News in Pics: చిత్రం చెప్పే సంగతులు-2(15-03-2023)

Updated : 15 Mar 2023 20:22 IST
1/23
నెల్లూరులోని నారాయణ మెడికల్‌ కళాశాలలో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాలందుకున్న విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో ఫొటోలు తీసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. నెల్లూరులోని నారాయణ మెడికల్‌ కళాశాలలో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాలందుకున్న విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో ఫొటోలు తీసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.
2/23
తుర్కియేలోని సన్లిఉర్ఫాలో భారీవర్షాలతో వరదలు ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా సుమారు 10మంది మృతి చెందినట్లు, వేల మంది నిరాశ్రయులుగా మారినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు వరద బాధితులను కాపాడేందుకు సహాయక దళాలు రంగంలోకి దిగాయి. తుర్కియేలోని సన్లిఉర్ఫాలో భారీవర్షాలతో వరదలు ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా సుమారు 10మంది మృతి చెందినట్లు, వేల మంది నిరాశ్రయులుగా మారినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు వరద బాధితులను కాపాడేందుకు సహాయక దళాలు రంగంలోకి దిగాయి.
3/23
విజయ్‌ ఆంటోని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బిచ్చగాడు 2’. ఇటీవల విడుదలైన ‘స్నీక్‌ పీక్‌ ట్రైలర్‌’ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్విటర్‌ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టింది. ‘విజయ్ ఆంటోనీ కనిపెట్టిన ఆ బికిలి ఎవరు.? 👺 గురువారం ఆయనే  చూపిస్తారు’ అని తెలిపింది. విజయ్‌ ఆంటోని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బిచ్చగాడు 2’. ఇటీవల విడుదలైన ‘స్నీక్‌ పీక్‌ ట్రైలర్‌’ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్విటర్‌ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టింది. ‘విజయ్ ఆంటోనీ కనిపెట్టిన ఆ బికిలి ఎవరు.? 👺 గురువారం ఆయనే చూపిస్తారు’ అని తెలిపింది.
4/23
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కాశీ పట్నం సంతకు చింతపండును పెద్దఎత్తున తీసుకువచ్చారు. సుమారు 20గ్రామాలకు చెందిన గిరిజనులు చింతపండు ఇక్కడికి తెచ్చి అమ్ముతుంటారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రతి బుధవారం ఇక్కడ అమ్మకాలు సాగుతుంటాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కాశీ పట్నం సంతకు చింతపండును పెద్దఎత్తున తీసుకువచ్చారు. సుమారు 20గ్రామాలకు చెందిన గిరిజనులు చింతపండు ఇక్కడికి తెచ్చి అమ్ముతుంటారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రతి బుధవారం ఇక్కడ అమ్మకాలు సాగుతుంటాయి.
5/23
నిజామాబాద్‌లో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‘శ్రీ అర్గుల్‌ రాజారాం మెమోరియల్‌’ ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌కు హాజరైన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సరదాగా కాసేపు ఆట ఆడి సందడి చేశారు. నిజామాబాద్‌లో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‘శ్రీ అర్గుల్‌ రాజారాం మెమోరియల్‌’ ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌కు హాజరైన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సరదాగా కాసేపు ఆట ఆడి సందడి చేశారు.
6/23
హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద ఓ మయూరం ఆహారం తింటూ, రోడ్డు పక్కన చక్కర్లు కొడుతూ కనిపించింది. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద ఓ మయూరం ఆహారం తింటూ, రోడ్డు పక్కన చక్కర్లు కొడుతూ కనిపించింది.
7/23
నాగచైతన్య, కృతిశెట్టి జంటగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 16న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. నాగచైతన్య, కృతిశెట్టి జంటగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 16న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
8/23
సినీ నటీమణులు నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌ నలుపు రంగు దుస్తుల్లో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో  పంచుకున్నారు. ఈ ఫొటోలకు అభిమానులు  ముగ్ధులవుతున్నారు. వీరిద్దరు రామ్‌తో కలిసి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సినీ నటీమణులు నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌ నలుపు రంగు దుస్తుల్లో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ఫొటోలకు అభిమానులు ముగ్ధులవుతున్నారు. వీరిద్దరు రామ్‌తో కలిసి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
9/23
పంజా వైష్ణవ్‌తేజ్‌ హీరోగా శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పీవీటీ 04’(వర్కింగ్‌ టైటిల్‌).  ఈసినిమాలో ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్‌.. ‘చెంగారెడ్డి’ అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను పంచుకుంది. పంజా వైష్ణవ్‌తేజ్‌ హీరోగా శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పీవీటీ 04’(వర్కింగ్‌ టైటిల్‌). ఈసినిమాలో ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్‌.. ‘చెంగారెడ్డి’ అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను పంచుకుంది.
10/23
లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. ఈ సినిమా షూటింగ్‌లో కంగన, లారెన్స్‌ ఇలా మెరిశారు. లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. ఈ సినిమా షూటింగ్‌లో కంగన, లారెన్స్‌ ఇలా మెరిశారు.
11/23
లాస్‌ ఏంజెలెస్‌లోని రీజెన్సీ విలేజ్‌ థియేటర్‌లో ‘షజామ్‌.. ఫ్యూరీ ఆఫ్‌ ది గాడ్స్’ సినిమా ప్రీమియర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సినిమా నటి రాచెల్‌ జగ్లర్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. లాస్‌ ఏంజెలెస్‌లోని రీజెన్సీ విలేజ్‌ థియేటర్‌లో ‘షజామ్‌.. ఫ్యూరీ ఆఫ్‌ ది గాడ్స్’ సినిమా ప్రీమియర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సినిమా నటి రాచెల్‌ జగ్లర్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
12/23
భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 17న తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు ముంబయిలోని మైదానంలో సాధన చేస్తూ కనిపించారు. భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 17న తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు ముంబయిలోని మైదానంలో సాధన చేస్తూ కనిపించారు.
13/23
14/23
ఉపాసన ట్విటర్‌ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. తనకు లభించిన అన్నింటికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛమైన హృదయంతో ఆశయ సాధనకు కృషి చేస్తే విజయం తప్పక వరిస్తుందని ఆమె చెప్పారు. రామ్‌చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను ఉపాసన పంచుకున్నారు. ఉపాసన ట్విటర్‌ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. తనకు లభించిన అన్నింటికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛమైన హృదయంతో ఆశయ సాధనకు కృషి చేస్తే విజయం తప్పక వరిస్తుందని ఆమె చెప్పారు. రామ్‌చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను ఉపాసన పంచుకున్నారు.
15/23
గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలకు సినీనటుడు బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా అలనాటి నటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డికి ‘ఎన్టీఆర్‌’ పేరిట అవార్డులను అందజేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలకు సినీనటుడు బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా అలనాటి నటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డికి ‘ఎన్టీఆర్‌’ పేరిట అవార్డులను అందజేశారు.
16/23
17/23
విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దాస్‌ కా దమ్కీ’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 17న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌ హాజరవుతున్నట్లు ప్రకటించింది. విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దాస్‌ కా దమ్కీ’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 17న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌ హాజరవుతున్నట్లు ప్రకటించింది.
18/23
రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ సినిమాలో జిష్షూసేన్ గుప్తా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకుంది. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ సినిమాలో జిష్షూసేన్ గుప్తా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకుంది.
19/23
సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసింది. సమంత, దేవ్‌మోహన్‌, గుణశేఖర్‌ తదితరులు పూజల్లో పాల్గొన్నారు. సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసింది. సమంత, దేవ్‌మోహన్‌, గుణశేఖర్‌ తదితరులు పూజల్లో పాల్గొన్నారు.
20/23
21/23
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ నాలుగో తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల ప్రారంభం సందర్భంగా నెల్లూరులోని ఓ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులతో ఇలా సందడి వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ నాలుగో తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల ప్రారంభం సందర్భంగా నెల్లూరులోని ఓ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులతో ఇలా సందడి వాతావరణం నెలకొంది.
22/23
హనుమకొండలో దివ్యాంగుడైన విద్యార్థిని పరీక్ష కేంద్రానికి తీసుకువస్తున్న సహాయకుడు హనుమకొండలో దివ్యాంగుడైన విద్యార్థిని పరీక్ష కేంద్రానికి తీసుకువస్తున్న సహాయకుడు
23/23
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ నగల దుకాణాన్ని ప్రముఖ టీవీ వ్యాఖ్యాత సుమ కనకాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె నూతన డిజైన్ల ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ నగల దుకాణాన్ని ప్రముఖ టీవీ వ్యాఖ్యాత సుమ కనకాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె నూతన డిజైన్ల ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

మరిన్ని