News in Pics: చిత్రం చెప్పే సంగతులు-02(06-02-2023)

Updated : 06 Feb 2023 22:33 IST
1/27
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా  మైహోం గ్రూప్‌ ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు మనవరాలు జూపల్లి ఈడ్య ఆకట్టుకునే నృత్య ప్రదర్శన ఇచ్చింది. సోమవారం సాయంత్రం దీపాంజలి కూచిపూడి నృత్య అకాడమీ శిష్య బృందం ఇచ్చిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మైహోం గ్రూప్‌ ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు మనవరాలు జూపల్లి ఈడ్య ఆకట్టుకునే నృత్య ప్రదర్శన ఇచ్చింది. సోమవారం సాయంత్రం దీపాంజలి కూచిపూడి నృత్య అకాడమీ శిష్య బృందం ఇచ్చిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది..
2/27
బెంగళూరులో ‘ఇండియన్‌ ఎనర్జీ వీక్‌’ నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీకి అర్జెంటీనాకు చెందిన వైపీఎఫ్ అధ్యక్షుడు పాబ్లో గొంజాలెజ్‌ మెస్సీ ఫుట్‌బాల్‌ జెర్సీని బహూకరించారు. బెంగళూరులో ‘ఇండియన్‌ ఎనర్జీ వీక్‌’ నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీకి అర్జెంటీనాకు చెందిన వైపీఎఫ్ అధ్యక్షుడు పాబ్లో గొంజాలెజ్‌ మెస్సీ ఫుట్‌బాల్‌ జెర్సీని బహూకరించారు.
3/27
సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలో సోమవారం లింగమంతుల జాతర ఘనంగా ప్రారంభమైంది. భక్తులు పెద్దఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలో సోమవారం లింగమంతుల జాతర ఘనంగా ప్రారంభమైంది. భక్తులు పెద్దఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
4/27
కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ధనుష్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న చిత్రం ‘సార్‌’. వెంకీ అట్లూరి దర్శకుడు. సంయుక్త మేనన్‌ కథానాయిక. ఈ నెల 8న ట్రైలర్‌ విడుదల చేస్తునట్లు చిత్ర బృందం తెలిపింది. కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ధనుష్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న చిత్రం ‘సార్‌’. వెంకీ అట్లూరి దర్శకుడు. సంయుక్త మేనన్‌ కథానాయిక. ఈ నెల 8న ట్రైలర్‌ విడుదల చేస్తునట్లు చిత్ర బృందం తెలిపింది.
5/27
తమిళ నటుడు విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వారసుడు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను అలరించింది . ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 300కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించిందని తెలుపుతూ చిత్ర బృందం ట్విటర్‌లో పోస్టు చేసింది. తమిళ నటుడు విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వారసుడు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను అలరించింది . ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 300కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించిందని తెలుపుతూ చిత్ర బృందం ట్విటర్‌లో పోస్టు చేసింది.
6/27
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మేడారంలో అమ్మవార్లను దర్శించుకొని ‘హాత్‌ సే హాత్‌ జోడో’ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన బంగారం(బెల్లం)తో తులాభారం వేసుకున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మేడారంలో అమ్మవార్లను దర్శించుకొని ‘హాత్‌ సే హాత్‌ జోడో’ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన బంగారం(బెల్లం)తో తులాభారం వేసుకున్నారు.
7/27
తులాభారం వేసుకున్న రేవంత్‌. తులాభారం వేసుకున్న రేవంత్‌.
8/27
‘హాత్‌ సే హాత్‌ జోడో’ పాదయాత్రలో రేవంత్‌రెడ్డి, సీతక్క తదితరులు ‘హాత్‌ సే హాత్‌ జోడో’ పాదయాత్రలో రేవంత్‌రెడ్డి, సీతక్క తదితరులు
9/27
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మాజీ ఎంపీ హనుమంతరావు ఆధ్వర్యంలో ‘హాత్‌ సే హాత్‌ జోడో’ కార్యక్రమం నిర్వహించారు.  ఇందులో భాగంగా నల్లకుంటలో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మాజీ ఎంపీ హనుమంతరావు ఆధ్వర్యంలో ‘హాత్‌ సే హాత్‌ జోడో’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నల్లకుంటలో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
10/27
స్విట్జర్లాండ్‌లోని జుమెల్లెస్‌ జంట శిఖరాల మధ్య నిండు చంద్రుడు ఇలా కనువిందు చేశాడు. స్విట్జర్లాండ్‌లోని జుమెల్లెస్‌ జంట శిఖరాల మధ్య నిండు చంద్రుడు ఇలా కనువిందు చేశాడు.
11/27
హైదరాబాద్‌లోని సుచిత్రలో ఈ నెల 10న ఓ నగల దుకాణాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి నిర్వహించిన ప్రీలాంచ్‌ ఈవెంట్‌లో పలువురు మోడల్స్‌ పాల్గొని నూతన డిజైన్ల ఆభరణాలతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని సుచిత్రలో ఈ నెల 10న ఓ నగల దుకాణాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి నిర్వహించిన ప్రీలాంచ్‌ ఈవెంట్‌లో పలువురు మోడల్స్‌ పాల్గొని నూతన డిజైన్ల ఆభరణాలతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
12/27
ప్రీలాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న మోడల్‌ శ్రీలేఖ ప్రీలాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న మోడల్‌ శ్రీలేఖ
13/27
సైకిల్‌పై దేశాన్ని చుట్టివస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన క్యాంప్‌ ఆఫీస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆశాను అభినందించిన సీఎం.. ఆమె లక్ష్యం నెరవేరాలని రూ.10లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. మహిళా భద్రత, సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్నట్లు మధ్యప్రదేశ్‌కు చెందిన ఆశా మాలవ్య తెలిపారు. సైకిల్‌పై దేశాన్ని చుట్టివస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన క్యాంప్‌ ఆఫీస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆశాను అభినందించిన సీఎం.. ఆమె లక్ష్యం నెరవేరాలని రూ.10లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. మహిళా భద్రత, సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్నట్లు మధ్యప్రదేశ్‌కు చెందిన ఆశా మాలవ్య తెలిపారు.
14/27
హైదరాబాద్‌ సంజీవయ్య పార్కు సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీ పనుల్లో పలువురు కూలీలు నిమగ్నమయ్యారు. వారి పిల్లల్లో ఓ చిన్నారి బాలిక పాఠశాలకు వెళ్లేముందు తన తమ్ముడి ఆకలి తీరుస్తూ కనిపించింది. హైదరాబాద్‌ సంజీవయ్య పార్కు సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీ పనుల్లో పలువురు కూలీలు నిమగ్నమయ్యారు. వారి పిల్లల్లో ఓ చిన్నారి బాలిక పాఠశాలకు వెళ్లేముందు తన తమ్ముడి ఆకలి తీరుస్తూ కనిపించింది.
15/27
శివరాజ్‌కుమార్‌ హీరోగా ఎ.హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వేద’. ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను మంగళవారం సాయంత్రం 6గంటలకు దస్పల్లా హోటల్‌లో నిర్వహించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు బాలకృష్ణ హాజరు కానున్నారు. శివరాజ్‌కుమార్‌ హీరోగా ఎ.హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వేద’. ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను మంగళవారం సాయంత్రం 6గంటలకు దస్పల్లా హోటల్‌లో నిర్వహించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు బాలకృష్ణ హాజరు కానున్నారు.
16/27
చిరంజీవి, శ్రుతిహాసన్‌ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ చిత్రం  ప్రేక్షకులని అలరిస్తూ విజయవంతంగా 25రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించారు. చిరంజీవి, శ్రుతిహాసన్‌ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తూ విజయవంతంగా 25రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించారు.
17/27
సుహాస్‌ హీరోగా షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం విజయపథంలో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హీరో మహేశ్‌బాబు చిత్రబృందాన్ని అభినందించారు. ‘అందరూ చూడాల్సిన చిత్రం. ముఖ్యంగా క్లైమాక్స్‌ చాలా బాగుంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు. సుహాస్‌ హీరోగా షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం విజయపథంలో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హీరో మహేశ్‌బాబు చిత్రబృందాన్ని అభినందించారు. ‘అందరూ చూడాల్సిన చిత్రం. ముఖ్యంగా క్లైమాక్స్‌ చాలా బాగుంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు.
18/27
మాస్‌ మహారాజా రవితేజ హీరోగా సుధీర్‌వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావణాసుర’. ఈ చిత్రానికి సంబంధించిన ‘రావణ ఆంథెమ్‌’ వీడియోను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. మాస్‌ మహారాజా రవితేజ హీరోగా సుధీర్‌వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావణాసుర’. ఈ చిత్రానికి సంబంధించిన ‘రావణ ఆంథెమ్‌’ వీడియోను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
19/27
కల్యాణ్‌ రామ్ (Kalyan Ram), ఆషిక జంటగా దర్శకుడు రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ U/A సర్టిఫికేట్‌ ఇచ్చినట్లు చిత్రబృందం తెలిపింది. ఫిబ్రవరి 10న సినిమా విడుదలకానుంది. కల్యాణ్‌ రామ్ (Kalyan Ram), ఆషిక జంటగా దర్శకుడు రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ U/A సర్టిఫికేట్‌ ఇచ్చినట్లు చిత్రబృందం తెలిపింది. ఫిబ్రవరి 10న సినిమా విడుదలకానుంది.
20/27
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్’. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 11న రీ రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం ట్వీట్‌ చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్’. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 11న రీ రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం ట్వీట్‌ చేసింది.
21/27
మైనర్ బాలికలపై  లైంగిక దాడులు, హత్యాచారాలు అరికట్టాలని నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మైనర్ బాలికలపై లైంగిక దాడులు, హత్యాచారాలు అరికట్టాలని నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
22/27
సినీ దర్శకుడు గోపీచంద్‌ మలినేని కుటుంబ సమేతంగా ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సినీ దర్శకుడు గోపీచంద్‌ మలినేని కుటుంబ సమేతంగా ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
23/27
ఈ రోజు రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సందర్భంగా పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ రోజు రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సందర్భంగా పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
24/27
విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు
25/27
లాస్‌ ఏంజెలెస్‌లో 65వ వార్షిక గ్రామీ అవార్డ్స్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్‌, సెలబ్రిటీలు పాల్గొన్నారు. ‘ఈజీ ఆన్‌ మీ’లో ప్రదర్శనకు గానూ అడెలె ఈ అవార్డును గెలుచుకున్నారు. లాస్‌ ఏంజెలెస్‌లో 65వ వార్షిక గ్రామీ అవార్డ్స్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్‌, సెలబ్రిటీలు పాల్గొన్నారు. ‘ఈజీ ఆన్‌ మీ’లో ప్రదర్శనకు గానూ అడెలె ఈ అవార్డును గెలుచుకున్నారు.
26/27
రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. భారాస నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. భారాస నాయకులు పాల్గొన్నారు.
27/27
తితిదే జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మంత్రి హరీశ్‌రావు బయలుదేరారు. తితిదే జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మంత్రి హరీశ్‌రావు బయలుదేరారు.

మరిన్ని