Kalanjali Fashion Show: తిరుపతి ఐఐటీలో కళాంజలి ఫ్యాషన్‌షో

తిరుపతి: తిరుపతి ఐఐటీలో తిరుఉత్సవ్‌ కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాంజలి ఆధ్వర్యంలో ఫ్యాషన్‌షో నిర్వహించారు. ఇందులో విద్యార్థులు  ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాంజలి వస్త్రాలను ధరించి వేదికపై సందడి చేశారు. సంప్రదాయ వస్త్రాలను పాశ్చాత్య యువతకు అనుగుణంగా తీర్చిదిద్దిన డిజైన్లను వారు ప్రదర్శించారు. పట్టుచీరలతో పాటు లంగా, ఓణి, డిజైనర్‌ చీరలు, పురుషులు బ్లేజర్, సూట్స్, పట్టుపంచె ధరించి చేపట్టిన ర్యాంప్‌ వాక్‌ అలరించింది. యువతలో మన సంప్రదాయాన్ని చొచ్చుకుపోయేలా కళాంజలి ఫ్యాషన్‌షో నూతన ఒరఒడిని సృష్టించడంతో పండగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. 

Updated : 15 Apr 2022 21:27 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని