
తాజావార్తలు
హెచ్-4 వీసాదారులకు ఊరట
ప్రస్తుతానికి రద్దు కుదరదన్న అమెరికా కోర్టు
భారతీయ మహిళలకు ప్రయోజనం
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న వేలాదిమంది భారతీయులకు తాత్కాలిక ఊరట! హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల(హెచ్-4 వీసాదారులు) ఉద్యోగ అనుమతులను రద్దు చేసేందుకు అక్కడి న్యాయస్థానమొకటి నిరాకరించింది. ఈ వ్యవహారంలో మరింత లోతైన పరిశీలన అవసరమని అభిప్రాయపడింది. స్థానికులకు ఉద్యోగాలు కరవవుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో హెచ్-4 వీసాదారుల ఉద్యోగ అనుమతులను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం చాలాకాలంగా భావిస్తోంది. దీనిపై దాఖలైన కేసులో విచారణ నిర్వహించిన యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. హెచ్-4 వీసాదారుల ఉద్యోగ అనుమతులను ప్రస్తుతానికి రద్దు చేయలేమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో డిస్ట్రిక్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. లోతైన విశ్లేషణ జరిపాలంటూ దిగువ కోర్టుకు తిరిగి కేసును అప్పగించింది.
హెచ్-1బీ వీసా అంటే? ఇది వలసేతర వీసా. అమెరికా సంస్థలు విదేశీ నిపుణులను ఉద్యోగాల్లో చేర్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. |
హెచ్-4 వీసా అంటే? హెచ్-1బీ వీసాదారుల కుటుంబ సభ్యులు (జీవిత భాగస్వామి, పిల్లలు) అమెరికాలో నివసించేందుకు దీన్ని మంజూరు చేస్తారు. |
అనుమతులు ఎప్పటి నుంచి? 2015లో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హెచ్-4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు కల్పిస్తూ ప్రత్యేక నిబంధన తీసుకొచ్చారు. |
1,00,000+ |
నాలుగింట మూడొంతులు మనోళ్లే 4,19,637:హెచ్-1బీ వీసాపై పని చేస్తున్న మొత్తం విదేశీయుల సంఖ్య * 2018 అక్టోబరు నాటి లెక్కల ప్రకారం |
వివాదమేంటి? |
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
- ‘కబీర్‌సింగ్’ సీన్లుఇబ్బంది పెట్టాయని తెలుసు!
- నా జీవితంలో గొప్ప విషయమిదే: రాహుల్ సిప్లిగంజ్
- రూ.3.5 కోట్లు ఫ్రిడ్జ్‌లో పెట్టి..!
- గ్లూటెన్ ఉంటే ఏంటి?
- బాలయ్య సినిమాలో విలన్‌గా శ్రీకాంత్..?
- ఈగల్ 2.0 రోబో టీచరమ్మ!
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా