ఫ్రెండ్‌షిప్‌ డే స్పెషల్‌

ఫ్రెండ్‌షిప్‌ డే స్పెషల్‌

1/23

ఆదివారం (ఆగస్టు 1) స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్‌కు చెందిన కొంతమంది హీరోహీరోయిన్లు, వాళ్ల స్నేహితుల గురించి తెలుసుకుందాం..!

2/23

మెగాస్టార్‌ చిరంజీవికి నటుడు అక్కినేని నాగార్జునకు మధ్య ఎంతో మంచి స్నేహానుబంధం ఉంది. నాగార్జున ఇంటి వేడుకల్లో చిరు.. చిరు ఇంటి వేడుకల్లో నాగార్జున తప్పకుండా పాల్గొంటారు. ఇటీవల నాగార్జున నటించిన ‘వైల్డ్‌డాగ్‌’ విడుదల సమయంలోనూ ఆయన కోసం చిరు ప్రత్యేకంగా చేపల కూర వండి వడ్డించారు.

3/23

చిరంజీవి-మోహన్‌బాబుల స్నేహం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఒకానొక సమయంలో వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. గతేడాది జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్‌బాబుని చిరు ఆత్మీయ ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టుకున్నారు.

4/23

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల ఫ్రెండ్‌షిప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్‌కల్యాణ్‌ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. అలాగే, పవన్‌కి ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయి, హాస్యనటుడు ఆలీతో మంచి అనుబంధం ఉంది.

5/23

సినీ పరిశ్రమలో ఉన్న హీరోలందరూ ఒక్కటే. మేమంతా మంచి స్నేహితులం అని చాటి చెప్పారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌.

6/23

బాహుబలి ప్రభాస్‌ - అనుష్క.. ఆఫ్‌ స్క్రీన్‌లో బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ‘కెరీర్‌ కావాలా? లేదా ప్రభాస్‌తో ఫ్రెండ్‌షిప్‌ కావాలా?’ అని ఓ షోలో అనుష్కని అడగ్గా.. నాకు ప్రభాస్‌తో స్నేహమే ముఖ్యం అని సమాధానమిచ్చారు.

7/23

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌, టీటౌన్‌ హీరో వెంకటేశ్‌ మంచి స్నేహితులు. సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన ‘దబాంగ్‌-3’ ఆడియో ఈవెంట్‌లో వెంకీ ముఖ్య అతిథిగా పాల్గొని.. ఆయనతో ఓ పాటకు డ్యాన్స్‌ కూడా చేశారు.

8/23

ప్రభాస్‌కి పరిశ్రమలో స్నేహితులెక్కువని అందరికీ తెలుసు. ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరితోనూ ఆయన సరదాగా ఉంటారు. అందుకే ఆయన్ని అందరూ డార్లింగ్‌ అంటారు. ఓ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తున్న ప్రభాస్‌-రామ్‌చరణ్‌

9/23

రామ్‌చరణ్‌-అఖిల్‌ మంచి స్నేహితులు.

10/23

మహేశ్‌బాబు ఎవరితోనూ కలవరేమో అని అందరూ అనుకుంటారు కానీ అది తప్పు. ఎందుకంటే ఆయనకు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులున్నారు. వాళ్లలో ఒకరు రానా దగ్గుబాటి.

11/23

అల్లరి నరేష్‌-నాని బెస్ట్‌ ఫ్రెండ్స్‌. నరేష్‌ నటించిన చాలా సినిమాల ఆడియో లేదా ప్రీ రిలీజ్‌ వేడుకల్లో నాని తారసపడుతుంటాడు.

12/23

రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన, టెన్నిస్‌స్టార్‌ సానియా మీర్జా ఎంతోకాలం నుంచి మంచి స్నేహితులు.

13/23

స్వీటీ అనుష్క - ఛార్మిలకు ఎప్పటినుంచో పరిచయం ఉంది.

14/23

హీరోయిన్‌ రకుల్‌కు ఉన్న ఫ్రెండ్స్‌ జాబితాలో ముఖ్యంగా కనిపించే పేరు మంచు లక్ష్మి. వీళ్లిద్దరూ కలిశారంటే మాటలకు అడ్డుకట్ట అంటూ ఉండదు. ఫిటెనెస్‌ విషయంలోనూ వీళ్లిద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి.

15/23

సమంత అక్కినేనికి ఉన్న బెస్ట్‌ఫ్రెండ్స్‌లో శిల్పారెడ్డి, చిన్మయి ముఖ్యమైన వాళ్లు

16/23

సాయి ధరమ్‌ తేజ్‌ - మంచు మనోజ్‌

17/23

అల్లు అర్జున్‌ - రానా దగ్గుబాటి

18/23

మంచు మనోజ్‌ - రానా

19/23

రానా - రామ్‌చరణ్‌

20/23

త్రిష - ఛార్మి

21/23

రామ్‌ - జెనీలియా

22/23

శ్రుతిహాసన్‌ - తమన్నా

23/23

విజయ్‌ దేవరకొండ - రష్మిక


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని