News in Pics: చిత్రం చెప్పే సంగతులు-1(14-03-2023)

Updated : 14 Mar 2023 09:43 IST
1/13
సృష్టిలో విభిన్న రంగుల్లో కనిపించే సీతాకోక చిలుకలు అంటే ఎంతో ఇష్టం. వీటిని ఫోటోలు తీసేందుకు ఆయా సీజన్లలో అరకులోయ, లంబసింగి, చింతపల్లి ప్రాంతాలతోపాటు జలపాతాలు, నదీతీర ప్రాంతాలకు వెళ్తుంటా, ఫొటోలో బంధించేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. కష్టంతో కూడిన పని అయినా. హాబీగా ముందుకు సాగుతున్నానని యశ్వంత్‌ పేర్కొన్నాడు. సృష్టిలో విభిన్న రంగుల్లో కనిపించే సీతాకోక చిలుకలు అంటే ఎంతో ఇష్టం. వీటిని ఫోటోలు తీసేందుకు ఆయా సీజన్లలో అరకులోయ, లంబసింగి, చింతపల్లి ప్రాంతాలతోపాటు జలపాతాలు, నదీతీర ప్రాంతాలకు వెళ్తుంటా, ఫొటోలో బంధించేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. కష్టంతో కూడిన పని అయినా. హాబీగా ముందుకు సాగుతున్నానని యశ్వంత్‌ పేర్కొన్నాడు.
2/13
సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో శ్రీభవాని మాత ఆలయ వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు, యువతుల అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో శ్రీభవాని మాత ఆలయ వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు, యువతుల అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు
3/13
ఖమ్మం నగరంలో పచ్చదనం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సర్దార్‌ పటేల్‌ స్టేడియం. ఇక్కడ విస్తరించిన పచ్చదనం ఆహ్లాదం పంచుతోంది. వేసవి రాగానే ఎండిపోయిన ఆకులు రాలడంతో భారీగా చెత్త పోగవుతోంది. ఇక్కడి సిబ్బందికి ఈ పరిణామం అదనపు భారంగా మారింది. అరకొర జీతభత్యాలతో కాలం వెళ్లబుచ్చుతున్న కిందిస్థాయి సిబ్బందిపై చారికీ పడుతోంది. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖమ్మం నగరంలో పచ్చదనం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సర్దార్‌ పటేల్‌ స్టేడియం. ఇక్కడ విస్తరించిన పచ్చదనం ఆహ్లాదం పంచుతోంది. వేసవి రాగానే ఎండిపోయిన ఆకులు రాలడంతో భారీగా చెత్త పోగవుతోంది. ఇక్కడి సిబ్బందికి ఈ పరిణామం అదనపు భారంగా మారింది. అరకొర జీతభత్యాలతో కాలం వెళ్లబుచ్చుతున్న కిందిస్థాయి సిబ్బందిపై చారికీ పడుతోంది. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
4/13
 ఈ చిత్రం చూస్తే ఇదేదో క్రోటాన్‌ మొక్క అనుకుంటారు. కానీ ఇది 40 ఏళ్లనాటి రావిచెట్టు. ఖమ్మంలోని గంగారం రామాలయం వద్ద ఉన్న ఈ చెట్టు కొమ్మలు విద్యుత్తు తీగలకు తాకుతుండటంతో వాటి నరికి వేశారు. దీంతో చూడటానికి క్రోటాన్‌ మొక్కను తలపించే విధంగా ఉన్న రావిచెట్టు

5/13
 పేద కుటుంబాలకు చెందిన వారంతా వీరిలా ఆలోచన చేస్తే, తక్కువ ఖర్చుతో మంచి ఇళ్లు కట్టుకోవచ్చని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చిన్నమట్టపల్లి సర్పంచి పిట్టా రామారావు అన్నారు.పేద కుటుంబాలకు చెందిన వారంతా వీరిలా ఆలోచన చేస్తే, తక్కువ ఖర్చుతో మంచి ఇళ్లు కట్టుకోవచ్చని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చిన్నమట్టపల్లి సర్పంచి పిట్టా రామారావు అన్నారు.
6/13
 గ్రామాల్లో ఆటో ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారుతోంది. సోమవారం సాయంత్రం  నల్గొండ జిల్లాలోని అడవిదేవులపల్లి మండలం కేంద్రం నుంచి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో మిరపకాయలు కోసేందుకు వెళ్లిన కూలీలు తిరుగు ప్రయాణమయ్యారు. ఆరుగురు మాత్రమే ప్రయాణం చేసే ఆటోలో 25 మంది ఎక్కారు. వెనుక, ముందు, పక్కన వేలాడుతూ, టాప్‌పైన కూర్చుని ఇలా 

7/13
 పైపుల మరమ్మతు కారణంగా 4 రోజులుగా తాగునీరు లేక హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి డివిజన్‌ పాపిరెడ్డినగర్‌లో దేవాలయం వద్ద ఉన్న వాటర్‌ ప్లాంట్‌కు డబ్బాలతో వచ్చి వరుసలో నిలబడ్డారు

పైపుల మరమ్మతు కారణంగా 4 రోజులుగా తాగునీరు లేక హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి డివిజన్‌ పాపిరెడ్డినగర్‌లో దేవాలయం వద్ద ఉన్న వాటర్‌ ప్లాంట్‌కు డబ్బాలతో వచ్చి వరుసలో నిలబడ్డారు
8/13
ఎండలు పెరుగుతున్న కొద్దీ.. నగరంలో ప్రయాణికుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల బస్‌షెల్టర్లు తొలగించగా.. అక్కడక్కడ ఉన్నవి కూడా నీడ నివ్వడం లేదు. సోమవారం హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌ బస్టాపులో పదుల సంఖ్యలో ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం నిరీక్షిస్తూ కనిపించారు.ఎండలు పెరుగుతున్న కొద్దీ.. నగరంలో ప్రయాణికుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల బస్‌షెల్టర్లు తొలగించగా.. అక్కడక్కడ ఉన్నవి కూడా నీడ నివ్వడం లేదు. సోమవారం హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌ బస్టాపులో పదుల సంఖ్యలో ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం నిరీక్షిస్తూ కనిపించారు.
9/13
రంగారెడ్డి జిల్లా చెవేళ్ల మండలం ఎన్కేపల్లిలో కోళ్ల ఫారంపై పెంచిన తీగల మొక్కలివి. ఎండ తీవ్రతకి కోళ్లు చనిపోకుండా ఫారం కప్పుపై తీగజాతి మొక్కలను పాకించడంతో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని చెబుతున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు. 

10/13
 తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసేందుకు రహదారుల వెంట ఏర్పాటు చేసిన డబ్బాలు కొందరి బాధ్యతారాహిత్యం వల్ల వృథా అవుతున్నాయి. హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌ బస్టాప్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చెత్త డబ్బాకు నిప్పు పెట్టడంతో దహనమైంది. 

11/13
 ఇప్పటికే హైదరాబాద్‌ నగరవాసులు వీధి శునకాలతో బెంబేలెత్తుతుండగా ఇప్పుడు వాటికి కోతులు తోడయ్యాయి. దోమల్‌గూడ రోడ్డు గగన్‌మహల్‌ కాలనీలో నిత్యం గుంపుగా వచ్చి జనాలను భయపెట్టిస్తున్నాయి. చేతిలో తినే వస్తువులు ఉంటే వెంటాడుతున్నాయి. 

12/13
థాయిలాండ్‌లోని పట్టాయాలో సోమవారం జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక విందును ఆరగిస్తున్న గజరాజులు  

థాయిలాండ్‌లోని పట్టాయాలో సోమవారం జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక విందును ఆరగిస్తున్న గజరాజులు
13/13
  గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా చలాలా గ్రామంలో రెండు ఎద్దులు హల్‌ చల్‌ చేశాయి. ఏకంగా వివాహం జరిగే కల్యాణ మండపంలోకి వచ్చి పొట్లాడుకున్నాయి. ఈ ఘర్షణతో మండపంలోని నూతన వధూవరులతో పాటు అతిథులందరూ కంగుతిన్నారు. సుమారు 30 నిమిషాలపాటు బసవన్నలు కొట్లాడుకున్నాయి. దీంతో అరగంట సేపు పెళ్లి క్రతువు ఆగిపోయింది. 

మరిన్ని