KKR: కోల్‌కతా కొత్త కెప్టెన్‌ నితీష్‌ భార్య సాచి మార్వా గురించి తెలుసా?

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొత్త కెప్టెన్‌గా నితీష్‌ రాణా ఎంపికైన విషయం తెలిసిందే. అతని భార్య సాచి మార్వా గురించి తెలుసా? ఆమె బాలీవుడ్ స్టార్‌ గోవిందా బంధువు. ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేస్తుంది. సాచి గురించి మరిన్ని విషయాలు మీకోసం..

Updated : 31 Mar 2023 22:43 IST
1/9
సాచి మార్వా.. ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌. ఆమె సోషల్‌ మీడియా ఖాతాను చూస్తే మీకు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోసం భలే ఆలోచనలు వస్తాయి.. సాచి మార్వా.. ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌. ఆమె సోషల్‌ మీడియా ఖాతాను చూస్తే మీకు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోసం భలే ఆలోచనలు వస్తాయి..
2/9
 1991లో జన్మించిన సాచి.. అన్సాల్‌ యూనివర్శిటీలో ఇంటీరియర్‌ డిజైనింగ్‌  కోర్సు పూర్తి చేసింది. 1991లో జన్మించిన సాచి.. అన్సాల్‌ యూనివర్శిటీలో ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసింది.
3/9
2015లో ప్రేమ్‌నాథ్‌ అండ్ అసోసియేట్స్‌ అనే ఆర్కిటెక్‌ సంస్థలో  ఇంటీరియర్‌ డిజైనర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 2015లో ప్రేమ్‌నాథ్‌ అండ్ అసోసియేట్స్‌ అనే ఆర్కిటెక్‌ సంస్థలో ఇంటీరియర్‌ డిజైనర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు.
4/9
2016లో స్నేహితురాలు నవ్‌నీత్ కౌర్‌తో కలిసి సాచి అండ్‌ నవ్‌నీత్‌ డిజైన్‌ స్టూడియో అనే సంస్థను ప్రారంభించారు. 2016లో స్నేహితురాలు నవ్‌నీత్ కౌర్‌తో కలిసి సాచి అండ్‌ నవ్‌నీత్‌ డిజైన్‌ స్టూడియో అనే సంస్థను ప్రారంభించారు.
5/9
పెళ్లికి ముందు సాచి - నితీష్‌ రెండేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారట. నితీష్‌ అన్నయ్య, సాచి అన్నయ్య ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో.. ఇద్దరూ తరచుగా ఫుట్‌బాల్ ఆడుతుండేవారు. అక్కడే సాచి - నితీశ్‌కు పరిచయమైంది. పెళ్లికి ముందు సాచి - నితీష్‌ రెండేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారట. నితీష్‌ అన్నయ్య, సాచి అన్నయ్య ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో.. ఇద్దరూ తరచుగా ఫుట్‌బాల్ ఆడుతుండేవారు. అక్కడే సాచి - నితీశ్‌కు పరిచయమైంది.
6/9
క్రికెట్‌ మ్యాచ్‌లు లేని సమయంలో నితీష్‌ కూడా వాళ్లతో ఫుట్‌బాల్‌ ఆడేవాడట. అలా ఒక రోజు గ్రౌండ్‌కు వచ్చిన సాచిని తొలి చూపులో ఇష్టపడినట్లు నితీష్‌ చెప్పాడు. క్రికెట్‌ మ్యాచ్‌లు లేని సమయంలో నితీష్‌ కూడా వాళ్లతో ఫుట్‌బాల్‌ ఆడేవాడట. అలా ఒక రోజు గ్రౌండ్‌కు వచ్చిన సాచిని తొలి చూపులో ఇష్టపడినట్లు నితీష్‌ చెప్పాడు.
7/9
డేటింగ్‌ తర్వాత 2016లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఫిబ్రవరి 19, 2019న వీరి వివాహం జరిగింది. వయసులో నితీష్‌ కంటే సాచి మూడేళ్లు పెద్దది. డేటింగ్‌ తర్వాత 2016లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఫిబ్రవరి 19, 2019న వీరి వివాహం జరిగింది. వయసులో నితీష్‌ కంటే సాచి మూడేళ్లు పెద్దది.
8/9
నితీష్‌ ఆడే మ్యాచ్‌లకు సాచి తరచుగా హాజరవుతుంటుంది. ఆమె మైదానం దగ్గర సందడి చేసిన పోస్టులను ఇన్‌స్టాగ్రామ్‌లో చూడొచ్చు. నితీష్‌ ఆడే మ్యాచ్‌లకు సాచి తరచుగా హాజరవుతుంటుంది. ఆమె మైదానం దగ్గర సందడి చేసిన పోస్టులను ఇన్‌స్టాగ్రామ్‌లో చూడొచ్చు.
9/9
సాచికి విహారయాత్రలంటే చాలా ఇష్టం. నితీశ్‌తో ఆమె టూర్లకు వెళ్లి అక్కడి ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. సాచికి విహారయాత్రలంటే చాలా ఇష్టం. నితీశ్‌తో ఆమె టూర్లకు వెళ్లి అక్కడి ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ఉంటుంది.

మరిన్ని