అమెరికాలోని వలసదారులకు గుడ్‌ న్యూస్‌
close
అమెరికాలోని వలసదారులకు గుడ్‌ న్యూస్‌

రెండు కీలక బిల్లులకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం

వాషింగ్టన్‌: సరైన పత్రాలు లేకుండా తమ దేశానికి వచ్చిన వారు, చట్టబద్ధంగా వలస వచ్చిన వారి సంతానం సహా లక్షలాది మంది భారతీయ వలసదారుల పౌరసత్వానికి వీలుకల్పించే రెండు కీలక బిల్లులకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులకు 228-197 ఓట్లతో ఆమోదం లభించింది. తాత్కాలిక రక్షణ హోదా కలిగిన వారు, డ్రీమర్లకు అమెరికా పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లుల ద్వారా వీలుకలుగనుంది. చిన్నారులుగా ఉన్న సమయంలో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వలసవచ్చి ప్రస్తుతం యువతగా మారిన వారిని డ్రీమర్లుగా పరిగణిస్తుంటారు. అలాంటివారు 5 లక్షల మంది భారతీయులు సహా అమెరికాలో 1.10 కోట్ల మంది ఉన్నారు.

హెచ్‌1బి వీసా ద్వారా వచ్చినవారి సంతానానికి పౌరసత్వం కల్పించేందుకు కూడా ఈ బిల్లుల ద్వారా వీలు కలగనుంది. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ బిల్లులు సెనేట్‌ ఆమోదానికి పంపనున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం తర్వాత ఇవి చట్టాలుగా మారనున్నాయి. దేశ వలస విధానాన్ని సంస్కరించడంలో ఈ బిల్లులు మొదటి అడుగు అని జో బైడెన్‌ వ్యాఖ్యానించారు.



మరిన్ని