
1/13

అలా కన్నుగీటి యువ హృదయాలను కొల్లగొట్టిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్.
2/13

2019లో వచ్చిన ‘ఒరు అడార్ లవ్’(తెలుగులో లవర్స్ డే) చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.
3/13

‘తన్హా’, ‘నీ వానమ్ నాన్ మజ్హై’, ‘కాదలాసు తోని’ తదితర చిన్న చిత్రాల్లో నటించింది.
4/13

నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెక్’లో కథానాయికగా నటించింది.
5/13

చంద్రశేఖర్ యేలేటి తీసిన ‘విస్మయం’ చూసి ‘చెక్’లో అడగ్గానే ఒప్పుకొంది.
6/13

‘‘దక్షిణాదిలో తమిళంలో తప్ప మిగతా మూడు ప్రధాన భాషల్లోనూ నటించా. హిందీలోనూ చేశా. ఒక భాషకి పరిమితం కాకుండా... ఎక్కడ మంచి కథ వస్తే అక్కడ నటిస్తూ ప్రయాణం చేస్తా’’
7/13

‘‘నటనతోపాటు... నృత్యం, సంగీతంలోనూ నాకు ప్రవేశం ఉంది. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నా’’
8/13

‘‘కన్నడలో నేను నటించిన ‘విష్ణుప్రియ’ సినిమాలోనూ పాట పాడా. మలయాళంలోనూ పాడా. తెలుగు, హిందీల్లో ఆల్బమ్ గీతాలు ఆలపించా. సినిమాల్లో పాడే అవకాశం వస్తే అస్సలు వదులుకోను’’.
9/13

‘‘21 ఏళ్ల ఓ సాధారణ అమ్మాయి ఎలా ఉంటుందో నేనూ అంతే. తోడుగా ఒకరున్నారంటే వాళ్లతో సరదాగా మాటలు చెప్పుకొంటూ గడిపేస్తా’’
10/13

‘‘సినిమాకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం మాది. మా నాన్న సెంట్రల్ జీఎస్టీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అమ్మ గృహిణి. నాకు తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ తమ్ముడున్నాడు’’
11/13

‘‘‘‘చిన్నప్పట్నుంచి నటన అంటే ఇష్టం. అద్దం ముందు నిలుచుని డైలాగులు చెప్పడం, ఏదో ఒక సన్నివేశం ఎంచుకుని నటించడంలాంటి పనులు చేసేదాన్ని’’
12/13

‘‘ కొన్ని లఘు చిత్రాలు, ఓ చిత్రంలో చిన్న పాత్ర చేశాక... ‘లవర్స్ డే’లోని కన్నుగీటే సన్నివేశం అంతర్జాలంలో వైరల్ అయ్యింది’’
13/13
