News in Pics: చిత్రం చెప్పే సంగతులు(17-03-2023)

Updated : 17 Mar 2023 12:56 IST
1/13
మామిడి చెట్టు ఎదిగి పండ్లు చేతికందడానికి కనీసం ఐదేళ్లు పడుతుంది. కానీ సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం తొగర్‌పల్లిలోని ఓ నర్సరీలో విద్యార్థి ప్రత్యేకంగా అంటుకట్టు విధానంలో కొన్నిరకాల మామిడి మొక్కలను పెంచారు. ఆ మొక్కలు సాధారణ చెట్ల కంటే పొడవు తక్కువగా ఉన్నప్పటికీ రెండేళ్లలో కాయలు కాస్తున్నాయి. మామిడి చెట్టు ఎదిగి పండ్లు చేతికందడానికి కనీసం ఐదేళ్లు పడుతుంది. కానీ సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం తొగర్‌పల్లిలోని ఓ నర్సరీలో విద్యార్థి ప్రత్యేకంగా అంటుకట్టు విధానంలో కొన్నిరకాల మామిడి మొక్కలను పెంచారు. ఆ మొక్కలు సాధారణ చెట్ల కంటే పొడవు తక్కువగా ఉన్నప్పటికీ రెండేళ్లలో కాయలు కాస్తున్నాయి.
2/13
జోగులాంబ గద్వాల జిల్లాలోని హన్వాడ మండల కేంద్రం నుంచి కొత్లాబాద్‌కు వెళ్లే మార్గంలో మాదారం గ్రామ శివారులో ప్రధాన రహదారిని ఆనుకుని పక్కపక్కనే పెరిగిన రావిచెట్లివి. ఆకులు రాలి ఒకటి, చిలకపచ్చ రంగు ఆకులతో మరొకటి. ముదురు గోధుమ వర్ణం ఆకులతో ఇంకొకటి, ఆకులు రాలడానికి సిద్ధంగా మరొకటి.. ఇలా నాలుగు విభిన్న దశల్లో వరుసగా ఉన్న రావి చెట్లు ఆ మార్గంలో ప్రయాణించే వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని హన్వాడ మండల కేంద్రం నుంచి కొత్లాబాద్‌కు వెళ్లే మార్గంలో మాదారం గ్రామ శివారులో ప్రధాన రహదారిని ఆనుకుని పక్కపక్కనే పెరిగిన రావిచెట్లివి. ఆకులు రాలి ఒకటి, చిలకపచ్చ రంగు ఆకులతో మరొకటి. ముదురు గోధుమ వర్ణం ఆకులతో ఇంకొకటి, ఆకులు రాలడానికి సిద్ధంగా మరొకటి.. ఇలా నాలుగు విభిన్న దశల్లో వరుసగా ఉన్న రావి చెట్లు ఆ మార్గంలో ప్రయాణించే వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
3/13
జనగామ పట్టణ సుందరీకరణలో భాగంగా సిద్దిపేట రోడ్డులోని వంతెనను రంగులతో తీర్చిదిద్దారు. పచ్చదనాన్ని పెంచేందుకు దానిపై మొక్కల కుండీలను ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ అధికారులు మొక్కలకు ఎలాంటి రక్షణ వలయాలు, ముళ్ల కంచెలు ఏర్పాటు  చేయకపోవడంతో మూగజీవాలకు ఆహారంగా మారుతున్నాయి. జనగామ పట్టణ సుందరీకరణలో భాగంగా సిద్దిపేట రోడ్డులోని వంతెనను రంగులతో తీర్చిదిద్దారు. పచ్చదనాన్ని పెంచేందుకు దానిపై మొక్కల కుండీలను ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ అధికారులు మొక్కలకు ఎలాంటి రక్షణ వలయాలు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేయకపోవడంతో మూగజీవాలకు ఆహారంగా మారుతున్నాయి.
4/13
విశాఖ స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ఓట్ల లెక్కింపులో పాల్గొన్న సిబ్బంది విశాఖ స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ఓట్ల లెక్కింపులో పాల్గొన్న సిబ్బంది
5/13
 ట్రాలీ ఆటోలో ఓ పెళ్లి బరాత్‌కు నగిషీల టాంగా తరలించారు.  కాస్తా నిశితంగా పరిశీలిస్తే టంగుటూరి ప్రకాశం పంతులు దాన్ని ఎక్కినట్లుంది కదూ.. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. శాసనసభ ఎదుట సిగ్నళ్ల వద్ద వాహనం వెళ్తుండగా కెమెరా క్లిక్‌మనిపించింది. ట్రాలీ ఆటోలో ఓ పెళ్లి బరాత్‌కు నగిషీల టాంగా తరలించారు. కాస్తా నిశితంగా పరిశీలిస్తే టంగుటూరి ప్రకాశం పంతులు దాన్ని ఎక్కినట్లుంది కదూ.. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. శాసనసభ ఎదుట సిగ్నళ్ల వద్ద వాహనం వెళ్తుండగా కెమెరా క్లిక్‌మనిపించింది.
6/13
 టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్‌లోని వివిధ విద్యార్థి సంఘాలు గురువారం వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు. ఓయూ జేఏసీ, నిరుద్యోగుల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని లైబ్రరీ నుంచి ప్రగతి భవన్‌ ముట్టడికి భారీ ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి అంబర్‌పేట్‌ స్టేషన్‌కు తరలించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్‌లోని వివిధ విద్యార్థి సంఘాలు గురువారం వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు. ఓయూ జేఏసీ, నిరుద్యోగుల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని లైబ్రరీ నుంచి ప్రగతి భవన్‌ ముట్టడికి భారీ ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి అంబర్‌పేట్‌ స్టేషన్‌కు తరలించారు.
7/13
 పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గురువారం మొక్కకు కరెన్సీ నోట్లు అతికించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్న గ్రూప్‌-డి అభ్యర్థులు. తాము నియామక పరీక్షల్లో ఎంపికైనప్పటికీ ఇంకా విధుల్లోకి తీసుకోనందుకు వారు ఇలా ఆందోళన వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గురువారం మొక్కకు కరెన్సీ నోట్లు అతికించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్న గ్రూప్‌-డి అభ్యర్థులు. తాము నియామక పరీక్షల్లో ఎంపికైనప్పటికీ ఇంకా విధుల్లోకి తీసుకోనందుకు వారు ఇలా ఆందోళన వ్యక్తం చేశారు.
8/13
లద్దాఖ్‌-జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతాల మధ్య గేట్‌వేగా ఉండే జోజిలా పాస్‌ను సరిహద్దు రహదారుల సంస్థ అధికారులు గురువారం తెరిచారు. గ్రేటర్‌ హిమాలయాల శ్రేణిలో 11,650 అడుగుల ఎత్తులో ఉండే ఈ మార్గంలో వాహనాల రాకపోకలను జనవరి ఏడో తేదీన నిలిపివేశారు. భారీ హిమపాతం కారణంగా ఈ ప్రాంతంలోని అనేక మార్గాలను ఏటా కొద్దిరోజుల పాటు మూసివేస్తారు. గతేడాది జోజిలా పాస్‌ను 73 రోజుల పాటు మూసివేయగా ఈ ఏడాది 68 రోజులే మూసివేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. లద్దాఖ్‌-జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతాల మధ్య గేట్‌వేగా ఉండే జోజిలా పాస్‌ను సరిహద్దు రహదారుల సంస్థ అధికారులు గురువారం తెరిచారు. గ్రేటర్‌ హిమాలయాల శ్రేణిలో 11,650 అడుగుల ఎత్తులో ఉండే ఈ మార్గంలో వాహనాల రాకపోకలను జనవరి ఏడో తేదీన నిలిపివేశారు. భారీ హిమపాతం కారణంగా ఈ ప్రాంతంలోని అనేక మార్గాలను ఏటా కొద్దిరోజుల పాటు మూసివేస్తారు. గతేడాది జోజిలా పాస్‌ను 73 రోజుల పాటు మూసివేయగా ఈ ఏడాది 68 రోజులే మూసివేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
9/13
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 27.9 అడుగుల పొడువు, 5 అడుగుల చుట్టుకొలతతో ఉన్న కలం ఇది. టేకు కర్రతో ఓ వడ్రంగి రూపొందించిన ఈ భారీ కలం ‘వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణం సర్వాపురం ఇందిరమ్మ కాలనీకి చెందిన కుదురుపాక జగదీశ్వర్‌ ఈ ఘనత సాధించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 27.9 అడుగుల పొడువు, 5 అడుగుల చుట్టుకొలతతో ఉన్న కలం ఇది. టేకు కర్రతో ఓ వడ్రంగి రూపొందించిన ఈ భారీ కలం ‘వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణం సర్వాపురం ఇందిరమ్మ కాలనీకి చెందిన కుదురుపాక జగదీశ్వర్‌ ఈ ఘనత సాధించారు.
10/13
పూంఛ్‌ సెక్టార్‌లోని శివాలయంలో శివలింగానికి అభిషేకం చేస్తున్న మెహబూబా ముఫ్తీ పూంఛ్‌ సెక్టార్‌లోని శివాలయంలో శివలింగానికి అభిషేకం చేస్తున్న మెహబూబా ముఫ్తీ
11/13
ఆసియా ప్రాంతంలో రాబందుల రాజు(ఆసియన్‌ కింగ్‌ వల్చర్‌)గా పిలిచే ఎరుపు రంగు మెడ గల రాబందు చాలా సంవత్సరాల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో కనిపించింది. దుధ్వా నేషనల్‌ పార్కు సోనారిపుర్‌ రేంజ్‌లో ఇటీవల దీనిని గుర్తించినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఆసియా ప్రాంతంలో రాబందుల రాజు(ఆసియన్‌ కింగ్‌ వల్చర్‌)గా పిలిచే ఎరుపు రంగు మెడ గల రాబందు చాలా సంవత్సరాల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో కనిపించింది. దుధ్వా నేషనల్‌ పార్కు సోనారిపుర్‌ రేంజ్‌లో ఇటీవల దీనిని గుర్తించినట్లు అధికారులు గురువారం తెలిపారు.
12/13
ధరల పతనంతో తీవ్రంగా నష్టపోయిన ఉల్లి రైతులకు క్వింటాకు రూ.600 చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించడం, రైతు రుణాల మాఫీ సహా వివిధ డిమాండ్లపై మహా పాదయాత్ర చేపట్టిన మహారాష్ట్ర రైతులు ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఠాణే జిల్లాలోని షాహాపుర్‌ మీదుగా ముంబయి వైపు వెళ్లారు. ధరల పతనంతో తీవ్రంగా నష్టపోయిన ఉల్లి రైతులకు క్వింటాకు రూ.600 చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించడం, రైతు రుణాల మాఫీ సహా వివిధ డిమాండ్లపై మహా పాదయాత్ర చేపట్టిన మహారాష్ట్ర రైతులు ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఠాణే జిల్లాలోని షాహాపుర్‌ మీదుగా ముంబయి వైపు వెళ్లారు.
13/13
వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో వడగళ్లతో నిండిన ప్రధాన రహదారి వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో వడగళ్లతో నిండిన ప్రధాన రహదారి

మరిన్ని