News in Pics: చిత్రం చెప్పే సంగతులు-01(09-02-2023)

Updated : 09 Feb 2023 03:56 IST
1/15
అమరావతి జిల్లా, తాడేపల్లిలోని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నివాసానికి వేళ్లే మార్గంలో జాతీయరహదారి నుంచి  తాడేపల్లి చేరే అండర్‌పాస్‌ వద్ద డ్రైనేజీ పరిస్థితి ఇది. గత కొన్ని రోజులుగా మురుగు ప్రవహించక చెత్త పేరుకుపోవడంతో పచ్చగా మారి దుర్వాసన వస్తోంది. సీఎంతో పాటు, ఇతర  ప్రముఖులంతా నిత్యం రాకపోకలు సాగించే రహదారిలోనే ఈ పరిస్థితి ఉంది.   

2/15
  శ్రీకాకుళం జిల్లా, మందసలోని  శ్రీవాసుదేవస్వామి ఆలయంలో శుక్రవారం  నుంచి బ్రహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల పది నుంచి 17వ తేదీ వరకు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని మందస సంస్థాన రాజపుత్ర వంశీయుల్లో ఒకరైన లక్ష్మణ రాజమణి రాజ్‌దేవ్‌ 1744లో పునఃప్రతిష్ఠించినట్లుగా ఇక్కడి శిలాశాసనాలపై ఉంది.

3/15
   విశాఖ సాగరతీరంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం ఉదయం కొంతసేపు నడిచారు. ఆ సమయంలో తనను కలిసిన వారిని పలకరిస్తూ ముందుకు సాగారు.

4/15
  కాంక్రీట్‌ జంగిల్‌లో చెట్లు లేక సీతాకోక చిలుకలు కనుమరుగవుతున్నాయి. హైదరాబాద్‌లోని  కేపీహెచ్‌బీ కాలనీ ఫోర్త్‌ ఫేజ్‌లో ఏర్పాటు చేస్తున్న థీమ్‌పార్కులో ప్రత్యేకంగా సీతాకోకచిలుకల డిజైన్‌తో సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేశారు. దీనిపై అందమైన సీతాకోకచిలుకల పెయింటింగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.

5/15
   హైదరాబాద్‌లోని జేఎన్టీయూ మంజీరా మాల్‌ నుంచి కేపీహెచ్‌బీ కాలనీ టెంపుల్‌ బస్టాప్‌నకు వెళ్లే దారిలో చెట్టు కాండం, కొమ్మలకు పూర్తిగా చెదలు పట్టి ఓ వైపు వంగిపోయి ఉంది. ఎప్పుడు ఎవరి మీద పడుతుందో తెలియని పరిస్థితి. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ మంజీరా మాల్‌ నుంచి కేపీహెచ్‌బీ కాలనీ టెంపుల్‌ బస్టాప్‌నకు వెళ్లే దారిలో చెట్టు కాండం, కొమ్మలకు పూర్తిగా చెదలు పట్టి ఓ వైపు వంగిపోయి ఉంది. ఎప్పుడు ఎవరి మీద పడుతుందో తెలియని పరిస్థితి.
6/15
 హైదరాబాద్‌లోని  కేపీహెచ్‌బీ ట్రాఫిక్‌ ఠాణా ముందు జీబ్రా క్రాసింగ్‌పై స్టీరింగ్‌ ఆటోలు నిలుపుతుండటంతో పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. దాంతో పోలీసులు ఆటోవాలాలకు అవగాహన కల్పించి ఓ వైపు వరుసగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల వల్ల వాహనాలు సాఫీగా సాగుతున్నాయి.

7/15
  హైదరాబాద్‌లోని  ఆదిభట్లలో   టీసీఎస్‌ ప్రాంగణంలో బుధవారం జాగ్వర్‌ టీసీఎస్‌ ఫార్ములా- ఈ కారును ప్రదర్శించారు. ఆ కారుతో జాగ్వర్‌ టీసీఎస్‌ రేసర్‌ మిచ్‌ ఎవాన్స్, టీమ్‌ ప్రిన్సిపల్‌ జేమ్స్‌ బార్క్‌లే, మీడియా అండ్‌ టెక్నాలజీస్‌ బిజినెస్‌ గ్రూప్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ రాజన్న. 

8/15
  హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో బుధవారం ఈవీ-ఎక్స్‌పోను ప్రారంభించి  బైకుపై కూర్చుని పోజిచ్చిన మంత్రి కేటీఆర్‌. పక్కన.. వర్చువల్‌ డ్రైవింగ్‌ చేస్తున్న  ఓ యువతి

9/15
  హైదరాబాద్‌లోని మాదాపూర్‌ హైటెక్స్‌లో బుధవారం ఫార్ములా-ఈ రేస్‌ నిర్వాహకులు విచ్చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కళకారుల నృత్యాలను విదేశీ ప్రతినిధులు తమ చరవాణుల్లో బంధించి ఆనందించారు.

10/15
 హైదరాబాద్‌  నగరంలో కొత్తగా వచ్చిన ఓపెన్‌ టాప్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల ట్రయల్‌ రన్‌ బుధవారం నిర్వహించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ సమీపంలో ఛార్జింగ్‌ పాయింట్ల వద్ద వీటిని ఛార్జ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో కొత్తగా వచ్చిన ఓపెన్‌ టాప్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల ట్రయల్‌ రన్‌ బుధవారం నిర్వహించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ సమీపంలో ఛార్జింగ్‌ పాయింట్ల వద్ద వీటిని ఛార్జ్‌ చేస్తున్నారు.
11/15
 పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మోటారు మెకానిక్‌ మస్తాన్‌వలి సౌరశక్తితో నడిచే ద్విచక్రవాహనాన్ని తయారు చేశారు. చదువు రాకపోయినా.. మెకానిక్‌గా చేసిన అనుభవంతో వాహనాన్ని రూపొందించారు. ఇందుకు రూ.30 వేలతో బైక్‌ విడిభాగాలు, రూ.45 వేలతో బ్యాటరీని కొనుగోలు చేశారు. ముంద]ుగా బైక్‌ చేసి దానికి బ్యాటరీని అనుసంధానించి, నడిపించారు. 

12/15
లండన్‌లో ‘ట్రయల్‌ ఆఫ్‌ పిక్స్‌’ కార్యక్రమం కోసం పరిశీలించిన క్వీన్‌ ఎలిజబెత్‌-2, కింగ్‌ చార్లెస్‌-3 నాణేలు 

13/15
  దక్షిణ తుర్కియేలోని కహ్రామన్మారస్‌లో సోమవారం వచ్చిన భూకంపం కారణంగా నామరూపాల్లేకుండా ధ్వంసమైన భవనాలు 

14/15
 బిహార్‌ రాష్ట్రంలోని కైమూర్‌ జిల్లా రామ్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్‌ త్రిపుర రైఫిల్స్‌లో జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన 165 కిలోల బరువును పళ్లతో ఎత్తి రికార్డు సృష్టించారు. బిహార్‌ రాష్ట్రంలోని కైమూర్‌ జిల్లా రామ్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్‌ త్రిపుర రైఫిల్స్‌లో జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన 165 కిలోల బరువును పళ్లతో ఎత్తి రికార్డు సృష్టించారు.
15/15
  సిరియాలో శిథిలాల కింద తమ్ముడితో పాటు చిక్కుకున్న బాలిక. వీరిద్దరినీ సురక్షితంగా బయటకు తీశారు.ఈ చిత్రాన్ని ఐరాస ప్రతినిధి ట్విటర్‌లో పోస్టు చేశారు.

మరిన్ని