News In Pics: చిత్రం చెప్పే సంగతులు -01(24-01-2023)

Updated : 24 Jan 2023 06:46 IST
1/3
పులి చారలతో ఓ శునకం ఉండటం చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం దమ్మూరు గ్రామ పంచాయతీ బూర్గుగూడెంలో ఓ వ్యక్తి తన శునకానికి రంగులు వేశారు. పులికి ఉండే చారల మాదిరిగా కనిపించడంతో చూడగానే ఒక్కసారిగా భయమేసేలా ఉంది.. వ్యవసాయ భూముల్లో శునకం తిరుగుతుండడంతో కోతులు, పలు జంతువులు పరారవుతున్నాయి. పులి చారలతో ఓ శునకం ఉండటం చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం దమ్మూరు గ్రామ పంచాయతీ బూర్గుగూడెంలో ఓ వ్యక్తి తన శునకానికి రంగులు వేశారు. పులికి ఉండే చారల మాదిరిగా కనిపించడంతో చూడగానే ఒక్కసారిగా భయమేసేలా ఉంది.. వ్యవసాయ భూముల్లో శునకం తిరుగుతుండడంతో కోతులు, పలు జంతువులు పరారవుతున్నాయి.
2/3
దిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించడానికి కర్ణాటక శకటానికి అనుమతి లభించిందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి చొరవతో శకటానికి పచ్చజెండా ఊపినట్లు వివరించారు. ఈసారి రాష్ట్రం తరఫున ‘నారీశక్తి’ అంశంతో శకటాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు.

3/3
  విజయవాడ పున్నమిఘాట్లో యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని నారాలోకేష్‌ పుట్టినరోజు సందర్భంగా తెదేపా నాయకులు సుమారు 1000కేజీల కేకును కోశారు. ఈ కేకు అందరూ తిన్నా అయిపోలేదు. స్థానికంగా భవానీపురంలోఉన్న వారంతా వచ్చి ముక్కలు తీసుకెళ్లారు.

మరిన్ని