close

తాజావార్తలు

నేనో పేద విద్యార్థిని: కపిల్‌దేవ్‌

గుంటూరు: రామినేని ఫౌండేషన్‌ సేవలు శ్లాఘనీయమని మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ అన్నారు. గుంటూరులో రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా పురస్కారాలు ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా కపిల్ మాట్లాడుతూ.. ఏ సంస్థనైనా ప్రారంభించడం సులువేనని.. అయితే దానిని కొనసాగించడమే కష్టమని అన్నారు. గురువులను విద్యార్థులు గౌరవించడం ప్రాథమిక విధి అని తెలిపారు. ‘ నేనో పేద విద్యార్థిని. నా గురువులు ఇప్పటికీ గుర్తున్నారు. విద్యార్థులపై గురుతర బాధ్యత ఉంది. దేశ  భవిష్యత్‌ విద్యార్థులపైనే ఆధారపడి ఉంది. ఏ వృత్తినైనా ప్రేమిస్తే అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు’’ అని కపిల్‌ దేవ్‌ అన్నారు.

ఈ సందర్భంగా 106 మంది ఉపాధ్యాయులకు గురు పురస్కారాలు, 84 మందికి గురు సన్మానాలు ప్రదానం చేశారు. మరో 261 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం  చేశారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మంత్రి ఆదిమూలపు సురేశ్‌,  మండలి డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యంతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.