2021 క్రీడా తారల అదిరిపోయే ఫొటోలు

Published : 30 Dec 2021 12:46 IST
1/17
టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ-అనుష్క దంపతులు ఈ ఏడాది ఆరంభంలో తల్లిదండ్రులయ్యారు. ఆ పాపకు వామికా అని పేరు పెట్టగా.. తన ఫొటోలను బయటి ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇష్టపడటం లేదు. దీంతో ఇలా వామికా ముఖం కనపడకుండా తీసుకున్న పలు చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అలాగే రెండో ఫొటోలో విరాట్‌.. మాజీ సారథి ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినప్పుడు పంచుకున్నాడు. మూడోది ఆర్సీబీ ఈ ఏడాది ఐపీఎల్‌లో డివిలియర్స్‌, మాక్స్‌వెల్‌తో దిగింది. టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ-అనుష్క దంపతులు ఈ ఏడాది ఆరంభంలో తల్లిదండ్రులయ్యారు. ఆ పాపకు వామికా అని పేరు పెట్టగా.. తన ఫొటోలను బయటి ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇష్టపడటం లేదు. దీంతో ఇలా వామికా ముఖం కనపడకుండా తీసుకున్న పలు చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అలాగే రెండో ఫొటోలో విరాట్‌.. మాజీ సారథి ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినప్పుడు పంచుకున్నాడు. మూడోది ఆర్సీబీ ఈ ఏడాది ఐపీఎల్‌లో డివిలియర్స్‌, మాక్స్‌వెల్‌తో దిగింది.
2/17
తెలుగు తేజం పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సందర్భంగా తీసింది తొలి చిత్రం. రెండోది ఒక రేస్‌కోర్ట్‌లో సరదాగా తీసుకుంది. ఇక చివరి రెండు ఫొటోలు వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా తీసుకున్నవి. తెలుగు తేజం పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సందర్భంగా తీసింది తొలి చిత్రం. రెండోది ఒక రేస్‌కోర్ట్‌లో సరదాగా తీసుకుంది. ఇక చివరి రెండు ఫొటోలు వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా తీసుకున్నవి.
3/17
ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించిన అపురూప చిత్రం. రెండోది తన తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించిన సందర్భం. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించిన అపురూప చిత్రం. రెండోది తన తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించిన సందర్భం.
4/17
రోహిత్‌ శర్మ ఈ ఏడాది పలు సందర్భాల్లో తన భార్య రితిక, కూతురు సమైరాతో దిగిన ఫొటోలు. తొలి ఫొటో ఒక విహార యాత్రలో తీసుకోగా రెండోది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా మైదానంలో తన కుమార్తెతో ఇలా సరదాగా తీసుకున్న ఫొటో. ఇక చివరి రెండు ఫొటోలు భార్యతో తీసుకున్న సెల్ఫీలు. రోహిత్‌ శర్మ ఈ ఏడాది పలు సందర్భాల్లో తన భార్య రితిక, కూతురు సమైరాతో దిగిన ఫొటోలు. తొలి ఫొటో ఒక విహార యాత్రలో తీసుకోగా రెండోది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా మైదానంలో తన కుమార్తెతో ఇలా సరదాగా తీసుకున్న ఫొటో. ఇక చివరి రెండు ఫొటోలు భార్యతో తీసుకున్న సెల్ఫీలు.
5/17
క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఈ ఏడాది పలు పాత జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నాడు. తన కుమార్తె సారా, కుమారుడు అర్జున్‌తో సహా మాజీ క్రికెటర్లు సెహ్వాగ్‌, గంగూలీ, యువరాజ్‌, హర్భజన్‌లతో దిగిన పాత ఫొటోలను పోస్టులు చేశాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఈ ఏడాది పలు పాత జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నాడు. తన కుమార్తె సారా, కుమారుడు అర్జున్‌తో సహా మాజీ క్రికెటర్లు సెహ్వాగ్‌, గంగూలీ, యువరాజ్‌, హర్భజన్‌లతో దిగిన పాత ఫొటోలను పోస్టులు చేశాడు.
6/17
జస్ప్రిత్‌ బుమ్రా ఈ ఏడాది పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. తన సతీమణి సంజనతో కలిసి వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫొటోలను పంచుకున్నాడు. ఇందులో రెండోది ఇంగ్లాండ్‌లో తీసుకోగా నాలుగు ఫొటో దక్షిణాఫ్రికాలో తీసుకున్నాడు. జస్ప్రిత్‌ బుమ్రా ఈ ఏడాది పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. తన సతీమణి సంజనతో కలిసి వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫొటోలను పంచుకున్నాడు. ఇందులో రెండోది ఇంగ్లాండ్‌లో తీసుకోగా నాలుగు ఫొటో దక్షిణాఫ్రికాలో తీసుకున్నాడు.
7/17
ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన హర్భజన్‌ సింగ్‌ ఈ ఏడాది కొన్ని అద్భుతమైన చిత్రాలు పంచుకున్నాడు. అందులో ఒకటి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ టాటూ గుండెలపై వేసుకొని అభిమానులతో పంచుకున్నాడు. రెండోది యువకుడిగా కెరీర్‌ ఆరంభించే రోజుల్లో తీసుకున్న ఫొటో. ఇక మూడోది అమృత్‌సర్‌లోని స్వర్ణ మందిరం వద్ద తీసుకున్నది. నాలుగోది బూర్జ్‌ ఖలీఫా ముందు తీసుకున్నది.  ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన హర్భజన్‌ సింగ్‌ ఈ ఏడాది కొన్ని అద్భుతమైన చిత్రాలు పంచుకున్నాడు. అందులో ఒకటి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ టాటూ గుండెలపై వేసుకొని అభిమానులతో పంచుకున్నాడు. రెండోది యువకుడిగా కెరీర్‌ ఆరంభించే రోజుల్లో తీసుకున్న ఫొటో. ఇక మూడోది అమృత్‌సర్‌లోని స్వర్ణ మందిరం వద్ద తీసుకున్నది. నాలుగోది బూర్జ్‌ ఖలీఫా ముందు తీసుకున్నది.
8/17
యువరాజ్‌ సింగ్‌ ఈ ఏడాది తన చిన్ననాటి ఫొటో ఒకటి పంచుకున్నాడు. అది కాకుండా రెండో ఫొటోలో తన కొత్త లుక్‌ని చూపించాడు. ఇక మూడో చిత్రం రోడ్‌ సేఫ్టీ సిరీస్‌ సందర్భంగా తీసుకున్న సెల్ఫీ. నాలుగోది రాండమ్‌ క్లిక్‌. యువరాజ్‌ సింగ్‌ ఈ ఏడాది తన చిన్ననాటి ఫొటో ఒకటి పంచుకున్నాడు. అది కాకుండా రెండో ఫొటోలో తన కొత్త లుక్‌ని చూపించాడు. ఇక మూడో చిత్రం రోడ్‌ సేఫ్టీ సిరీస్‌ సందర్భంగా తీసుకున్న సెల్ఫీ. నాలుగోది రాండమ్‌ క్లిక్‌.
9/17
యుజువేంద్ర చాహల్‌ ఈ ఏడాది తన భార్యతో కలిసి పలు విహార యాత్రలకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కశ్మీర్‌ మంచు పర్వాతాల్లో పలు ఫొటోలు తీసుకున్నాడు. మరోవైపు రెండో ఫొటో ఐపీఎల్‌ సందర్భంగా ఏబీ డివిలియర్స్‌తో సరదాగా బల ప్రదర్శన పోటీ ఆడుతున్న చిత్రం. యుజువేంద్ర చాహల్‌ ఈ ఏడాది తన భార్యతో కలిసి పలు విహార యాత్రలకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కశ్మీర్‌ మంచు పర్వాతాల్లో పలు ఫొటోలు తీసుకున్నాడు. మరోవైపు రెండో ఫొటో ఐపీఎల్‌ సందర్భంగా ఏబీ డివిలియర్స్‌తో సరదాగా బల ప్రదర్శన పోటీ ఆడుతున్న చిత్రం.
10/17
హార్దిక్‌ పాండ్య ఈ ఏడాది చాలా ఫొటోలు పంచుకున్నాడు. ఇందులో మొదటిది ఒక హాలిడే ట్రిప్‌లో తన కుమారుడితో సరదాగా సముద్రం ఒడ్డున తీసుకున్న ఫొటో. రెండోది తన తండ్రి ఫొటోను హత్తుకునే సందర్భంలో తీసింది. ఇక మూడు, నాలుగు ఫొటోలు తన భార్య, కుమారుడితో సరదాగా తీసుకున్న చిత్రాలు. హార్దిక్‌ పాండ్య ఈ ఏడాది చాలా ఫొటోలు పంచుకున్నాడు. ఇందులో మొదటిది ఒక హాలిడే ట్రిప్‌లో తన కుమారుడితో సరదాగా సముద్రం ఒడ్డున తీసుకున్న ఫొటో. రెండోది తన తండ్రి ఫొటోను హత్తుకునే సందర్భంలో తీసింది. ఇక మూడు, నాలుగు ఫొటోలు తన భార్య, కుమారుడితో సరదాగా తీసుకున్న చిత్రాలు.
11/17
ఈ ఏడాది జరిగిన రోడ్‌ సేఫ్టీ సిరీస్‌ కోసం విమానంలో ప్రయాణిస్తుండగా తీసుకున్న అలనాటి స్టార్లతో కలిసి దిగిన ఫొటో పంచుకున్న ఇర్ఫాన్‌ పఠాన్‌. రెండోది తన సోదురడు యూసుఫ్‌ పఠాన్‌తో కలిసి ట్రోఫీ తీసుకున్న చిత్రం. ఈ ఏడాది జరిగిన రోడ్‌ సేఫ్టీ సిరీస్‌ కోసం విమానంలో ప్రయాణిస్తుండగా తీసుకున్న అలనాటి స్టార్లతో కలిసి దిగిన ఫొటో పంచుకున్న ఇర్ఫాన్‌ పఠాన్‌. రెండోది తన సోదురడు యూసుఫ్‌ పఠాన్‌తో కలిసి ట్రోఫీ తీసుకున్న చిత్రం.
