Nokia XR20: నోకియా ప్రీమియం ఫోన్‌..వివరాలివే!

Nokia XR20: నోకియా ప్రీమియం ఫోన్‌..వివరాలివే!

1/10

హెచ్ఎండీ గ్లోబల్‌ కంపెనీ నోకియా ఎక్స్‌ఆర్20 ఫోన్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రీమియం శ్రేణిలో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధర.. ఫీచర్లు ఇలా ఉన్నాయి.

2/10

ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 19 రకాల 5జీ బ్యాండ్‌విడ్త్‌లను ఎక్స్‌ఆర్‌20 సపోర్ట్ చేస్తుంది.

3/10

గూగుల్ అసిస్టెంట్‌ కోసం ప్రత్యేక బటన్ ఇస్తున్నారు. అలానే ఫింగర్ ప్రింట్ సెన్స్‌ర్‌ ఫీచర్ కూడా ఉంది.

4/10

గంటపాటు నీటిలో తడిచినా పాడవకుండా ఉండేలా 1.5ఎమ్‌ వాటర్ ప్రొటెక్షన్‌, కింద పడినా పగలకుండా 1.8ఎమ్‌ డ్రాప్ ప్రొటెక్షన్‌తో రక్షణ కల్పించారు. 55-డిగ్రీల సెల్సియస్‌ నుంచి 20-డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ఈ ఫోన్‌ని డిజైన్‌ చేశారు.

5/10

ఇందులో మూడు కెమెరాలున్నాయి. వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 13 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు. ముందుభాగంలో సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా అమర్చారు.

6/10

ఈ ఫోన్‌లో 4,630 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు, 15 వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని నోకియా చెబుతోంది.

7/10

స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 6జీబీ ర్యామ్‌ ఇస్తున్నారు.

8/10

6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ ఉంది.

9/10

నోకియా ఎక్స్‌ఆర్‌ 20 మోడల్‌ను 6 జీబీ ర్యామ్/128 జీబీ అంతర్గత స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. దీని ధర రూ. 46,999గా కంపెనీ నిర్ణయించిది.

10/10

గ్రానైట్, అల్ట్రా బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఆక్టోబరు 30 నుంచి నోకియా వెబ్‌సైట్‌తోపాటు అన్ని ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని