News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (26-01-2023)

Updated : 26 Jan 2023 22:25 IST
1/27
హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్‌ హై స్కూల్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా యువతులు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్‌ హై స్కూల్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా యువతులు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
2/27
జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్సవంలో ఏర్పాటు చేసిన రంగులరాట్నం వెలుగులు జిగేలుమంటున్నాయి. జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్సవంలో ఏర్పాటు చేసిన రంగులరాట్నం వెలుగులు జిగేలుమంటున్నాయి.
3/27
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఎట్‌ హోం’ కార్యక్రమానికి సీఎం జగన్‌, ప్రముఖులు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఎట్‌ హోం’ కార్యక్రమానికి సీఎం జగన్‌, ప్రముఖులు హాజరయ్యారు.
4/27
కేంద్ర బడ్జెట్ కసరత్తు పూర్తైన వేళ సంప్రదాయ హల్వా కార్యక్రమాన్ని ఆర్థికశాఖ నిర్వహించింది. బడ్జెట్ ప్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. చిన్న కప్పుల్లో హల్వావేసిన మంత్రి అక్కడి ఉద్యోగులకు స్వయంగా అందించారు. కేంద్ర బడ్జెట్ కసరత్తు పూర్తైన వేళ సంప్రదాయ హల్వా కార్యక్రమాన్ని ఆర్థికశాఖ నిర్వహించింది. బడ్జెట్ ప్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. చిన్న కప్పుల్లో హల్వావేసిన మంత్రి అక్కడి ఉద్యోగులకు స్వయంగా అందించారు.
5/27
మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన హార్టికల్చర్‌ షోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల మొక్కలను ప్రదర్శించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన హార్టికల్చర్‌ షోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల మొక్కలను ప్రదర్శించారు.
6/27
కర్నూలులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. కర్నూలులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
7/27
సెల్యూట్‌ చేస్తోన్న చిన్నారి.. సెల్యూట్‌ చేస్తోన్న చిన్నారి..
8/27
కరీంనగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
9/27
కరీంనగర్ ఆర్టీసీ డిపోలో రెండు సూపర్ లగ్జరీ బస్సులను మంత్రి గంగుల కమలాకర్‌ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కరీంనగర్ ఆర్టీసీ డిపోలో రెండు సూపర్ లగ్జరీ బస్సులను మంత్రి గంగుల కమలాకర్‌ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
10/27
కల్యాణ్‌రామ్‌ హీరోగా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమిగోస్‌’. అశికా రంగనాథ్‌ కథానాయిక. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెకండ్‌ సింగిల్ ‘ఎన్నో రాత్రులొస్తాయి’ పాటను ఈ నెల 29న సాయంత్రం 5.09గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కల్యాణ్‌రామ్‌ హీరోగా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమిగోస్‌’. అశికా రంగనాథ్‌ కథానాయిక. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెకండ్‌ సింగిల్ ‘ఎన్నో రాత్రులొస్తాయి’ పాటను ఈ నెల 29న సాయంత్రం 5.09గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
11/27
దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి వెలుగులోకి రాని వీరులకు అంకితమిస్తూ ‘సత్య’ అనే వీడియో పాటను త్వరలో విడుదల చేస్తున్నట్లు దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి నటించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ట్విటర్‌ వేదికగా పోస్టు చేశారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి వెలుగులోకి రాని వీరులకు అంకితమిస్తూ ‘సత్య’ అనే వీడియో పాటను త్వరలో విడుదల చేస్తున్నట్లు దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి నటించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ట్విటర్‌ వేదికగా పోస్టు చేశారు.
12/27
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్ ఆధ్వర్యంలో దుర్గం చెరువు తీగల వంతెన నుంచి సైకిల్ రైడ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్ ఆధ్వర్యంలో దుర్గం చెరువు తీగల వంతెన నుంచి సైకిల్ రైడ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
13/27
సినీనటుడు రవితేజ జన్మదినం సందర్భంగా ప్రముఖ నటుడు చిరంజీవి ఆయనకు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన తమ్ముడు రవితేజ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని చెబుతూ పోస్టు పెట్టారు. చిరంజీవి, రవితేజ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. సినీనటుడు రవితేజ జన్మదినం సందర్భంగా ప్రముఖ నటుడు చిరంజీవి ఆయనకు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన తమ్ముడు రవితేజ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని చెబుతూ పోస్టు పెట్టారు. చిరంజీవి, రవితేజ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే.
14/27
నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. కీర్తి సురేష్‌ కథానాయిక. చిత్ర టీజర్‌ను ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. కీర్తి సురేష్‌ కథానాయిక. చిత్ర టీజర్‌ను ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
15/27
భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా.. మహేంద్ర సింగ్‌ ధోనీతో కలిసి ద్విచక్రవాహనంపై దిగిన ఫొటోను తన ట్విటర్‌లో ఖాతాలో పంచుకున్నారు. ‘షోలే 2’ త్వరలో రాబోతోందని పాండ్యా ఫన్నీగా పోస్టు పెట్టారు. భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా.. మహేంద్ర సింగ్‌ ధోనీతో కలిసి ద్విచక్రవాహనంపై దిగిన ఫొటోను తన ట్విటర్‌లో ఖాతాలో పంచుకున్నారు. ‘షోలే 2’ త్వరలో రాబోతోందని పాండ్యా ఫన్నీగా పోస్టు పెట్టారు.
16/27
వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా‘సైంధవ్‌’. ఈ సినిమా చిత్రీకరణ గురువారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. కార్యక్రమంలో సినీనటుడు రానా పాల్గొన్నారు. వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా‘సైంధవ్‌’. ఈ సినిమా చిత్రీకరణ గురువారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. కార్యక్రమంలో సినీనటుడు రానా పాల్గొన్నారు.
17/27
సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో రైల్వే శాఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో రైల్వే శాఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
18/27
19/27
బాసరలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. బాసరలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
20/27
పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
21/27
తిరుమల శ్రీవారిని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్‌తో కలిసి ఆయన స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్‌తో కలిసి ఆయన స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
22/27
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
23/27
24/27
మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌
25/27
26/27
రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
27/27

మరిన్ని