News In Pics: చిత్రం చెప్పే సంగతులు -01(23-01-2023)

Updated : 23 Jan 2023 10:32 IST
1/13
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని గంటావారిపల్లె పంచాయతీ ఎగువ కన్నికాపురంలో పశువుల పరసను నిర్వహించారు. సమీప మండలాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యువత పశువులను నిలువరించేందుకు సాహసం చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని గంటావారిపల్లె పంచాయతీ ఎగువ కన్నికాపురంలో పశువుల పరసను నిర్వహించారు. సమీప మండలాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యువత పశువులను నిలువరించేందుకు సాహసం చేశారు.
2/13
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మన్యంలో పర్యాటకులు సందడి చేశారు. ఎన్టీఆర్ సాహస ఉద్యానంలో పలు సాహస, ఇతర క్రీడలు ఆడారు. చిన్నారులు బోటులో ఇలా షికారు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మన్యంలో పర్యాటకులు సందడి చేశారు. ఎన్టీఆర్ సాహస ఉద్యానంలో పలు సాహస, ఇతర క్రీడలు ఆడారు. చిన్నారులు బోటులో ఇలా షికారు చేశారు.
3/13
హరితహారంలో భాగంగా మహబూబాబాద్‌ జిల్లాలోని దంతాలపల్లి మండలంలో వివిధ గ్రామ పంచాయతీలకు పంపేందుకు మొక్కల పెంపకాన్ని చేపట్టారు. తొర్రూరులోని ఓ దుకాణంలో మొక్కలు పెంచాలని గింజలు నాటారు. మొత్తం 12 వేల ప్యాకెట్లలో కొన్ని మాత్రమే మొలకెత్తగా మిగతా సంచులన్నీ గడ్డితో నిండిపోయాయి. హరితహారంలో భాగంగా మహబూబాబాద్‌ జిల్లాలోని దంతాలపల్లి మండలంలో వివిధ గ్రామ పంచాయతీలకు పంపేందుకు మొక్కల పెంపకాన్ని చేపట్టారు. తొర్రూరులోని ఓ దుకాణంలో మొక్కలు పెంచాలని గింజలు నాటారు. మొత్తం 12 వేల ప్యాకెట్లలో కొన్ని మాత్రమే మొలకెత్తగా మిగతా సంచులన్నీ గడ్డితో నిండిపోయాయి.
4/13
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పంచాయతీ వెనక తొర్రిగెడ్డ పంట కాలువ గట్టుపై 150 కుటుంబాలు పాకలు వేసుకుని ఉంటున్నాయి. వారు అక్కడి నుంచి బయటి ప్రాంతాలకు రావాలంటే కాలువను దాటాలి. దానిపై వంతెన వంటి ఏర్పాట్లేవీ లేవు. స్థానికులే ఓ తాటి దుంగను ఏర్పాటు చేసుకున్నారు. నీరుండే ఈ కాలువపై పిల్లలు, మహిళలు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పంచాయతీ వెనక తొర్రిగెడ్డ పంట కాలువ గట్టుపై 150 కుటుంబాలు పాకలు వేసుకుని ఉంటున్నాయి. వారు అక్కడి నుంచి బయటి ప్రాంతాలకు రావాలంటే కాలువను దాటాలి. దానిపై వంతెన వంటి ఏర్పాట్లేవీ లేవు. స్థానికులే ఓ తాటి దుంగను ఏర్పాటు చేసుకున్నారు. నీరుండే ఈ కాలువపై పిల్లలు, మహిళలు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
5/13
ఉప్పల్‌లోని శిల్పారామంలో ఆదివారం పల్లవి అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ గురువు వీబీ కృష్ణభారతి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. ఆచార్యులు వెంకటాచారి, నృత్య కళాకారిణి డా.హిమబింధు కళాకారులను అభినందించారు. ఉప్పల్‌లోని శిల్పారామంలో ఆదివారం పల్లవి అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ గురువు వీబీ కృష్ణభారతి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. ఆచార్యులు వెంకటాచారి, నృత్య కళాకారిణి డా.హిమబింధు కళాకారులను అభినందించారు.
6/13
హైటెక్‌ సిటీ నుంచి మాదాపూర్‌ వెళ్లే రహదారి పాదబాటపై.. హైటెక్‌ సిటీ మెట్రోస్టేషన్‌ కింద ఏర్పాటు చేసిన మెట్రో ఫుడ్‌ స్టాళ్ల వద్ద  రద్దీగా మారుతోంది. నో పార్కింగ్, నో స్టాండింగ్‌ సూచికలు పెట్టినా నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నిలిపి, రోడ్డుపైనే నిల్చొని తింటుండటంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. హైటెక్‌ సిటీ నుంచి మాదాపూర్‌ వెళ్లే రహదారి పాదబాటపై.. హైటెక్‌ సిటీ మెట్రోస్టేషన్‌ కింద ఏర్పాటు చేసిన మెట్రో ఫుడ్‌ స్టాళ్ల వద్ద రద్దీగా మారుతోంది. నో పార్కింగ్, నో స్టాండింగ్‌ సూచికలు పెట్టినా నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నిలిపి, రోడ్డుపైనే నిల్చొని తింటుండటంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
7/13
చార్మినార్‌ సమీపంలోని స్థానికులు జాతీయ పతాక రంగుల దుస్తులు ధరించి ముందస్తుగా గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటారు.  ఆదివారం త్రివర్ణ టీషర్టులు ధరించి, నాంపల్లిలోని నుమాయిష్‌కు వెళ్లి సందడి చేశారు. చార్మినార్‌ సమీపంలోని స్థానికులు జాతీయ పతాక రంగుల దుస్తులు ధరించి ముందస్తుగా గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటారు. ఆదివారం త్రివర్ణ టీషర్టులు ధరించి, నాంపల్లిలోని నుమాయిష్‌కు వెళ్లి సందడి చేశారు.
8/13
ముద్దుగుమ్మలు ర్యాంప్‌పై హొయలు పోయారు. విద్యార్థులు డిజైన్‌ చేసిన చూడముచ్చటైన దుస్తులతో ర్యాంప్‌వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ఆదివారం నిర్వహించిన హ్యామ్‌స్టెక్‌ కాలేజ్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల విద్యార్థుల వార్షిక ఫ్యాషన్‌ షో-2023 సందడిగా జరిగింది. ముద్దుగుమ్మలు ర్యాంప్‌పై హొయలు పోయారు. విద్యార్థులు డిజైన్‌ చేసిన చూడముచ్చటైన దుస్తులతో ర్యాంప్‌వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ఆదివారం నిర్వహించిన హ్యామ్‌స్టెక్‌ కాలేజ్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల విద్యార్థుల వార్షిక ఫ్యాషన్‌ షో-2023 సందడిగా జరిగింది.
9/13
గచ్చిబౌలి జీహెచ్‌ఎంసీ డాగ్‌ పార్కు వద్ద నిర్మించిన కాలిబాటపై వాహనాలను నిలుపుతుండటంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తోంది. పార్కు నిర్వాహకులు, జీహెచ్‌యంసీ ఆధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గచ్చిబౌలి జీహెచ్‌ఎంసీ డాగ్‌ పార్కు వద్ద నిర్మించిన కాలిబాటపై వాహనాలను నిలుపుతుండటంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తోంది. పార్కు నిర్వాహకులు, జీహెచ్‌యంసీ ఆధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
10/13
సినీ తారలు సిద్ధుజొన్నలగడ్డ, శ్రీలీల, అనుపమపరమేశ్వరన్‌ ఆదివారం ఎల్బీనగర్‌లో సందడి చేశారు. తమను చూసేందుకు తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. ఇక్కడి మెట్రోస్టేషన్‌ సమీపంలో నూతనంగా నిర్మించనున్న వాసవి ఆనంద నిలయం గేటెడ్‌ కమ్యూనిటీ¨ భవన సముదాయ ప్రాజెక్ట్‌ లోగో, బ్రోచర్‌ను వారు ఆవిష్కరించారు. సినీ తారలు సిద్ధుజొన్నలగడ్డ, శ్రీలీల, అనుపమపరమేశ్వరన్‌ ఆదివారం ఎల్బీనగర్‌లో సందడి చేశారు. తమను చూసేందుకు తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. ఇక్కడి మెట్రోస్టేషన్‌ సమీపంలో నూతనంగా నిర్మించనున్న వాసవి ఆనంద నిలయం గేటెడ్‌ కమ్యూనిటీ¨ భవన సముదాయ ప్రాజెక్ట్‌ లోగో, బ్రోచర్‌ను వారు ఆవిష్కరించారు.
11/13
  విప్లవ వీరుడు చె గువేరా కుమార్తె డా.అలైదా గువేరా ఆదివారం  హైదారాబాద్, బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు.


విప్లవ వీరుడు చె గువేరా కుమార్తె డా.అలైదా గువేరా ఆదివారం హైదారాబాద్, బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు.
12/13
 భారత మాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం   హైదారాబాద్, నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ‘భారత మాత మహా హారతి’ కార్యక్రమం ఘనంగా జరిగింది. భారతమాత వేషధారణలో జాతీయ పతాకాలు చేతపట్టిన విద్యార్థినులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


భారత మాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదారాబాద్, నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ‘భారత మాత మహా హారతి’ కార్యక్రమం ఘనంగా జరిగింది. భారతమాత వేషధారణలో జాతీయ పతాకాలు చేతపట్టిన విద్యార్థినులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
13/13
 హైదారాబాద్‌, నార్సింగిలోని ఓం కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం జరిగిన ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ సందడిగా జరిగింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించాయి.


హైదారాబాద్‌, నార్సింగిలోని ఓం కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం జరిగిన ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ సందడిగా జరిగింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించాయి.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు