News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (06-06-2023)

Updated : 06 Jun 2023 08:58 IST
1/11
తిరుపతి వేదికగా  ఆదిపురుష్‌ సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా హీరో ప్రభాష్‌, సినిమా బృందం తిరుమలకు వెళ్లింది. మంగళవారం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని కార్యక్రమానికి హాజరుకానున్నారు. తిరుపతి వేదికగా ఆదిపురుష్‌ సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా హీరో ప్రభాష్‌, సినిమా బృందం తిరుమలకు వెళ్లింది. మంగళవారం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని కార్యక్రమానికి హాజరుకానున్నారు.
2/11
సినీనటుడు ప్రభాస్‌ ఆదిపురుష్ చిత్ర ప్రీ రిలీజ్‌ సందర్భంగా అభిమానులను ఆకట్టుకునేలా అరటి ఆకుపై  ఆదిపురుష్‌ చిత్రాన్ని చిత్తూరు జిల్లా గుడుపల్లె  మండలం పెద్దపర్తికుంట గ్రామానికి చెందిన కళాకారుడు పురుషోత్తం వేశాడు.  ఈ చిత్రం ప్రభాస్‌ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. సినీనటుడు ప్రభాస్‌ ఆదిపురుష్ చిత్ర ప్రీ రిలీజ్‌ సందర్భంగా అభిమానులను ఆకట్టుకునేలా అరటి ఆకుపై ఆదిపురుష్‌ చిత్రాన్ని చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం పెద్దపర్తికుంట గ్రామానికి చెందిన కళాకారుడు పురుషోత్తం వేశాడు. ఈ చిత్రం ప్రభాస్‌ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది.
3/11
విద్యుత్తు ప్రగతి సభ పేరుతో  సోమవారం రవీంద్రభారతిలో అట్టహాసంగా వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. విద్యుత్తు ప్రగతి సభ పేరుతో సోమవారం రవీంద్రభారతిలో అట్టహాసంగా వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి.
4/11
  ప్రకృతిని తరచి చూస్తే ప్రతి విషయమూ వింతే. అందుకు ఈ చిత్రమే నిదర్శనం! రాకాసి మిడతపై మనిషి ముఖరూపానికి సామీప్యంగా ఉన్న ఆకారం చూపరులను ఆకట్టుకుంటోంది. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో ఈ మిడత కనిపించింది. ప్రకృతిని తరచి చూస్తే ప్రతి విషయమూ వింతే. అందుకు ఈ చిత్రమే నిదర్శనం! రాకాసి మిడతపై మనిషి ముఖరూపానికి సామీప్యంగా ఉన్న ఆకారం చూపరులను ఆకట్టుకుంటోంది. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో ఈ మిడత కనిపించింది.
5/11
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లో అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ.. పర్యావరణ సంరక్షణ భావితరాలకు మనమిచ్చే ఆస్తిని సూచించారు. మొక్కలు పెంచాలని సూచించారు. కొన్ని చోట్ల విత్తన బంతులు విసిరారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లో అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ.. పర్యావరణ సంరక్షణ భావితరాలకు మనమిచ్చే ఆస్తిని సూచించారు. మొక్కలు పెంచాలని సూచించారు. కొన్ని చోట్ల విత్తన బంతులు విసిరారు.
6/11
 హైదరాబాద్: వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం జనం ఈత కొలనుల బాట పడుతున్నారు. కొలనులో నీరు ఎంత ఉన్నా పై నుంచి పడే జల్లు వల్ల కలిగే సాంత్వన వేరు అన్న విషయం గమనించిన నిర్వాహకులు జిల్లెలగూడ ఆర్‌సీఐ మెయిన్‌రోడ్డులో ఇలా ఏర్పాటు చేశారు. హైదరాబాద్: వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం జనం ఈత కొలనుల బాట పడుతున్నారు. కొలనులో నీరు ఎంత ఉన్నా పై నుంచి పడే జల్లు వల్ల కలిగే సాంత్వన వేరు అన్న విషయం గమనించిన నిర్వాహకులు జిల్లెలగూడ ఆర్‌సీఐ మెయిన్‌రోడ్డులో ఇలా ఏర్పాటు చేశారు.
7/11
 ఖమ్మం నగరం తుమ్మలగడ్డకు చెందిన షేక్‌ నయీం పుట్టుకతోనే దివ్యాంగుడు. ప్రస్తుతం సర్వజన ఆసుపత్రిలోని పార్కింగ్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఇటీవల ఓ కంపెనీ ఆన్‌లైన్‌ పోటీల్లో పాల్గొని ఎలక్ట్రిక్‌ బైక్‌ను గెలుచుకున్నారు. ఈ ద్విచక్రవాహనం ఇంట్లో వీల్‌ఛైర్‌గా ఉపయోగపడుతుండటం విశేషం. రెండు గంటలు ఛార్జింగ్‌ పెడితే 25 కి.మీ. దూరం ప్రయాణిస్తుందని నయీం తెలిపారు. ఖమ్మం నగరం తుమ్మలగడ్డకు చెందిన షేక్‌ నయీం పుట్టుకతోనే దివ్యాంగుడు. ప్రస్తుతం సర్వజన ఆసుపత్రిలోని పార్కింగ్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఇటీవల ఓ కంపెనీ ఆన్‌లైన్‌ పోటీల్లో పాల్గొని ఎలక్ట్రిక్‌ బైక్‌ను గెలుచుకున్నారు. ఈ ద్విచక్రవాహనం ఇంట్లో వీల్‌ఛైర్‌గా ఉపయోగపడుతుండటం విశేషం. రెండు గంటలు ఛార్జింగ్‌ పెడితే 25 కి.మీ. దూరం ప్రయాణిస్తుందని నయీం తెలిపారు.
8/11
 కలెక్టరు కొడుకు అంటే అంతా హంగూ ఆర్భాటం... అలాంటిది నారాయణపేట జిల్లా పరిపాలనాధికారి శ్రీహర్ష తనయుడు శ్రీరామ్‌ విక్రమాదిత్య సోమవారం అంగన్వాడీ ప్రీస్కూల్‌కు వచ్చాడు. చిన్నారులతో కలిసి పలు ఆటవస్తులతో ఆడుకున్నాడు. స్కూలు నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టరు కొడుకు అంటే అంతా హంగూ ఆర్భాటం... అలాంటిది నారాయణపేట జిల్లా పరిపాలనాధికారి శ్రీహర్ష తనయుడు శ్రీరామ్‌ విక్రమాదిత్య సోమవారం అంగన్వాడీ ప్రీస్కూల్‌కు వచ్చాడు. చిన్నారులతో కలిసి పలు ఆటవస్తులతో ఆడుకున్నాడు. స్కూలు నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.
9/11
 కూకట్‌పల్లి జాతీయ రహదారి వివేకానందనగర్‌ రామ్‌దేవ్‌రావ్‌ సిగ్నళ్ల వద్ద అపసవ్య దిశలో వెళ్లడమే కాకుండా ఇలా సెల్‌ఫోన్‌లో ముచ్చట్లు పెడుతూ వెళ్తున్నాడు. ఇది తనకే కాకుండా ఇతరులకూ ప్రమాదకరమే. కూకట్‌పల్లి జాతీయ రహదారి వివేకానందనగర్‌ రామ్‌దేవ్‌రావ్‌ సిగ్నళ్ల వద్ద అపసవ్య దిశలో వెళ్లడమే కాకుండా ఇలా సెల్‌ఫోన్‌లో ముచ్చట్లు పెడుతూ వెళ్తున్నాడు. ఇది తనకే కాకుండా ఇతరులకూ ప్రమాదకరమే.
10/11
సోమవారం కురవి వారాంతపు పశువుల సంతలో విక్రయించేందుకు సలార్‌తండాకు చెందిన ఓ వ్యాపారి తీసుకొచ్చిన గొర్రెల్లో ఒకటి నాలుగు కొమ్ములు కలిగి ఉంది. ఈ విషయమై మండల పశువైద్యాధికారి రామచంద్రనాయక్‌ను మాట్లాడుతూ జన్యుపరమైన మార్పులతో నాలుగు కొమ్ములు వచ్చాయన్నారు. సంతకు వచ్చిన క్రయ, విక్రయదారులు దానిని ఆసక్తిగా చూశారు. సోమవారం కురవి వారాంతపు పశువుల సంతలో విక్రయించేందుకు సలార్‌తండాకు చెందిన ఓ వ్యాపారి తీసుకొచ్చిన గొర్రెల్లో ఒకటి నాలుగు కొమ్ములు కలిగి ఉంది. ఈ విషయమై మండల పశువైద్యాధికారి రామచంద్రనాయక్‌ను మాట్లాడుతూ జన్యుపరమైన మార్పులతో నాలుగు కొమ్ములు వచ్చాయన్నారు. సంతకు వచ్చిన క్రయ, విక్రయదారులు దానిని ఆసక్తిగా చూశారు.
11/11
 రాయచూరులో సాంస్కృతిక పల్లె పండగ సోమవారం కొనసాగింది. ఎద్దులతో బండ లాగుడు పోటీల ఘట్టమిదీ. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో కదలిరావడంతో కృష్ణ- తుంగభద్ర మధ్య నగరి- రాయచూరుకు కొత్త కళ వచ్చింది. రాయచూరులో సాంస్కృతిక పల్లె పండగ సోమవారం కొనసాగింది. ఎద్దులతో బండ లాగుడు పోటీల ఘట్టమిదీ. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో కదలిరావడంతో కృష్ణ- తుంగభద్ర మధ్య నగరి- రాయచూరుకు కొత్త కళ వచ్చింది.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు