొన్నారు. అమ‌రావ‌తి ఉద్యమంలో తాము కూడా కీలక పాత్ర పోషిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ జయరాం కోమటి ధన్యవాదాలు తెలిపారు.


మరిన్ని