News in Pics: చిత్రం చెప్పే సంగతులు-1(15-03-2023)

Updated : 15 Mar 2023 12:29 IST
1/15
శ్రీకాకుళం జిల్లాలోని బాతుపురం సమీపంలో రైతు టి.అప్పలస్వామికి చెందిన తోటలో పనస చెట్టు విరగ కాసింది. చెట్టు మొదలు నుంచి కాండంపై భాగం వరకు దాదాపు 80 కాయలు గుత్తులుగా కనిపిస్తున్నాయి. దీంతో అటు వైపు నుంచి వెళ్లేవారు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని బాతుపురం సమీపంలో రైతు టి.అప్పలస్వామికి చెందిన తోటలో పనస చెట్టు విరగ కాసింది. చెట్టు మొదలు నుంచి కాండంపై భాగం వరకు దాదాపు 80 కాయలు గుత్తులుగా కనిపిస్తున్నాయి. దీంతో అటు వైపు నుంచి వెళ్లేవారు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు.
2/15
నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రం నుంచి పోలేపల్లికి వెళ్లే మార్గంలో పంటపొలాల్లో ఓ చింతచెట్టు చూపరులను ఆకట్టుకుంటుంది. చెట్టు సగభాగం చిగురించిన ఆకులతో పచ్చదనం నింపుకొంది. మరో సగభాగం మోడువారి సృజనాత్మక చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన చిత్రంలా కనిపిస్తున్న దృశ్యమిది. నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రం నుంచి పోలేపల్లికి వెళ్లే మార్గంలో పంటపొలాల్లో ఓ చింతచెట్టు చూపరులను ఆకట్టుకుంటుంది. చెట్టు సగభాగం చిగురించిన ఆకులతో పచ్చదనం నింపుకొంది. మరో సగభాగం మోడువారి సృజనాత్మక చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన చిత్రంలా కనిపిస్తున్న దృశ్యమిది.
3/15
చిత్రంలో అక్కడక్కడా మచ్చల్లా కనిపిస్తున్నవి ఏమిటో తెలుసా? ఇసుక దిబ్బలు. అయితే ఇవి అంగారక గ్రహం మీదవి. నాసాకు చెందిన మార్స్‌ రికానిసెన్స్‌ ఆర్బిటర్‌ పంపిన చిత్రమిది. చిత్రంలో అక్కడక్కడా మచ్చల్లా కనిపిస్తున్నవి ఏమిటో తెలుసా? ఇసుక దిబ్బలు. అయితే ఇవి అంగారక గ్రహం మీదవి. నాసాకు చెందిన మార్స్‌ రికానిసెన్స్‌ ఆర్బిటర్‌ పంపిన చిత్రమిది.
4/15
నాంపల్లిలోని సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయ వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నాంపల్లిలోని సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయ వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
5/15
బేగంపేట-అమీర్‌పేట రోడ్డులో రిటైల్‌ వ్యాపారులు ట్రాలీ ఆటోల్లో ఉల్లిగడ్డలు విక్రయిస్తున్న చిత్రమిది. సాధారణంగా వినియోగదారుల కళ్ల వెంట నీరు తెప్పించే ఉల్లి ఈసారి రైతుల కంట నీరు తెప్పిస్తోంది. నగరంలో రూ.15-20 పలుకుతుండగా తమకు మాత్రం రూ.2-4 మాత్రమే దక్కుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బేగంపేట-అమీర్‌పేట రోడ్డులో రిటైల్‌ వ్యాపారులు ట్రాలీ ఆటోల్లో ఉల్లిగడ్డలు విక్రయిస్తున్న చిత్రమిది. సాధారణంగా వినియోగదారుల కళ్ల వెంట నీరు తెప్పించే ఉల్లి ఈసారి రైతుల కంట నీరు తెప్పిస్తోంది. నగరంలో రూ.15-20 పలుకుతుండగా తమకు మాత్రం రూ.2-4 మాత్రమే దక్కుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
6/15
వివేకానందనగర్‌కాలనీలో సినీ నటి రీతువర్మ సందడి చేశారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెను తిలకించేందుకు భారీగా తరలివచ్చారు. వివేకానందనగర్‌కాలనీలో సినీ నటి రీతువర్మ సందడి చేశారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెను తిలకించేందుకు భారీగా తరలివచ్చారు.
7/15
రోజురోజుకీ ముదురుతున్న ఎండలకు దాహంతో అలమటించి పోతున్న ఓ శునకం ప్లాస్టిక్‌ డబ్బాలో ఉన్న నీరు తాగేందుకు తలదూర్చడంతో ఇలా డబ్బాలో ఇరుక్కుపోయింది. దీంతో రహదారులపై వాహనాల మధ్య ప్రాణభయంతో పరుగులు పెడుతూ ఎర్రమంజిల్‌-బంజారాహిల్స్‌ రోడ్డుపై కనిపించింది. రెండు రోజులుగా డబ్బాను తొలగించేందుకు కుక్కను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని, దగ్గరకు వచ్చేలోపే పరుగుపెడుతోందని స్థానికులు తెలిపారు. మున్సిపల్‌ సిబ్బంది పట్టుకుని డబ్బాను తొలగించి కుక్కకు స్టెరిలైజేషన్‌ చేసి వదిలిపెట్టాలని వారు కోరుతున్నారు. రోజురోజుకీ ముదురుతున్న ఎండలకు దాహంతో అలమటించి పోతున్న ఓ శునకం ప్లాస్టిక్‌ డబ్బాలో ఉన్న నీరు తాగేందుకు తలదూర్చడంతో ఇలా డబ్బాలో ఇరుక్కుపోయింది. దీంతో రహదారులపై వాహనాల మధ్య ప్రాణభయంతో పరుగులు పెడుతూ ఎర్రమంజిల్‌-బంజారాహిల్స్‌ రోడ్డుపై కనిపించింది. రెండు రోజులుగా డబ్బాను తొలగించేందుకు కుక్కను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని, దగ్గరకు వచ్చేలోపే పరుగుపెడుతోందని స్థానికులు తెలిపారు. మున్సిపల్‌ సిబ్బంది పట్టుకుని డబ్బాను తొలగించి కుక్కకు స్టెరిలైజేషన్‌ చేసి వదిలిపెట్టాలని వారు కోరుతున్నారు.
8/15
 ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ కృషి చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా తన గళాన్ని వినిపిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో హంద్రీనీవాకు నీటి సరఫరా నిలిచిపోయిన సమయంలో రైతుల తరఫున పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. హెచ్చెల్సీ నుంచి హంద్రీనీవాలోకి తరలించేందుకు మోటార్లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి హంద్రీనీవాకు నీటిని విడుదల చేసింది. వైకాపా సర్కారు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేకపోవడంతో ప్రగతిపై ప్రభావం చూపుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ కృషి చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా తన గళాన్ని వినిపిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో హంద్రీనీవాకు నీటి సరఫరా నిలిచిపోయిన సమయంలో రైతుల తరఫున పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. హెచ్చెల్సీ నుంచి హంద్రీనీవాలోకి తరలించేందుకు మోటార్లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి హంద్రీనీవాకు నీటిని విడుదల చేసింది. వైకాపా సర్కారు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేకపోవడంతో ప్రగతిపై ప్రభావం చూపుతోంది.
9/15
వివేకానందనగర్‌కాలనీ జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంలో మంగళవారం రూపదర్శినులు సందడి చేశారు. వివేకానందనగర్‌కాలనీ జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంలో మంగళవారం రూపదర్శినులు సందడి చేశారు.
10/15
వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో తాటి చెట్లు ఎక్కి కోతులు కల్లు తాగుతున్నాయి. కల్లు లొట్టిలు ఖాళీ చేస్తున్నాయి. దీంతో కల్లు గీత కార్మికులు కొత్త ఉపాయం ఆలోచించారు. లొట్టిల చుట్టూ రక్షణగా వల, మరో చోట అవి చెట్టు ఎక్కకుండా ముళ్ల కంప ఏర్పాటు చేసుకున్నారు. దీంతో  ఇటు వైపు రావడం లేదని శ్రీనివాస్‌ అనే గీత కార్మికుడు తెలిపారు. 
వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో తాటి చెట్లు ఎక్కి కోతులు కల్లు తాగుతున్నాయి. కల్లు లొట్టిలు ఖాళీ చేస్తున్నాయి. దీంతో కల్లు గీత కార్మికులు కొత్త ఉపాయం ఆలోచించారు. లొట్టిల చుట్టూ రక్షణగా వల, మరో చోట అవి చెట్టు ఎక్కకుండా ముళ్ల కంప ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఇటు వైపు రావడం లేదని శ్రీనివాస్‌ అనే గీత కార్మికుడు తెలిపారు.
11/15
ఈ పక్షుల దృశ్యాలు చూస్తే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని నాటు.. నాటు.. పాటకు కథానాయకులు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ స్టెప్పులేసినట్లు ఉంది కదూ..! ఆస్కార్‌ అవార్డుతో విశ్వవ్యాప్తమైన పాట గురించి ప్రస్తుతం గల్లీ నుంచి దిల్లీ వరకు చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా.. విన్నా.. నాటు.. నాటే మార్మోగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దు ప్రాంతం మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా పెన్‌గంగా పరివాహాక ప్రాంతాల్లో వివిధ రకాల పక్షులు నాటు.. నాటు.. పాటకు స్టెప్పులేస్తున్నట్లు కనిపించగా.. ఆ దృశ్యాలను వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ లింగపల్లి కృష్ట తన కెమెరాలో బంధించారు. ఈ పక్షుల దృశ్యాలు చూస్తే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని నాటు.. నాటు.. పాటకు కథానాయకులు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ స్టెప్పులేసినట్లు ఉంది కదూ..! ఆస్కార్‌ అవార్డుతో విశ్వవ్యాప్తమైన పాట గురించి ప్రస్తుతం గల్లీ నుంచి దిల్లీ వరకు చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా.. విన్నా.. నాటు.. నాటే మార్మోగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దు ప్రాంతం మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా పెన్‌గంగా పరివాహాక ప్రాంతాల్లో వివిధ రకాల పక్షులు నాటు.. నాటు.. పాటకు స్టెప్పులేస్తున్నట్లు కనిపించగా.. ఆ దృశ్యాలను వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ లింగపల్లి కృష్ట తన కెమెరాలో బంధించారు.
12/15
కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన దానిమ్మ తోటను కాపాడుకునేందుకు వినూత్న ఆలోచన చేశారు ఓ రైతు. పొదిలి మండలం కుంచేపల్లి పంచాయతీ పరిధి దాసర్లపల్లి గ్రామంలో పేరం శ్రీను అనే రైతు ఆరు ఎకరాల్లో దానిమ్మ సాగు చేపట్టారు. వాతావరణం అనుకూలించి పంట ఆశాజనకంగా ఉంది. అయితే గత అనుభవాల రీత్యా చీడపీడలు ఆశించి పంట చేతికందుతుందో లేదో అన్న ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పూత, కాయ దశలో ఉంది. క్రిమికీటకాలు కాయను తొలిచేస్తున్నాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు దోమతెర మాదిరి ఏర్పాట్లు చేశారు. చాలావరకు కీటకాల బెడద తప్పిందని ఆయన తెలిపారు. కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన దానిమ్మ తోటను కాపాడుకునేందుకు వినూత్న ఆలోచన చేశారు ఓ రైతు. పొదిలి మండలం కుంచేపల్లి పంచాయతీ పరిధి దాసర్లపల్లి గ్రామంలో పేరం శ్రీను అనే రైతు ఆరు ఎకరాల్లో దానిమ్మ సాగు చేపట్టారు. వాతావరణం అనుకూలించి పంట ఆశాజనకంగా ఉంది. అయితే గత అనుభవాల రీత్యా చీడపీడలు ఆశించి పంట చేతికందుతుందో లేదో అన్న ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పూత, కాయ దశలో ఉంది. క్రిమికీటకాలు కాయను తొలిచేస్తున్నాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు దోమతెర మాదిరి ఏర్పాట్లు చేశారు. చాలావరకు కీటకాల బెడద తప్పిందని ఆయన తెలిపారు.
13/15
ఎమ్మిగనూరు మండలం మాసుమానుదొడ్డికి చెందిన రైతు శివన్న తన ఆరెకరాల్లో రూ.9 లక్షల పెట్టుబడి పెట్టి బొప్పాయి పంటను సాగుచేశారు. దిగుబడి పెరిగినా ఎండ తీవ్రతకు కాయలు రాలిపోతుండటంతో రూ.లక్ష ఖర్చుచేసి బొప్పాయి కాయలకు చీరలతో రక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మిగనూరు-బనవాసి మధ్యలో చీరకట్టిన ఈ బొప్పాయి తోట చూపరులను ఆకట్టుకుంటోంది. ఎమ్మిగనూరు మండలం మాసుమానుదొడ్డికి చెందిన రైతు శివన్న తన ఆరెకరాల్లో రూ.9 లక్షల పెట్టుబడి పెట్టి బొప్పాయి పంటను సాగుచేశారు. దిగుబడి పెరిగినా ఎండ తీవ్రతకు కాయలు రాలిపోతుండటంతో రూ.లక్ష ఖర్చుచేసి బొప్పాయి కాయలకు చీరలతో రక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మిగనూరు-బనవాసి మధ్యలో చీరకట్టిన ఈ బొప్పాయి తోట చూపరులను ఆకట్టుకుంటోంది.
14/15
రాజవొమ్మంగి పంచాయతీ అప్పలరాజుపేటలో మంగళవారం సూర్యాస్తమయ సమయంలో భానుడు వీధి దీపంలా వెలుగుతున్నట్లు కనిపించాడు. పొలం పనులు ముగించుకుని ఇంటి బాట పట్టిన కర్షకులు, ప్రకృతి ప్రేమికులు ఈ దృశ్యాన్ని తమ చరవాణుల్లో బంధించారు. రాజవొమ్మంగి పంచాయతీ అప్పలరాజుపేటలో మంగళవారం సూర్యాస్తమయ సమయంలో భానుడు వీధి దీపంలా వెలుగుతున్నట్లు కనిపించాడు. పొలం పనులు ముగించుకుని ఇంటి బాట పట్టిన కర్షకులు, ప్రకృతి ప్రేమికులు ఈ దృశ్యాన్ని తమ చరవాణుల్లో బంధించారు.
15/15
రాజవొమ్మంగిలో గృహిణి కె.అనూరాధ చేతిపై మంగళవారం ఒక సీతాకోకచిలుక వాలింది. లేత పచ్చ రంగులో చిన్నటి రెక్కలు, వాటి చివరన కత్తిరించినట్లుగా ఉండటంతో పలువురు ఆసక్తిగా తిలకరించారు. రాజవొమ్మంగిలో గృహిణి కె.అనూరాధ చేతిపై మంగళవారం ఒక సీతాకోకచిలుక వాలింది. లేత పచ్చ రంగులో చిన్నటి రెక్కలు, వాటి చివరన కత్తిరించినట్లుగా ఉండటంతో పలువురు ఆసక్తిగా తిలకరించారు.

మరిన్ని