close

తాజావార్తలు

విశ్వమానవ శ్రేయస్సే ధ్యేయంగా..


ఇంటర్నెట్ డెస్క్‌: విశ్వసాయి ద్వారకామాయి శక్తిపీఠం చేపట్టిన  ‘కోటి శ్రీ శిరిడి సాయి గాయత్రి మహా మంత్ర జపం’, అన్నదాన కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. దసరా నవరాత్రుల సందర్భంగా మొదలు పెట్టిన ఈ కార్యక్రమాలు డిసెంబరు 12న దత్త జయంతి వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శిరిడి సాయి గాయత్రి మహా మంత్ర జపాలను భక్తులు తమ గృహాల్లో కానీ, దగ్గర్లో ఉన్న దేవాలయాల్లో కానీ నిర్వహించవచ్చని శక్తి పీఠం నిర్వాహకులు తెలిపారు. ఈ జపం నిర్వహించేటప్పుడు ‘‘ఓం శిరిడి వాసాయ విద్మహే! సర్వ సిద్ధిశ్చ ధీమహి! తన్నో సాయి ప్రచోదయాత్‌!!’’ అను శిరిడీ సాయి గాయత్రి మంత్రాన్ని 9, 18, 54, 108, ...10800 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఈ మంత్రాన్ని జపించాలన్నారు. మంత్రాన్ని జపించిన తరువాత ఆ సంఖ్యను viswa sai యాప్‌లో కానీ, www. viswasaidwarakamai.org వెబ్‌సైట్‌లో కానీ, info@viswasaidwarakamai.org మెయిల్‌కు కానీ పంపాలని నిర్వాహకులు కోరారు.  మంత్ర జపంతో పాటు భక్తులు తమకు వీలైనంతలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఈ సేవా సంస్థ కార్యాలయాలు అమెరికా, కెనడా, భారతదేశాలలో ఉన్నాయి. ఈ మహా మంత్ర జపం కార్యక్రమం పూర్తయిన తరువాత డిసెంబర్‌ 14న గురూజి లక్ష్మోజి ఆధ్వర్యంలో శిరిడి సాయి శాంతి హోమం సంపూర్ణం చేయడం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.