News in Pics: చిత్రం చెప్పే సంగతులు-01(07-02-2023)

Updated : 07 Feb 2023 10:05 IST
1/15
అంతర్వేదిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దివ్వ నృసింహస్వామిగా ఉభయ దేవేరులతో హంస వాహనంపై కొలువుదీరారు.పరియణోత్సవాల్లో భాగంగా పదో రోజు విద్యుద్దీపకాంతులతో తళుకులీనుతున్న జలాలపై విహరించిన కంటికింపైన కమనీయ దర్శన భాగ్యం భక్తులకు అందించారు. అంతర్వేదిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దివ్వ నృసింహస్వామిగా ఉభయ దేవేరులతో హంస వాహనంపై కొలువుదీరారు.పరియణోత్సవాల్లో భాగంగా పదో రోజు విద్యుద్దీపకాంతులతో తళుకులీనుతున్న జలాలపై విహరించిన కంటికింపైన కమనీయ దర్శన భాగ్యం భక్తులకు అందించారు.
2/15
అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని రాజవొమ్మంగిలో సోమవారం దాహం తీర్చుకోవడానికి ఓ గోవు దుకాణం వద్దకు వెళ్లింది. అక్కడ ఉన్న బకెట్‌లో ఉన్న నీళ్లు తాగి తలపైకి ఎత్తగా బకెట్ కూడా వచ్చింది. ఏం చేయాలో తెలియక బకెట్‌తోనే తంటాలు పడుతూ తిరిగింది. స్థానికులు దాన్ని తీయడంతో స్వేచ్ఛగా తిరిగింది. అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని రాజవొమ్మంగిలో సోమవారం దాహం తీర్చుకోవడానికి ఓ గోవు దుకాణం వద్దకు వెళ్లింది. అక్కడ ఉన్న బకెట్‌లో ఉన్న నీళ్లు తాగి తలపైకి ఎత్తగా బకెట్ కూడా వచ్చింది. ఏం చేయాలో తెలియక బకెట్‌తోనే తంటాలు పడుతూ తిరిగింది. స్థానికులు దాన్ని తీయడంతో స్వేచ్ఛగా తిరిగింది.
3/15
హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఠాణా బయట రోడ్డుపై వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు నిలిపి ఉంచారు. అనేక రోజులుగా వాటిని అలాగే ఉంచడంతో క్రమంగా పాడైపోతున్నాయి. ఇలానే ఉంటే వాహనాల విడిభాగాలు దొగింలించే అవకాశమూ లేకపోలేదు. పోలీసు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఠాణా బయట రోడ్డుపై వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు నిలిపి ఉంచారు. అనేక రోజులుగా వాటిని అలాగే ఉంచడంతో క్రమంగా పాడైపోతున్నాయి. ఇలానే ఉంటే వాహనాల విడిభాగాలు దొగింలించే అవకాశమూ లేకపోలేదు. పోలీసు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
4/15
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన రవికుమార్ ఖతర్‌ దేశంలో హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్సు చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ మయన్మార్ దేశానికి చెందిన జిన్‌నెహు థియేన్‌(క్యాథరిన్‌) రవికి పరిచయం అయింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో సోమవారం మండలంలోని చింతగూడ చర్చిలో గ్రామస్థుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన రవికుమార్ ఖతర్‌ దేశంలో హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్సు చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ మయన్మార్ దేశానికి చెందిన జిన్‌నెహు థియేన్‌(క్యాథరిన్‌) రవికి పరిచయం అయింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో సోమవారం మండలంలోని చింతగూడ చర్చిలో గ్రామస్థుల సమక్షంలో ఒక్కటయ్యారు.
5/15
 సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న దురాజ్‌పల్లి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరలో రెండో రోజు గట్టుతో పాటు పరిసర ప్రాంతాలు మొత్తం భక్తజనంతో నిండిపోయాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో గట్టు చెంతకు చేరుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. 

6/15
 నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం వైకాపా ఇన్‌ఛార్జిగా నియమితులైన ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి సోమవారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు ర్యాలీ కోసం జాతీయ రహదారి నుంచి ట్రాఫిక్‌ని మళ్లించారు. ఇదే సందర్భంగా ట్రాఫిక్‌లో అంబులెన్స్‌ చిక్కుకుంది. 

7/15
  ఉత్తర కర్ణాటకలో పేరెన్నికగన్న జోయిడా తాలూకా ఉలవిలోని చెన్నబసవేశ్వర మహా రథోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు.

ఉత్తర కర్ణాటకలో పేరెన్నికగన్న జోయిడా తాలూకా ఉలవిలోని చెన్నబసవేశ్వర మహా రథోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు.
8/15
శ్రీకాకుళం జిల్లా , మందస మండలం పిడిమందస సమీపంలోని వైద్యనాధ ఆలయమిది. పురాతనమైన ఈ ప్రసిద్ధ మందిరం జీర్ణావస్థకు చేరింది. నిర్వహణకు రూ.3 కోట్ల విలువైన ఆరు ఎకరాల మాన్యం భూములున్నా ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. లోపలకు వెళ్లేందుకు భక్తులు భయపడుతున్నారు.

9/15
 విశాఖనగరంలోని డైమండ్‌ పార్కు వద్ద సోమవారం ఒకరు ఈ వాహనంపై వెళ్తుండగా పలువురు ఆసక్తిగా చూశారు. వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించిన ఎలక్ట్రిక్‌ మొబైల్‌ స్కూటర్‌ గంటకు 20 కి.మీ వేగంతో వెళుతుంది.

10/15
భారత నౌకాదళానికి చెందిన ప్రతిష్ఠాత్మక విమాన వాహక యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై సోమవారం తొలి లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఎల్‌ఏసీ) దిగినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. ‘ఆత్మ నిర్భర్‌’ దిశగా  భారతదేశ రక్షణ వ్యవస్థలో ఇదో చరిత్రాత్మక మైలురాయి అని నేవీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

11/15
  విశాఖపట్నం: తగరపువలస సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనం చివరి అంచున కూర్చోపెట్టుకొని ఓ చిన్నారిని తీసుకువెళ్లిన వ్యక్తి తీరు (పై చిత్రంలో) హడలుగొట్టింది. ఇది ప్రమాదకరమని కొందరు చెప్పినా...  చెవికెక్కించుకోకుండా ముందుకు వెళ్లడం గమనార్హం. 

12/15
 సోమవారం తెల్లవారుజామున  మహబూబ్‌నగర్‌లోని  మన్యంకొండలో స్వామివారి రథోత్సవం (తేరు) నేత్రపర్వంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి, సరిహద్దు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున చేరుకోవడంతో తేరుబజారు భక్తజనసంద్రమైంది.

13/15
ఆంక్షల నేపథ్యంలో సోమవారం  హైదరాబాద్‌లోని అసెంబ్లీ, పబ్లిక్‌ గార్డెన్స్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. అందులో ఓ అంబులెన్స్‌ చిక్కుకుపోయింది. దాన్ని తరలించేందుకు పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది ఆంక్షల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ, పబ్లిక్‌ గార్డెన్స్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. అందులో ఓ అంబులెన్స్‌ చిక్కుకుపోయింది. దాన్ని తరలించేందుకు పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది
14/15
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మిస్తున్న బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయ  పనులు చివరిదశకు చేరుకోగా వచ్చే 17న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మిస్తున్న బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయ పనులు చివరిదశకు చేరుకోగా వచ్చే 17న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
15/15
 కాంబోడియాలోని సీమ్‌ రీప్‌ ప్రావిన్సులో క్రాచ్‌పోవ్‌ అనే వ్యక్తి నిర్మించిన విమానం ఇల్లును సందర్శిస్తున్న స్థానికులు

కాంబోడియాలోని సీమ్‌ రీప్‌ ప్రావిన్సులో క్రాచ్‌పోవ్‌ అనే వ్యక్తి నిర్మించిన విమానం ఇల్లును సందర్శిస్తున్న స్థానికులు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు