News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (25-01-2023)

Updated : 25 Jan 2023 08:26 IST
1/15
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను మువ్వన్నెల రంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించగా.. ఇలా వెలిగిపోతోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను మువ్వన్నెల రంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించగా.. ఇలా వెలిగిపోతోంది.
2/15
మూసీ సుందరీకరణలో భాగంగా పలు చోట్ల పాదచారుల మార్గాలు నిర్మించారు. మొక్కలు నాటారు.. పూల వనాలుగా మార్చి ఆహ్లాదంగా తీర్చిదిద్దేందుకు రూ.కోట్లు వెచ్చించారు. వరదలకు మొత్తం కొట్టుకుపోగా చాదర్‌ఘాట్‌లో వాటి ఆనవాలు ఇలా వెక్కిరిస్తున్నాయి. మూసీ సుందరీకరణలో భాగంగా పలు చోట్ల పాదచారుల మార్గాలు నిర్మించారు. మొక్కలు నాటారు.. పూల వనాలుగా మార్చి ఆహ్లాదంగా తీర్చిదిద్దేందుకు రూ.కోట్లు వెచ్చించారు. వరదలకు మొత్తం కొట్టుకుపోగా చాదర్‌ఘాట్‌లో వాటి ఆనవాలు ఇలా వెక్కిరిస్తున్నాయి.
3/15
మెట్టుగూడలోని ఆలుగడ్డబావి బస్టాప్‌లో రోజూ ఇసుక లారీలు, ట్రక్కులు నిలుపుతున్నారు. దీంతో మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సుల పేర్లు కనిపించడం లేదంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్టాప్‌లో ఇతర వాహనాలు నిలపకుండా పోలీసులు చర్యలు  తీసుకోవాలని కోరుతున్నారు. మెట్టుగూడలోని ఆలుగడ్డబావి బస్టాప్‌లో రోజూ ఇసుక లారీలు, ట్రక్కులు నిలుపుతున్నారు. దీంతో మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సుల పేర్లు కనిపించడం లేదంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్టాప్‌లో ఇతర వాహనాలు నిలపకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
4/15
కూకట్‌పల్లి గ్రామంలో విద్యుత్‌ తీగలు మార్చే క్రమంలో స్తంభాలపై కుప్పలుగా కేబుళ్లు అడ్డుగా ఉన్నాయి. వాటిని తొలగించకుండా వాటి మధ్యలో నుంచి సిబ్బంది తిప్పలు పడుతూ స్తంభం ఎక్కారు. అదీగాక అంత ఎత్తున పనిచేసేందుకు వారు కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. కూకట్‌పల్లి గ్రామంలో విద్యుత్‌ తీగలు మార్చే క్రమంలో స్తంభాలపై కుప్పలుగా కేబుళ్లు అడ్డుగా ఉన్నాయి. వాటిని తొలగించకుండా వాటి మధ్యలో నుంచి సిబ్బంది తిప్పలు పడుతూ స్తంభం ఎక్కారు. అదీగాక అంత ఎత్తున పనిచేసేందుకు వారు కనీస జాగ్రత్తలు తీసుకోలేదు.
5/15
అప్పుడప్పుడే సూర్యోదయం. మంచు ఇంకా కురుస్తూనే ఉంది. చుట్టూ పచ్చని పొలాలు. అందులో ఒక ఎండిన చెట్టు. కొమ్మ కొమ్మకు శ్వేత రంగులో పూలు పూసినట్టుగా ఉంది. పరీక్షించి చూస్తే అవి కొంగలు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అందంగా ఆవిష్కృతమైన దృశ్యం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లిలో చోటు చేసుకుంది. అప్పుడప్పుడే సూర్యోదయం. మంచు ఇంకా కురుస్తూనే ఉంది. చుట్టూ పచ్చని పొలాలు. అందులో ఒక ఎండిన చెట్టు. కొమ్మ కొమ్మకు శ్వేత రంగులో పూలు పూసినట్టుగా ఉంది. పరీక్షించి చూస్తే అవి కొంగలు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అందంగా ఆవిష్కృతమైన దృశ్యం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లిలో చోటు చేసుకుంది.
6/15
హిందూ మహా సముద్ర ప్రాంతంలో రక్షణ, భద్రత వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు ట్రోపెక్స్‌ విన్యాసాలు ఉపకరిస్తాయని నౌకాదళ వర్గాలు తెలిపాయి. రెండేళ్లకోసారి జరిగే విన్యాసాలు ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ కొనసాగుతాయని వెల్లడించాయి. విన్యాసాల్లో భారత నేవీ, ఆర్మీ, వాయుసేన, తీరగస్తీ దళాలు తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నాయి. హిందూ మహా సముద్ర ప్రాంతంలో రక్షణ, భద్రత వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు ట్రోపెక్స్‌ విన్యాసాలు ఉపకరిస్తాయని నౌకాదళ వర్గాలు తెలిపాయి. రెండేళ్లకోసారి జరిగే విన్యాసాలు ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ కొనసాగుతాయని వెల్లడించాయి. విన్యాసాల్లో భారత నేవీ, ఆర్మీ, వాయుసేన, తీరగస్తీ దళాలు తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నాయి.
7/15
ఇండో-నేపాల్‌ ఆర్ట్‌ సింపోజియం పేరిట మంగళవారం మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ప్రారంభించారు. భారత్‌, నేపాల్‌కు చెందిన పలువురు చిత్రకారులు గీసిన చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇండో-నేపాల్‌ ఆర్ట్‌ సింపోజియం పేరిట మంగళవారం మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ప్రారంభించారు. భారత్‌, నేపాల్‌కు చెందిన పలువురు చిత్రకారులు గీసిన చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
8/15
నిమ్స్‌ న్యూరోసర్జన్‌ విభాగంలోని మూడు యూనిట్లు మంగళవారం రోగులతో  నిండిపోయాయి. దీంతో  రిజిస్ట్రేషన్‌ విభాగం వద్ద బారులు తీరారు. ఖమ్మం నుంచి మనవరాలితో వచ్చిన ఓ వృద్ధురాలు తన వంతు కోసం నిరీక్షిస్తూ కనిపించింది. నిమ్స్‌ న్యూరోసర్జన్‌ విభాగంలోని మూడు యూనిట్లు మంగళవారం రోగులతో నిండిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్‌ విభాగం వద్ద బారులు తీరారు. ఖమ్మం నుంచి మనవరాలితో వచ్చిన ఓ వృద్ధురాలు తన వంతు కోసం నిరీక్షిస్తూ కనిపించింది.
9/15
జనసేన అధినేత, నటుడు పవన్‌ కళ్యాణ్‌ మంగళవారం  కొండగట్టుకు వెళ్తూ శామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద రాజీవ్‌రహదారిపై కాసేపు ఆగారు. అభిమానులు, కార్యకర్తలు క్రేన్‌ సాయంతో గజమాల వేసి అభిమానం చాటారు. జనసేన అధినేత, నటుడు పవన్‌ కళ్యాణ్‌ మంగళవారం కొండగట్టుకు వెళ్తూ శామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద రాజీవ్‌రహదారిపై కాసేపు ఆగారు. అభిమానులు, కార్యకర్తలు క్రేన్‌ సాయంతో గజమాల వేసి అభిమానం చాటారు.
10/15
బేగంపేట కుందన్‌బాగ్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాలలో మంగళవారం జరిగిన ‘మీడియా స్పియర్‌-2023’ సదస్సును ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. అనంతరం ఎన్‌.సి.సి కేడెట్లు ఆమెతో ఫొటోలు దిగారు. బేగంపేట కుందన్‌బాగ్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాలలో మంగళవారం జరిగిన ‘మీడియా స్పియర్‌-2023’ సదస్సును ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. అనంతరం ఎన్‌.సి.సి కేడెట్లు ఆమెతో ఫొటోలు దిగారు.
11/15
మల్లకంభంపై ఆసనాలు.. తుపాకి గురిపెడుతున్న వీరంతా రైల్వే పోలీస్‌ సిబ్బంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26న జరగబోయే ప్రదర్శనకు మంగళవారం సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌సీ మైదానంలో సాధన చేశారు. మల్లకంభంపై ఆసనాలు.. తుపాకి గురిపెడుతున్న వీరంతా రైల్వే పోలీస్‌ సిబ్బంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26న జరగబోయే ప్రదర్శనకు మంగళవారం సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌సీ మైదానంలో సాధన చేశారు.
12/15
విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో స్టెప్‌కాన్‌-2023 సాంకేతిక సదస్సును మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యార్థినుల దాండియా నృత్య ప్రదర్శన విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో స్టెప్‌కాన్‌-2023 సాంకేతిక సదస్సును మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యార్థినుల దాండియా నృత్య ప్రదర్శన
13/15
ఆధునిక మనిషి అవసరాలకు తగ్గట్టుగా నిత్యం ఎన్నో కొత్త వస్తువులు తయారవుతున్నాయి. విలాసవంతమైన వస్తువులు ఎన్ని వచ్చినా పాతకాలం నాటి సామగ్రి ఎప్పుడూ అపురూపమే. ఇప్పుడంటే అంతా ప్లాస్టిక్‌మయం అయింది కానీ గతంలో ఇత్తడి, రాగి వంటి లోహాలతో చేసిన సామగ్రి ఎక్కువగా వినియోగించేవారు. ఇప్పటి తరానికి ఇవి తెలియకపోవచ్చు కానీ నేటికీ పల్లెల్లో కొన్ని ఇళ్లల్లో ఈ సామగ్రి కన్పిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్ను, మోర్త, వెలగదుర్రు, కాల్దరి, చివటం, పసలపూడి తదితర గ్రామాల్లోని అపురూప సామగ్రి ఇప్పటికీ కనువిందు చేస్తున్నాయి. ఆధునిక మనిషి అవసరాలకు తగ్గట్టుగా నిత్యం ఎన్నో కొత్త వస్తువులు తయారవుతున్నాయి. విలాసవంతమైన వస్తువులు ఎన్ని వచ్చినా పాతకాలం నాటి సామగ్రి ఎప్పుడూ అపురూపమే. ఇప్పుడంటే అంతా ప్లాస్టిక్‌మయం అయింది కానీ గతంలో ఇత్తడి, రాగి వంటి లోహాలతో చేసిన సామగ్రి ఎక్కువగా వినియోగించేవారు. ఇప్పటి తరానికి ఇవి తెలియకపోవచ్చు కానీ నేటికీ పల్లెల్లో కొన్ని ఇళ్లల్లో ఈ సామగ్రి కన్పిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్ను, మోర్త, వెలగదుర్రు, కాల్దరి, చివటం, పసలపూడి తదితర గ్రామాల్లోని అపురూప సామగ్రి ఇప్పటికీ కనువిందు చేస్తున్నాయి.
14/15
కృష్ణమ్మ ఒడి నుంచి సంగమేశ్వర గర్భాలయం బయటపడుతోంది. శ్రీశైల జలాశయం నీటిమట్టం మంగళవారం 843 అడుగులకు తగ్గటంతో గర్భాలయం ప్రహరీ వరకు బయటపడింది. ఇంకో ఐదు అడుగుల మేర నీటిమట్టం తగ్గితే ఆదివారానికి ఆలయం పూర్తిగా బయటపడుతోందని, రెండు రోజులపాటు ఆలయాన్ని శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటామని  పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. ఫిబ్రవరి 1న భీష్మ ఏకాదశి రోజున సంగమేశ్వరుడు తొలి పూజ అందుకునే అవకాశముందని వివరించారు. కృష్ణమ్మ ఒడి నుంచి సంగమేశ్వర గర్భాలయం బయటపడుతోంది. శ్రీశైల జలాశయం నీటిమట్టం మంగళవారం 843 అడుగులకు తగ్గటంతో గర్భాలయం ప్రహరీ వరకు బయటపడింది. ఇంకో ఐదు అడుగుల మేర నీటిమట్టం తగ్గితే ఆదివారానికి ఆలయం పూర్తిగా బయటపడుతోందని, రెండు రోజులపాటు ఆలయాన్ని శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. ఫిబ్రవరి 1న భీష్మ ఏకాదశి రోజున సంగమేశ్వరుడు తొలి పూజ అందుకునే అవకాశముందని వివరించారు.
15/15
అల్లూరి జిల్లా మన్యంలో మళ్లీ చలిపులి పంజా విసిరింది. మంగళవారం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చింతపల్లిలో మంగళవారం ఉదయం అత్యల్పంగా 4.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది. జనవరి  మొదటి వారంలో 1.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తరవాత క్రమంగా పెరుగుతూ వచ్చిన వచ్చిన ఉష్ణోగ్రతలు మళ్లీ ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత బాగా పెరిగింది. దీంతో స్థానికులు వణికిపోతున్నారు. అల్లూరి జిల్లా మన్యంలో మళ్లీ చలిపులి పంజా విసిరింది. మంగళవారం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చింతపల్లిలో మంగళవారం ఉదయం అత్యల్పంగా 4.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది. జనవరి మొదటి వారంలో 1.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తరవాత క్రమంగా పెరుగుతూ వచ్చిన వచ్చిన ఉష్ణోగ్రతలు మళ్లీ ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత బాగా పెరిగింది. దీంతో స్థానికులు వణికిపోతున్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు