News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (26-01-2023)

Updated : 26 Jan 2023 08:27 IST
1/14
జూబ్లీహిల్స్‌ రోడ్‌నం.10లో నిన్నటి వరకు పచ్చని ఆకులతో కళకళలాడిన ఓ చెట్టు.. ఒక్కసారిగా కాండం నుంచి కొమ్మల వరకు చెదలు పట్టి.. పూర్తిగా ఎండిపోయింది. పచ్చని చెట్టుకు చెదలు పట్టడంతో పూర్తిగా ఎండిపోయింది. ఇలా నగరంలో పలు చెట్లు వివిధ తెగుళ్లకు గురవుతున్నాయి. ఇలాంటి వాటి రక్షణ పట్ల సంబంధిత అధికారులు దృష్టిపెడితే.. మళ్లీ పచ్చదనం చిగురిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌నం.10లో నిన్నటి వరకు పచ్చని ఆకులతో కళకళలాడిన ఓ చెట్టు.. ఒక్కసారిగా కాండం నుంచి కొమ్మల వరకు చెదలు పట్టి.. పూర్తిగా ఎండిపోయింది. పచ్చని చెట్టుకు చెదలు పట్టడంతో పూర్తిగా ఎండిపోయింది. ఇలా నగరంలో పలు చెట్లు వివిధ తెగుళ్లకు గురవుతున్నాయి. ఇలాంటి వాటి రక్షణ పట్ల సంబంధిత అధికారులు దృష్టిపెడితే.. మళ్లీ పచ్చదనం చిగురిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
2/14
బంజారాహిల్స్‌లోని నీరూస్‌లో వివాహాది శుభకార్యాలకు నూతన వస్త్రశ్రేణిని బుధవారం ఆవిష్కరించారు. సినీ తారలు, రూప దర్శినులు సందడి చేశారు.  వార్షిక విక్రయాల సందర్భంగా దాదాపు 50 శాతం వరకు ఆయా దుస్తులపై రాయితీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. బంజారాహిల్స్‌లోని నీరూస్‌లో వివాహాది శుభకార్యాలకు నూతన వస్త్రశ్రేణిని బుధవారం ఆవిష్కరించారు. సినీ తారలు, రూప దర్శినులు సందడి చేశారు. వార్షిక విక్రయాల సందర్భంగా దాదాపు 50 శాతం వరకు ఆయా దుస్తులపై రాయితీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
3/14
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన మధుకర్‌ (28) సుద్దముక్కలనే అక్షరాలుగా చేసి జాతీయ గీతాన్ని మూడు భాష (హిందీ, తెలుగు, ఆంగ్లం)ల్లో బ్లాక్‌బోర్డులపై అతికించారు. ఇందుకోసం ఆయన 15 రోజులు శ్రమించారు. చిత్రలేఖనం, వ్యర్థాలతో సుందర అలంకరణ, ఒకేసారి రెండు చేతులతో రాయడం తదితర కళలను ప్రదర్శిస్తూ రాష్ట్రస్థాయిలో మధుకర్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన మధుకర్‌ (28) సుద్దముక్కలనే అక్షరాలుగా చేసి జాతీయ గీతాన్ని మూడు భాష (హిందీ, తెలుగు, ఆంగ్లం)ల్లో బ్లాక్‌బోర్డులపై అతికించారు. ఇందుకోసం ఆయన 15 రోజులు శ్రమించారు. చిత్రలేఖనం, వ్యర్థాలతో సుందర అలంకరణ, ఒకేసారి రెండు చేతులతో రాయడం తదితర కళలను ప్రదర్శిస్తూ రాష్ట్రస్థాయిలో మధుకర్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
4/14
ప్రస్తుతం జరుగుతున్న ఐఐటీ-జేఈఈ మెయిన్స్‌ పరీక్షలకు తమ పిల్లలను తల్లిదండ్రులే పరీక్ష కేంద్రాలకు తీసుకొస్తున్నారు. పూర్తయ్యే వరకు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. హయత్‌నగర్‌ పరిధి భాగ్యలతలోని ఓ పరీక్ష కేంద్రం వద్ద బుధవారం కనిపించిన చిత్రమిది. ప్రస్తుతం జరుగుతున్న ఐఐటీ-జేఈఈ మెయిన్స్‌ పరీక్షలకు తమ పిల్లలను తల్లిదండ్రులే పరీక్ష కేంద్రాలకు తీసుకొస్తున్నారు. పూర్తయ్యే వరకు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. హయత్‌నగర్‌ పరిధి భాగ్యలతలోని ఓ పరీక్ష కేంద్రం వద్ద బుధవారం కనిపించిన చిత్రమిది.
5/14
గణతంత్ర వేడుకల సందర్భంగా అనంతపురంలో విద్యుత్తు కాంతుల్లో వెలిగిపోతున్న గడియార స్తంభం. గణతంత్ర వేడుకల సందర్భంగా అనంతపురంలో విద్యుత్తు కాంతుల్లో వెలిగిపోతున్న గడియార స్తంభం.
6/14
 కన్నడ నటుడు, దివంగత పునీత్‌రాజ్‌కుమార్‌ విగ్రహాన్ని ఇనుప వ్యర్థాలతో తయారు చేశారు గుంటూరు తెనాలి శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిచంద్ర, శ్రీహర్ష. టన్నున్నర ఇనుప ముక్కలతో 9 అడుగుల ఎత్తులో రూపొందించిన విగ్రహాన్ని పట్టణ వహాబ్‌ రోడ్డులోని సూర్య శిల్పశాల వద్ద బుధవారం ప్రదర్శనగా ఉంచారు. 

7/14
  విజయనగరం, సాలూరు మండలం పండయ్యవలసలోని పామాయిల్‌ తోటలో అక్కడక్కడా పుట్టలు వెలిశాయి. అందులో ఒకటి దాదాపు పది అడుగుల ఎత్తులో ఉండి చూపరులను ఆకట్టుకుంటోంది.  . విజయనగరం, సాలూరు మండలం పండయ్యవలసలోని పామాయిల్‌ తోటలో అక్కడక్కడా పుట్టలు వెలిశాయి. అందులో ఒకటి దాదాపు పది అడుగుల ఎత్తులో ఉండి చూపరులను ఆకట్టుకుంటోంది. .
8/14
అనకాపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సారె ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఏటా గవరపాలెం  గౌరీ పరమేశ్వరుల జాతరకు ముందు సారె ఊరేగించడం ఆనవాయితీ. ఈ ప్రాంతంలో  సంప్రదాయ పద్ధతుల్లో చేసే అన్ని రకాల పిండివంటలు, తీపిపదార్ధాలు సిద్ధంచేసి గౌరమ్మకు సమర్పించారు. 

9/14
 హనుమకొండ వడ్డేపల్లి చర్చి నుంచి ఫిల్టర్‌ బెడ్‌ రోడ్డుకు వెళ్లే దారిలో బుధవారం  ప్రధాన పైపులైను లీకేజీ అయింది. తాగునీరు నింగికి ఎగసిపడింది. దానిని చూసిన పలువురు  చరవాణుల్లో చిత్రాలు  తీసుకున్నారు. హనుమకొండ వడ్డేపల్లి చర్చి నుంచి ఫిల్టర్‌ బెడ్‌ రోడ్డుకు వెళ్లే దారిలో బుధవారం ప్రధాన పైపులైను లీకేజీ అయింది. తాగునీరు నింగికి ఎగసిపడింది. దానిని చూసిన పలువురు చరవాణుల్లో చిత్రాలు తీసుకున్నారు.
10/14
    హైదరాబాద్, నగరం గణతంత్ర వేడుకలకు ముస్తాబైంది. చారిత్రక ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు  మువ్వన్నెల్లో మెరిసిపోతున్నాయి. బుధవారం రాత్రి చార్మినార్, కాచిగూడ రైల్వేస్టేషన్‌ విద్యుత్తు కాంతుల్లో వెలుగులీనాయి. 

11/14
 విద్యుత్తు వెలుగుల జిగేలు.. చుట్టూ అల్లుకున్న పచ్చదనం...  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనం నమూనా. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, నాంపల్లి, నుమాయిష్‌లోని స్టాల్‌లో ఏర్పాటు చేసిన ఈ నమూనా అందరినీ ఆకట్టుకుంటుంది.

12/14
శీతాకాలం.. మంచు కురిసే వేళ.. సూర్యుడు ఉదయించే సమయంలో బుధవారం 6.30 గంటలకు  హైదరాబాద్, మూసాపేట కైత్లాపూర్‌ డంపింగ్‌యార్డు వద్ద కనిపించిన దృశ్యమిది. మబ్బులను చీల్చుకుంటూ వస్తున్న వెలుగులతో ప్రకృతి అందాలు ఆకట్టుకున్నాయి.

13/14
విద్యుత్‌ దీపాల వెలుగుల్లో ఏపీ శాసనసభ, సచివాలయ భవనాలు విద్యుత్‌ దీపాల వెలుగుల్లో ఏపీ శాసనసభ, సచివాలయ భవనాలు
14/14
 గణతంత్ర దినోత్సవం సందర్భంగా  తెలంగాణ శాసనసభ భవనాన్ని మూడు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. మువ్వన్నెల్లో వెలుగుతూ శాసనసభ భవనం ఇలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనసభ భవనాన్ని మూడు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. మువ్వన్నెల్లో వెలుగుతూ శాసనసభ భవనం ఇలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

మరిన్ని