News in Pics: చిత్రం చెప్పే సంగతులు-1(16-03-2023)

Updated : 16 Mar 2023 09:32 IST
1/13
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని గాజులకొల్లివలస సంగమేశ్వర స్వామి కొండ వద్ద బుధవారం సైకత శిల్పి గేదెల హరికృష్ణ వేసిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నాటు నాటు పాటకు, భారతీయ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని గాజులకొల్లివలస సంగమేశ్వర స్వామి కొండ వద్ద బుధవారం సైకత శిల్పి గేదెల హరికృష్ణ వేసిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నాటు నాటు పాటకు, భారతీయ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ "ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌"కు ఆస్కార్‌ అవార్డులు వచ్చిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలుపుతూ ఈ శిల్పాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.
2/13
 సాధారణంగా కోతిని చూడగానే కుక్కలు అరుస్తుంటాయి. అల్లూరి సీతారామరాజు  జిల్లాలోని రాజవొమ్మంగిలో బుధవారం వింత సన్నివేశం చోటుచేసుకుంది. చిన్న కుక్కపిల్లను కోతి తనతో పాటు తీసుకెళ్లిపోయింది. విడిపిద్దామని స్థానికులు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కుక్కపిల్లతో పాటు కోతి అడవిలోకి పారిపోయిన దృశ్యాన్ని పలువురు చరవాణుల్లో బంధించారు. 

3/13
  అల్లూరి సీతారామరాజు  జిల్లాలోని జి.మాడుగుల పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు ఆకులన్నీ మార్చి మొదటి వారంలో  రాలిపోయాయి. అంతలోనే కొమ్మలన్నీ పచ్చదనంతో నిండాయి. ప్రస్తుతం చెట్టు నాలుగు వైపులా పచ్చని ఆకులతో ఆకట్టుకుంటోంది. ఈనెల ఆరో తేదీన ఆకులు రాల్చిన, 15న పచ్చగా కళకళలాడుతున్న చిత్రాలను మీరూ చూడండి.

4/13
  ఇంటర్‌మీడియట్‌ పరీక్షలు బుధవారం ఆరంభమయ్యాయి. విశాఖపట్నం నగరంలోని పలు కేంద్రాల వద్దకు విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా తరలివచ్చారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే వరకూ దగ్గరుండి పలు సూచనలు చేశారు. బీవీకే కళాశాల వద్ద పరిస్థితిని చిత్రంలో చూడొచ్చు.

5/13
   జి-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో   విశాఖపట్నంలోని ఆర్కేబీచ్‌ రోడ్డులో చేపట్టిన సుందరీకరణ పనులు ఊపందుకున్నాయి. రహదారికి ఆనుకొని ఉన్న గార్డెన్‌లో పచ్చని పచ్చిక, మొక్కలను నాటి అందంగా తీర్చిదిద్దుతున్నారు. 

6/13
 తల్లిదండ్రుల ఆంక్షలు..పోలీసుల హెచ్చరికలు.. ఇవేమీ పట్టించుకోరు వారు. ద్విచక్రవాహనం అందుబాటులో ఉంటే చాలు, ఎంతమందైనా ఎక్కేస్తారు. బుధవారం  విశాఖపట్నంలోని  గొలుగొండలో ఇలా ప్రయాణించారు.

7/13
   అనకాపల్లిలోని చీడికాడ ప్రాథమిక పాఠశాల సమీపంలో చెరువు క్రికెట్‌ మైదానాన్ని తలపిస్తోంది. చెరువులో నీటిపై నాచు తేలింది. నీరు ఏమాత్రం కనిపించలేదు. క్రికెట్‌ మైదానంలా మారిన చెరువును పలువురు     ఆసక్తిగా చూస్తున్నారు.

8/13
   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రేగళ్లలోని అటవీ ప్రాంతంలో  తాగునీటి కోసం గొత్తికోయలు పడుతున్న కష్టాలకు నిదర్శనం ఈ చిత్రం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రేగళ్లలోని అటవీ ప్రాంతంలో తాగునీటి కోసం గొత్తికోయలు పడుతున్న కష్టాలకు నిదర్శనం ఈ చిత్రం.
9/13
 
రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని వివిధ గ్రామాల్లో పశువుల దాహం తీర్చడానికి లక్షలాది రూపాయలతో నిర్మించిన తొట్లు నీరులేక వృథాగా పడి ఉన్నాయి.   వేసవి కాలం సమీపిస్తుండటంతో ఎండలు ముదురుతున్నాయి.  పశువులు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఆయా గ్రామాల సర్పంచులు చొరవ చూపి తొట్లల్లో నీటిని నింపాలని రైతులు కోరుతున్నారు.   ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో ఇవి ఉన్నాయి. 

10/13
 వేసవికి ముందే కొన్నిప్రాంతాల్లో తాగునీటి కొరత వేధిస్తుండగా హైదరాబాద్‌లోని శామీర్‌పేట పెద్దమ్మకాలనీలో లీకేజీతో ఇలా వృథా అవుతోంది.

11/13
  ఒకచోట తవ్విన రహదారులు.. మరోచోట రోడ్లపై పారుతున్న మురుగు..  ఇంకో కేంద్రం వద్ద ఇరుకైన మార్గాలు.. అందులోనూ అడ్డదిడ్డంగా వాహనాలు.. వెరసి  హైదరాబాద్‌ నగరంలో పలు ఇంటర్‌ పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారు. రాయదుర్గంలోని మధురానగర్‌లో ఓ కేంద్రం వద్ద కనిపించిన ఇబ్బందులు ఇవి.

12/13
 తమిళనాడులోని సేలంలో ఉన్న మోహన్‌ కుమార మంగళం ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు నెలల క్రితం ఓ వ్యక్తి గుండెపోటు కారణంగా చికిత్స కోసం చేరారు. ఆయన పెంపుడు శునకం కూడా అక్కడికి వచ్చింది. రోగి చికిత్స పొందుతూ మృతి చెందారు.కానీ, ఆయన అక్కడే ఉన్నారని భావించి మూడు నెలలుగా పెంపుడు శునకం నిరీక్షిస్తున్న ఘటన చూపరులను కంటతడి పెట్టిస్తోంది.

13/13
  ఈ నక్షత్ర సముదాయం మధ్యలో అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తున్న తార పేరు వూల్ఫ్‌-రాయెట్‌ 124. నిజానికి ఈ నక్షత్రం మరణం అంచున ఉంది. ఇక చుట్టుపక్కల అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తున్న నీహారిక.. నక్షత్రంలో చోటుచేసుకున్న అల్లకల్లోలం కారణంగా దాని నుంచి బయట పడిన పదార్థాలు, ధూళితో ఏర్పడింది. నాసాకు చెందిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌  టెలిస్కోప్‌ గతేడాది జూన్‌లో నక్షత్రంలో చోటుచేసుకున్న ఈ అద్భుత దశను బంధించింది. తాజాగా నాసా ఈ చిత్రాన్ని విడుదలచేసింది.  

మరిన్ని