News in Pics: చిత్రం చెప్పే సంగతులు-(08-02-2023)

Updated : 08 Feb 2023 09:57 IST
1/15
‘కాళేశ్వరం’ జలాశయాల కారణంగా కాలువలు, కుంటలు, చెరువులు ఎప్పుడూ నిండుకుండలా ఉంటున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వివిధ పక్షులు నీటి వనరుల వద్దకు చేరి ఆహారాన్ని వేటాడుతున్నాయి. చిన్నకోడూరు మండలంలోని పలు చెరువులు నీటితో నిండుగా ఉన్నాయి. కొంగలు వందలకొద్దీ వచ్చి వాలాయి. ‘కాళేశ్వరం’ జలాశయాల కారణంగా కాలువలు, కుంటలు, చెరువులు ఎప్పుడూ నిండుకుండలా ఉంటున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వివిధ పక్షులు నీటి వనరుల వద్దకు చేరి ఆహారాన్ని వేటాడుతున్నాయి. చిన్నకోడూరు మండలంలోని పలు చెరువులు నీటితో నిండుగా ఉన్నాయి. కొంగలు వందలకొద్దీ వచ్చి వాలాయి.
2/15
భారీగా పెరిగిన వేర్లను చూసి మర్రిచెట్టని అనుకుంటే పొరపాటు పడినట్లే ఇది చింత చెట్టు. గతంలో చాలా ఎత్తు గడ్డపై ఉండేది. కాలక్రమంలో మట్టిని చదును చేస్తూ రావడంతో వేర్లు తేలి చూసే వారికి మర్రి ఊడల్లా కనిపిస్తున్నాయి. పాత తాండూరులోని స్థానిక నివాసి సల్మాన్‌ ఇంట్లో ఉంది ఈ చెట్టు. దీనికి దాదాపు 200 సంవత్సరాలకు పైగా వయసు ఉంటుందని ఆయన తెలిపారు. భారీగా పెరిగిన వేర్లను చూసి మర్రిచెట్టని అనుకుంటే పొరపాటు పడినట్లే ఇది చింత చెట్టు. గతంలో చాలా ఎత్తు గడ్డపై ఉండేది. కాలక్రమంలో మట్టిని చదును చేస్తూ రావడంతో వేర్లు తేలి చూసే వారికి మర్రి ఊడల్లా కనిపిస్తున్నాయి. పాత తాండూరులోని స్థానిక నివాసి సల్మాన్‌ ఇంట్లో ఉంది ఈ చెట్టు. దీనికి దాదాపు 200 సంవత్సరాలకు పైగా వయసు ఉంటుందని ఆయన తెలిపారు.
3/15
కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటి జీవాలు ఆహార వేటకు  రోజూ వెళతాయి. వాటికి ఆయా ప్రాంతాలు సుపరిచితాలే. చిన్నకోడూరు మండలం మాచాపూర్‌ పెద్ద చెరువు నీటి నుంచి గొర్రెలు, మేకలు వరుస కట్టి ఎంచక్కా దాటుతున్నాయి. వెనుక కాపరులూ వాటి వెంట ఇబ్బంది లేకుండా అనుసరిస్తున్నారు. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటి జీవాలు ఆహార వేటకు రోజూ వెళతాయి. వాటికి ఆయా ప్రాంతాలు సుపరిచితాలే. చిన్నకోడూరు మండలం మాచాపూర్‌ పెద్ద చెరువు నీటి నుంచి గొర్రెలు, మేకలు వరుస కట్టి ఎంచక్కా దాటుతున్నాయి. వెనుక కాపరులూ వాటి వెంట ఇబ్బంది లేకుండా అనుసరిస్తున్నారు.
4/15
కూడవెళ్లి వాగు పరివాహక ప్రాంతమంతా గోదావరి జలాల కళ తాండవిస్తోంది. నాచగిరి హల్దీ చెక్‌డ్యాం రెండు నెలలుగా ఎండిపోయి బోసిగా ఉన్న ఈ ప్రాంతం.. ఈ నెల 3న ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి.. హల్దీ, కూడవెళ్లి వాగుల్లోకి నీటిని విడుదల చేయగా వర్షాకాలంలో నిండుకుండలా కనిపించి పరవళ్లు దూకుతు భక్తులకు పారవశ్యాన్ని కల్పిస్తోంది. కూడవెళ్లి వాగు పరివాహక ప్రాంతమంతా గోదావరి జలాల కళ తాండవిస్తోంది. నాచగిరి హల్దీ చెక్‌డ్యాం రెండు నెలలుగా ఎండిపోయి బోసిగా ఉన్న ఈ ప్రాంతం.. ఈ నెల 3న ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి.. హల్దీ, కూడవెళ్లి వాగుల్లోకి నీటిని విడుదల చేయగా వర్షాకాలంలో నిండుకుండలా కనిపించి పరవళ్లు దూకుతు భక్తులకు పారవశ్యాన్ని కల్పిస్తోంది.
5/15
యాసంగి పంటకు నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోకూడదనే ఉద్దేశంతో మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నుంచి కూడవెళ్లి వాగు ద్వారా ఎగువమానేరుకు నీటిని విడుదల చేశారు. కూడవెళ్లి వాగుపై ఉన్న చెక్‌డ్యాం నిండి మంగళవారం రాత్రి ఎగువ మానేరులోకి గోదావరి జలాలు చేరుకున్నాయి. 31 అడుగుల సామర్థ్యం కలిగిన ఈ జలాశయం నుంచి యాసంగికి నీళ్లు విడుదల చేయటంతో ప్రస్తుతం 25 ఫీట్లకు చేరుకుంది. యాసంగి పంటకు నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోకూడదనే ఉద్దేశంతో మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నుంచి కూడవెళ్లి వాగు ద్వారా ఎగువమానేరుకు నీటిని విడుదల చేశారు. కూడవెళ్లి వాగుపై ఉన్న చెక్‌డ్యాం నిండి మంగళవారం రాత్రి ఎగువ మానేరులోకి గోదావరి జలాలు చేరుకున్నాయి. 31 అడుగుల సామర్థ్యం కలిగిన ఈ జలాశయం నుంచి యాసంగికి నీళ్లు విడుదల చేయటంతో ప్రస్తుతం 25 ఫీట్లకు చేరుకుంది.
6/15
ఫార్ములా ఈ- రేసింగ్‌కు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సమయం దగ్గర పడుతుండటంతో పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే ట్రాక్‌లు సిద్ధం కాగా.. రంగులు వేయడం, చుట్టూ కంచె ఏర్పాటు, సిగ్నల్‌  బిగింపు వంటి పనులు పూర్తయ్యాయి. మంగళవారం నిర్వాహకులు ట్రాక్‌ను పరిశీలిస్తూ కనిపించారు. ఫార్ములా ఈ- రేసింగ్‌కు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సమయం దగ్గర పడుతుండటంతో పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే ట్రాక్‌లు సిద్ధం కాగా.. రంగులు వేయడం, చుట్టూ కంచె ఏర్పాటు, సిగ్నల్‌ బిగింపు వంటి పనులు పూర్తయ్యాయి. మంగళవారం నిర్వాహకులు ట్రాక్‌ను పరిశీలిస్తూ కనిపించారు.
7/15
లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని చెత్త డంప్‌యార్డ్‌ ఇది. పరిసరాల్లో సేకరించిన చెత్తను ఇక్కడ కంప్రెస్‌ చేసి కంటైనర్లలో జవహర్‌నగర్‌ చేరవేయనున్నారు.  దీని వల్ల చెత్త నుంచి దుర్వాసన రాదు. రవాణా చేసేటప్పుడు రోడ్లపై పడే అవకాశమూ లేదు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని చెత్త డంప్‌యార్డ్‌ ఇది. పరిసరాల్లో సేకరించిన చెత్తను ఇక్కడ కంప్రెస్‌ చేసి కంటైనర్లలో జవహర్‌నగర్‌ చేరవేయనున్నారు. దీని వల్ల చెత్త నుంచి దుర్వాసన రాదు. రవాణా చేసేటప్పుడు రోడ్లపై పడే అవకాశమూ లేదు.
8/15
నాంపల్లి ప్రధాన రహదారిలో కనిపించిన చిత్రమిది. మినీ ట్రాలీ మీద గుట్టగా ఖాళీ నూనె డబ్బాలు పేర్చి తీసుకెళ్తున్నారు. ఎక్కడైన విద్యుత్తు వైర్లు తగిలితే ప్రమాదం ఊహించేది కాదు.  ట్రాఫిక్‌ పోలీసులూ పట్టించుకోకపోవడం గమనార్హం. నాంపల్లి ప్రధాన రహదారిలో కనిపించిన చిత్రమిది. మినీ ట్రాలీ మీద గుట్టగా ఖాళీ నూనె డబ్బాలు పేర్చి తీసుకెళ్తున్నారు. ఎక్కడైన విద్యుత్తు వైర్లు తగిలితే ప్రమాదం ఊహించేది కాదు. ట్రాఫిక్‌ పోలీసులూ పట్టించుకోకపోవడం గమనార్హం.
9/15
కేబుల్‌ పనుల కోసం ఎడాపెడా తవ్వకాలతో తాగునీటి పైపులైన్‌ దెబ్బతింది. రవీంద్రభారతి నుంచి సచివాలయం వెళ్లే దారిలో ఇక్బాల్‌ మినార్‌ కూడలి సమీపంలో కేబుల్‌ ఏర్పాటు కోసం సోమవారం రాత్రి చేపట్టిన తవ్వకాలతో తాగునీటి పైపులైన్‌ ధ్వంసమై నీరు వృథాగా పోతోంది. కేబుల్‌ పనుల కోసం ఎడాపెడా తవ్వకాలతో తాగునీటి పైపులైన్‌ దెబ్బతింది. రవీంద్రభారతి నుంచి సచివాలయం వెళ్లే దారిలో ఇక్బాల్‌ మినార్‌ కూడలి సమీపంలో కేబుల్‌ ఏర్పాటు కోసం సోమవారం రాత్రి చేపట్టిన తవ్వకాలతో తాగునీటి పైపులైన్‌ ధ్వంసమై నీరు వృథాగా పోతోంది.
10/15
ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ నుంచి లక్డీకాపూల్‌ వెళ్లే దారిలో మంగళవారం ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. ఇంతటి రద్దీలోనూ ఓ ద్విచక్ర వాహనదారుడు ఓ భారీ కిటికీ ఫ్రేముతో వాహనాలను తప్పించుకుంటూ తిప్పలు పడుతూ వెళ్లడం కనిపించింది ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ నుంచి లక్డీకాపూల్‌ వెళ్లే దారిలో మంగళవారం ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. ఇంతటి రద్దీలోనూ ఓ ద్విచక్ర వాహనదారుడు ఓ భారీ కిటికీ ఫ్రేముతో వాహనాలను తప్పించుకుంటూ తిప్పలు పడుతూ వెళ్లడం కనిపించింది
11/15
బయోడైవర్సిటీ వంతెనపై  ద్విచక్ర వాహనంపై అధిక బరువుతో ప్రమాదకరంగా సామగ్రిని తరలిస్తున్న వ్యాపారి,  రాయదుర్గం టీ హబ్‌ వద్ద లోడు వెళ్తోన్న మినీ డీసీఎం వెనక భాగంలో అంచున నిలిచి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న కార్మికులు బయోడైవర్సిటీ వంతెనపై ద్విచక్ర వాహనంపై అధిక బరువుతో ప్రమాదకరంగా సామగ్రిని తరలిస్తున్న వ్యాపారి, రాయదుర్గం టీ హబ్‌ వద్ద లోడు వెళ్తోన్న మినీ డీసీఎం వెనక భాగంలో అంచున నిలిచి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న కార్మికులు
12/15
సముద్రం నుంచి చైనా బెలూన్‌ శకలాలను వెలికితీస్తున్న అమెరికా నౌకాదళ సభ్యులు సముద్రం నుంచి చైనా బెలూన్‌ శకలాలను వెలికితీస్తున్న అమెరికా నౌకాదళ సభ్యులు
13/15
జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న పూజారులు జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న పూజారులు
14/15
తుర్కియేలోని హతాయ్‌లో నేలమట్టమైన భవనాలు తుర్కియేలోని హతాయ్‌లో నేలమట్టమైన భవనాలు
15/15
సిరియాలోని లటకియాలో శిథిల భవనాల నుంచి మృతదేహాన్ని తరలిస్తున్న సహాయక సిబ్బంది సిరియాలోని లటకియాలో శిథిల భవనాల నుంచి మృతదేహాన్ని తరలిస్తున్న సహాయక సిబ్బంది

మరిన్ని