12/17
యువ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ ఒక సందర్భంలో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీతో కలిసి దిగిన ఫొటో కాగా, రెండోది విదేశాల్లో విహార యాత్రకు వెళ్లినప్పుడు గుర్రంతో సరదాగా తీసుకున్న ఫొటో. యువ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ ఒక సందర్భంలో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీతో కలిసి దిగిన ఫొటో కాగా, రెండోది విదేశాల్లో విహార యాత్రకు వెళ్లినప్పుడు గుర్రంతో సరదాగా తీసుకున్న ఫొటో.
13/17
సురేశ్‌ రైనా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఈ ఏడాది పంచుకున్న ఫొటోలు. తొలి ఫొటో దుబాయ్‌లో తీసుకోగా రెండోది తన ముద్దుల కుమార్తెతో ఒక హాలిడే ట్రిప్‌లో సరదాగా తీసుకుంది. ఇక మూడోది ఐపీఎల్‌లో సీఎస్కే ట్రోఫీ సాధించాక తన సారథి ధోనీ కుటుంబ సభ్యులతో దిగింది. చివరి ఫొటో యూఏఈలోనే ఒక రెస్టారెంట్‌లో కుటుంబ సభ్యులతో కలిసి దిగింది. సురేశ్‌ రైనా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఈ ఏడాది పంచుకున్న ఫొటోలు. తొలి ఫొటో దుబాయ్‌లో తీసుకోగా రెండోది తన ముద్దుల కుమార్తెతో ఒక హాలిడే ట్రిప్‌లో సరదాగా తీసుకుంది. ఇక మూడోది ఐపీఎల్‌లో సీఎస్కే ట్రోఫీ సాధించాక తన సారథి ధోనీ కుటుంబ సభ్యులతో దిగింది. చివరి ఫొటో యూఏఈలోనే ఒక రెస్టారెంట్‌లో కుటుంబ సభ్యులతో కలిసి దిగింది.
14/17
ఇషాన్‌ కిషన్‌ 2021లో విహారయాత్రలకు వెళ్లిన చిత్రాలు. మొదటిది లద్దాఖ్‌లో తీసుకున్నది. రెండోది యూఏఈలో సముద్ర జలాల్లో స్పీడ్‌ బోట్‌పై వెళ్తున్న చిత్రం. ఇక మూడో పప్పీలతో ఆడుకుంటుండగా తీసుకున్నది. చివరి ఫొటో తన క్రికెట్‌ స్నేహితులతో దిగింది. ఇషాన్‌ కిషన్‌ 2021లో విహారయాత్రలకు వెళ్లిన చిత్రాలు. మొదటిది లద్దాఖ్‌లో తీసుకున్నది. రెండోది యూఏఈలో సముద్ర జలాల్లో స్పీడ్‌ బోట్‌పై వెళ్తున్న చిత్రం. ఇక మూడో పప్పీలతో ఆడుకుంటుండగా తీసుకున్నది. చివరి ఫొటో తన క్రికెట్‌ స్నేహితులతో దిగింది.
15/17
ఈ ఏడాది దీపావళి సందర్భంగా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కుటుంబ సమేతంగా తీసుకున్న చిత్రం ఈ ఏడాది దీపావళి సందర్భంగా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కుటుంబ సమేతంగా తీసుకున్న చిత్రం
16/17
రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈ ఏడాది వివిధ సందర్భాల్లో తీసుకున్న చిత్రాలు. మొదటి ఫొటో రాండమ్‌ క్లిక్‌ కాగా రెండోది ఐపీఎల్‌లో ట్రోఫీ సాధించాక తీసుకున్నది. ఇక మూడో ఫొటో ఒక విహార యాత్రకు వెళ్లిన సందర్భంగా తీసింది. చివరి ఫొటోలో తన స్నేహితురాలితో దిగింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈ ఏడాది వివిధ సందర్భాల్లో తీసుకున్న చిత్రాలు. మొదటి ఫొటో రాండమ్‌ క్లిక్‌ కాగా రెండోది ఐపీఎల్‌లో ట్రోఫీ సాధించాక తీసుకున్నది. ఇక మూడో ఫొటో ఒక విహార యాత్రకు వెళ్లిన సందర్భంగా తీసింది. చివరి ఫొటోలో తన స్నేహితురాలితో దిగింది.
17/17
ఈ ఏడాది కర్వా చౌత్‌ సందర్భంగా సూర్యకుమార్‌ యాదవ్‌ దంపతులు వెన్నెల కాంతుల్లో దిగిన ఫొటో ఈ ఏడాది కర్వా చౌత్‌ సందర్భంగా సూర్యకుమార్‌ యాదవ్‌ దంపతులు వెన్నెల కాంతుల్లో దిగిన ఫొటో

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని