News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (07-06-2023)

Updated : 07 Jun 2023 11:51 IST
1/17
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందలాది ప్రయాణికులను మృత్యువు కబళించింది. ఇంత వరకు గుర్తింపునకు నోచుకోని పేదల మృతదేహాలను ట్రక్కులో కుప్పలుగా వేసి శవాగారానికి తరలించడం అందరనీ కలచి వేసింది. మానవత్వాన్ని మట్టికలిపేలా అధికారులు చర్య ఉందంటూ సైకత గదెల హరికృష్ణ ఆవేదన చెందారు. ఈ దృశ్యాన్ని సైకత శిల్పం రూపంలో ఆవిష్కరించి తన  బాధను వ్యక్తం చేశారు. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందలాది ప్రయాణికులను మృత్యువు కబళించింది. ఇంత వరకు గుర్తింపునకు నోచుకోని పేదల మృతదేహాలను ట్రక్కులో కుప్పలుగా వేసి శవాగారానికి తరలించడం అందరనీ కలచి వేసింది. మానవత్వాన్ని మట్టికలిపేలా అధికారులు చర్య ఉందంటూ సైకత గదెల హరికృష్ణ ఆవేదన చెందారు. ఈ దృశ్యాన్ని సైకత శిల్పం రూపంలో ఆవిష్కరించి తన బాధను వ్యక్తం చేశారు.
2/17
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కోదాడ పట్టణంలోని సెంట్రల్‌ లైటింగ్‌ రంగు రంగుల కాంతి వెలుగులతో చూపరులను ఆకట్టుకుంటోంది. సూర్యాపట రహదారి నుంచి శ్రీరంగాపురం వరకు, హజూర్‌నగర్‌ రహదారి మార్గంలో జాతీయ రహదారి ప్లైఓవర్‌ వరకు అన్ని విద్యుత్తు స్తంభాలకు రంగు రంగుల కాంతీ దీపాలను ఏర్పాటు చేశారు. చీకటి పడేటప్పటికి రహదారి అంతా హరివిల్లులా కాంతులు విరజిమ్ముతూ అటు పాదచారులను, ఇటు వాహనదారులని ఆకట్టుకుంటూ ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కోదాడ పట్టణంలోని సెంట్రల్‌ లైటింగ్‌ రంగు రంగుల కాంతి వెలుగులతో చూపరులను ఆకట్టుకుంటోంది. సూర్యాపట రహదారి నుంచి శ్రీరంగాపురం వరకు, హజూర్‌నగర్‌ రహదారి మార్గంలో జాతీయ రహదారి ప్లైఓవర్‌ వరకు అన్ని విద్యుత్తు స్తంభాలకు రంగు రంగుల కాంతీ దీపాలను ఏర్పాటు చేశారు. చీకటి పడేటప్పటికి రహదారి అంతా హరివిల్లులా కాంతులు విరజిమ్ముతూ అటు పాదచారులను, ఇటు వాహనదారులని ఆకట్టుకుంటూ ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.
3/17
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఖిల్లా వద్ద కేంద్రీయ విద్యాలయాన్ని ఏడు ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి ఖాళీ స్థలంలో పెద్ద చెట్లు ఉన్నాయి. కొన్నేళ్లుగా పెరుగుతూ వచ్చిన వీటిని నరికివేయకుండా.. ఇలా సంరక్షిస్తూ.. భవన నిర్మాణాలు పూర్తి చేశారు.  ఈ చెట్ల కింద కూర్చోవడానికి వీలుగా గద్దెలు నిర్మిస్తే విద్యార్థులు హాయిగా సేద తీరే అవకాశం ఉంటుంది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఖిల్లా వద్ద కేంద్రీయ విద్యాలయాన్ని ఏడు ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి ఖాళీ స్థలంలో పెద్ద చెట్లు ఉన్నాయి. కొన్నేళ్లుగా పెరుగుతూ వచ్చిన వీటిని నరికివేయకుండా.. ఇలా సంరక్షిస్తూ.. భవన నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ చెట్ల కింద కూర్చోవడానికి వీలుగా గద్దెలు నిర్మిస్తే విద్యార్థులు హాయిగా సేద తీరే అవకాశం ఉంటుంది.
4/17
పట్టాలపై వెళ్లాల్సిన రైలింజన్‌ లారీ ఎక్కిందని అవాక్కు అవుతున్నారా. అవును ఇది నిజమే. బెంగళూరు నుంచి ఒరిస్సాకు ఈ రైలు ఇంజన్‌ను లారీపై తరలిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం జాతీయ రహదారిపై వెళ్తుండగా ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పట్టాలపై వెళ్లాల్సిన రైలింజన్‌ లారీ ఎక్కిందని అవాక్కు అవుతున్నారా. అవును ఇది నిజమే. బెంగళూరు నుంచి ఒరిస్సాకు ఈ రైలు ఇంజన్‌ను లారీపై తరలిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం జాతీయ రహదారిపై వెళ్తుండగా ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
5/17
హైదరాబాద్‌లోకి కీసర శ్రీరామలింగేశ్వర కాలనీలోని ఓ విద్యుత్తు స్తంభం కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఓ ఇంటి పక్కనే ఉన్న స్తంభం ఇటీవల ఈదురుగాలులకు ఒకవైపు వంగి తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. హైదరాబాద్‌లోకి కీసర శ్రీరామలింగేశ్వర కాలనీలోని ఓ విద్యుత్తు స్తంభం కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఓ ఇంటి పక్కనే ఉన్న స్తంభం ఇటీవల ఈదురుగాలులకు ఒకవైపు వంగి తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి.
6/17
భద్రాచలంలోని వినాయకపురంలో ఉన్న రావిచెట్టు ఆకులు రాలిపోయి మళ్లీ ఏప్రిల్‌ నెలలో చిగురించడంతో ఈ చిగురుటాకులు ఎర్రటి రంగులో ఉండి ఎంతో ఆకట్టుకున్నాయి.  ప్రస్తుతం ఎర్రటి ఆకులు ముదరడంతో పచ్చరంగులోకి మారి అంతే అందంగా కనిపిస్తున్న దృశ్యమిది. భద్రాచలంలోని వినాయకపురంలో ఉన్న రావిచెట్టు ఆకులు రాలిపోయి మళ్లీ ఏప్రిల్‌ నెలలో చిగురించడంతో ఈ చిగురుటాకులు ఎర్రటి రంగులో ఉండి ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఎర్రటి ఆకులు ముదరడంతో పచ్చరంగులోకి మారి అంతే అందంగా కనిపిస్తున్న దృశ్యమిది.
7/17
తిరుపతి నగరం మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జైశ్రీరామ్‌ నినాదాలతో హోరెత్తింది. సినీ హీరో ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ఆదిపురుష్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ మైదానంలో నిర్వహించారు. తిరుపతి నగరం మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జైశ్రీరామ్‌ నినాదాలతో హోరెత్తింది. సినీ హీరో ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ఆదిపురుష్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ మైదానంలో నిర్వహించారు.
8/17
 మైసూరు: నాగరహొళ అటవీ విభాగం దమ్మనకట్టి వద్ద మంగళవారం నల్ల చిరుత కనిపించింది. మైసూరు: నాగరహొళ అటవీ విభాగం దమ్మనకట్టి వద్ద మంగళవారం నల్ల చిరుత కనిపించింది.
9/17
విశాఖపట్నం ఆర్కే బీచ్‌ రోడ్డులో కోస్టల్‌ బ్యాటరీ కూడలి వద్ద ఉన్న పోలీస్‌ నిఘా కెమెరా ఇదిగో.. ఇలా ఊడి వేళ్లాడుతోంది. అటు హార్బర్‌ నుంచి వచ్చే రహదారి పర్యవేక్షణ కోసం ఉన్న ఈ సిసి కెమెరా సరైన నిర్వహణ లేక కిందకి జారింది. విశాఖపట్నం ఆర్కే బీచ్‌ రోడ్డులో కోస్టల్‌ బ్యాటరీ కూడలి వద్ద ఉన్న పోలీస్‌ నిఘా కెమెరా ఇదిగో.. ఇలా ఊడి వేళ్లాడుతోంది. అటు హార్బర్‌ నుంచి వచ్చే రహదారి పర్యవేక్షణ కోసం ఉన్న ఈ సిసి కెమెరా సరైన నిర్వహణ లేక కిందకి జారింది.
10/17
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌ స్మార్ట్‌ రహదారిలో రాత్రిపూట విద్యుత్తు వెలుగులతో జిగేల్‌ మన్పించే చిత్రాన్ని ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌ స్మార్ట్‌ రహదారిలో రాత్రిపూట విద్యుత్తు వెలుగులతో జిగేల్‌ మన్పించే చిత్రాన్ని ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్నారు.
11/17
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగు నీటి దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని రంగరంగుల విద్యుత్తు దీపాలతో సుందరంగా అలకరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగు నీటి దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని రంగరంగుల విద్యుత్తు దీపాలతో సుందరంగా అలకరించారు.
12/17
వివిధ భంగిమల్లో వాలిన ఈ తాటి చెట్లు నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తూ కనివిందుచేస్తున్నాయి. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి గ్రామ శివారులో సమూహంగా ఉన్న తాటిచెట్లు జోరున వీస్తున్న గాలికి ఇలా వాలుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ భంగిమల్లో వాలిన ఈ తాటి చెట్లు నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తూ కనివిందుచేస్తున్నాయి. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి గ్రామ శివారులో సమూహంగా ఉన్న తాటిచెట్లు జోరున వీస్తున్న గాలికి ఇలా వాలుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
13/17
  క్షేత్రాభివృద్ధి కార్యాచరణకు ముందు నాటి యాదగిరీశుడి సన్నిధి, క్షేత్రాభివృద్ధితో ఆవిష్కృతమైన నేటి యాదాద్రి క్షేత్రాభివృద్ధి కార్యాచరణకు ముందు నాటి యాదగిరీశుడి సన్నిధి, క్షేత్రాభివృద్ధితో ఆవిష్కృతమైన నేటి యాదాద్రి
14/17
తుపాకీ భుజాన వేసుకుని వెళ్తున్న ఈయన తన బాధల్ని దిగమింగుకొని ఇతరులను నవ్విస్తుంటారు. బాలాజీనగర్‌కు చెందిన మోటం సారయ్య. గత 40 సంవత్సరాలుగా గ్రామాలు తిరుగుతూ ఇలా ప్రదర్శనలు ఇస్తున్నారు.వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో ప్రదర్శన ఇస్తుండగా తీసిన చిత్రమిది తుపాకీ భుజాన వేసుకుని వెళ్తున్న ఈయన తన బాధల్ని దిగమింగుకొని ఇతరులను నవ్విస్తుంటారు. బాలాజీనగర్‌కు చెందిన మోటం సారయ్య. గత 40 సంవత్సరాలుగా గ్రామాలు తిరుగుతూ ఇలా ప్రదర్శనలు ఇస్తున్నారు.వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో ప్రదర్శన ఇస్తుండగా తీసిన చిత్రమిది
15/17
 హైదరాబాద్:  ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న వెయ్యి పడకల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం పునాదులు  తవ్వే క్రమంలో తొలగించాల్సి వచ్చిన    భారీ వృక్షాలు, చెట్లను అదే ప్రాంగణంలో మరో చోట నాటారు. 150 చెట్టను రీప్లాంటేషన్‌ చేయగా అన్నీ మళ్లీ చిగురించాయి. హైదరాబాద్: ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న వెయ్యి పడకల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం పునాదులు తవ్వే క్రమంలో తొలగించాల్సి వచ్చిన భారీ వృక్షాలు, చెట్లను అదే ప్రాంగణంలో మరో చోట నాటారు. 150 చెట్టను రీప్లాంటేషన్‌ చేయగా అన్నీ మళ్లీ చిగురించాయి.
16/17
 ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’ చేపట్టి 39 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో ప్రార్థనలు చేస్తున్న సిక్కు సంస్థల ప్రతినిధులు ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’ చేపట్టి 39 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో ప్రార్థనలు చేస్తున్న సిక్కు సంస్థల ప్రతినిధులు
17/17
విద్యుద్దీపాల వెలుగుల్లో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు విద్యుద్దీపాల వెలుగుల్లో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు