close

తాజావార్తలు

డిపెండెంట్‌ వీసాపై ప్రయాణం చేయవచ్చు

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి...
2024 వరకు చెల్లుబాటయ్యే డిపెండెంట్‌ వీసా ఉంది. గడిచిన 18 నెలల్లో ఆ వీసాపై ప్రయాణం చేయలేదు. కుటుంబ కారణాలతో భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. అందుకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను ఇంకా ఆరంభించలేదు. ఆ డిపెండెంట్‌ వీసాపై ప్రయాణం చేయవచ్చా?

- అనిమేష సీవీ

డిపెండెంట్‌ వీసాపై మీరు అమెరికా ప్రయాణం చేయవచ్చు. చట్టబద్ధంగా మీరు విడాకులు తీసుకున్న తరవాత ఆ డిపెండెంట్‌ వీసా చెల్లదు. నమోదు చేసిన గడువులోగా అమెరికా ప్రవేశ ప్రాంతం వరకు వెళ్లేందుకు మాత్రమే మీ వీసా అనుమతిస్తుంది. అమెరికాలోకి మిమ్మల్ని అనుమతించాలా? వద్దా? అన్నది ప్రవేశ ప్రాంతంలోని ఇమిగ్రేషన్‌ అధికారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
బీ1/బీ2 వీసాపై ఒకసారి అమెరికా వెళ్లివచ్చాను. వచ్చే ఏడాదితో వీసా కాలం చెల్లనుంది. ఇప్పుడు వీసాను పునరుద్ధరించుకోవచ్చా? గడువు తీరేంత వరకు వేచి ఉండాలా?

- రామసుబ్బయ్య కావూరు

ఎప్పుడైనా వీసాను మీరు పునరుద్ధరించుకోవచ్చు. గడువు తీరడానికి ఆరు నెలలలోపు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకుంటే మంచిదన్నది సూచన. ముందుగా దరఖాస్తు చేసుకోవటం ద్వారా ఇంటర్వ్యూ మినహాయింపునకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. మరింత సమాచారం కోసం www.ustraveldocs.com/in చూడండి.
గడిచిన ఏడాది నుంచి నా హెచ్‌1బీ వీసాను వినియోగించలేదు. అదే కంపెనీలో పని చేస్తున్నాను. అమెరికా వెళ్లేందుకు ఆ కంపెనీ ఆమోదం కూడా లభించింది. ఆ వీసాపై ప్రయాణం చేయవచ్చా? ప్రవేశ ప్రాంతంలో ఏమైనా సమస్య వస్తుందా?

- రవి శ్రీనివాస్‌ కోవిద్‌

హెచ్‌1బీ వీసాలో పేర్కొన్న హోదాలో, అదే కంపెనీలో పనిచేస్తున్న పక్షంలో ఆ వీసాపై ప్రయాణం చేయవచ్చు. మీ కోసం పిటిషన్‌ దాఖలు చేసిన కంపెనీలో మీరు పని చేయకపోయినా, ఉద్యోగంలో మార్పులు జరిగినా ఆ వీసాపై ప్రయాణం చేయలేరు. మీ ప్రయాణ సమయానికి వీసా కాలవ్యవధి తీరకపోతేనే ప్రయాణానికి అవకాశం ఉంటుంది.
వచ్చే ఏడాది మార్చిలో నా మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి అవుతుంది. కెమికల్‌ ఇంజినీరింగులో పీహెచ్‌డీ చేద్దామనుకుంటున్నాను. స్కాలర్‌షిప్‌, ఉపకార వేతనం పొందేందుకు అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవటం ఎలా?

- రవీష్‌ సుధన్వ ఎమ్వీ

పట్టభద్రులకు అమెరికాలోని చాలా విశ్వవిద్యాలయాలు స్కాలర్‌షిప్‌లు, ఉపకార వేతనాలు, ఇతర మార్గాల ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నాయి. ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో తీరుగా ఆ విధానాన్ని అమలు చేస్తాయి. ఎక్కడ చదవాలన్నది నిర్ణయించుకున్న తరవాత ఆయా విద్యా సంస్థలకు చెందిన ఆర్థిక వ్యవహారాల సహాయ అధికారిని నేరుగా సంప్రదిస్తే మరింత సమాచారం లభిస్తుంది. అమెరికాలో చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌, ఫెలోషిప్‌కు సంబంధించిన అదనపు సమాచారం కోసం www.usief.org.in చూడండి.

* వీసాలకు సంబంధించిన నిర్దుష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను supportindia@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేయండి.
* మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌
http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు.
* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను
usvisa@eenadu.netకు పంపగలరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.