News in Pics: చిత్రం చెప్పే సంగతులు -01(18-03-2023)

Updated : 18 Mar 2023 12:30 IST
1/14
అమరావతి: గుంటూరు జిల్లా రాజధానిలోని సీడ్‌యాక్సెస్‌ రహదారి ఒకవైపు అధ్వానంగా మారింది.దీంతో వాహనాలు వెళ్తున్నప్పుడు విపరీతంగా దుమ్ము కమ్మేస్తోంది. కళ్లలో దుమ్ము పడి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. అమరావతి: గుంటూరు జిల్లా రాజధానిలోని సీడ్‌యాక్సెస్‌ రహదారి ఒకవైపు అధ్వానంగా మారింది.దీంతో వాహనాలు వెళ్తున్నప్పుడు విపరీతంగా దుమ్ము కమ్మేస్తోంది. కళ్లలో దుమ్ము పడి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
2/14
అమరావతి: గుంటూరు జిల్లాలోని ఉండపల్లి కరకట్ట రహదారి ఇరుకుగా మారడంతో విస్తరణ చేపట్టారు. రోడ్డుపై  అడ్డుగా ఉన్న నిఘా కెమెరా స్తంభం మాత్రం అలాగే వదిలేశారు. అమరావతి: గుంటూరు జిల్లాలోని ఉండపల్లి కరకట్ట రహదారి ఇరుకుగా మారడంతో విస్తరణ చేపట్టారు. రోడ్డుపై అడ్డుగా ఉన్న నిఘా కెమెరా స్తంభం మాత్రం అలాగే వదిలేశారు.
3/14
ముసలిమడుగు సమీపంలో ఊరికి దూరంగా ఉన్న గిరిజన గురుకుల కళాశాలలో చదువుతున్న 72 మంది ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులు శుక్రవారం పరీక్ష రాసేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. వర్షం కారణంగా కళాశాల ఆవరణలోనే ఆర్టీసీ బస్సు బురదలో కూరుకుపోయింది.దీంతో విద్యార్థినులు వెనక నుంచి బస్సును నెట్టినా బయటకు రాలేదు.  కళాశాల సిబ్బంది హుటాహుటిన నాలుగైదు ఆటోలను ఏర్పాటుచేశారు. నిమిషం నిబంధన నేపథ్యంలో విద్యార్థులు కంగారుగా ఆటోల కోసం పరుగులు తీశారు. ముసలిమడుగు సమీపంలో ఊరికి దూరంగా ఉన్న గిరిజన గురుకుల కళాశాలలో చదువుతున్న 72 మంది ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులు శుక్రవారం పరీక్ష రాసేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. వర్షం కారణంగా కళాశాల ఆవరణలోనే ఆర్టీసీ బస్సు బురదలో కూరుకుపోయింది.దీంతో విద్యార్థినులు వెనక నుంచి బస్సును నెట్టినా బయటకు రాలేదు. కళాశాల సిబ్బంది హుటాహుటిన నాలుగైదు ఆటోలను ఏర్పాటుచేశారు. నిమిషం నిబంధన నేపథ్యంలో విద్యార్థులు కంగారుగా ఆటోల కోసం పరుగులు తీశారు.
4/14
 హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్లే లారీలు, భారీ వాహనాలు విజయవాడ ఇన్నర్‌ రింగు రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. చనుమోలు వెంకట్రావు పైవంతెన దిగువన ఉన్న వైఎస్సార్‌ కూడలి నుంచి పాయకాపురం వచ్చే దారిలో రహదారిపై వాటిని డ్రైవర్లు భోజనాలు, అల్పాహారం కోసం నిలిపేస్తున్నారు. దీని వల్ల ట్రాఫిక్‌ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. లారీలు ఒక్కసారిగా రోడ్డుపైకి వస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. 

5/14
  టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మూడున్నరేళ్లుగా నిర్మాణాలు ముందుకు కదలడంలేదు.అనంతపురం జిల్లా పామిడి మండలకేంద్రానికి సమీపంలో జాతీయ రహదారి పక్కన సుమారు 1400 ఇళ్ల భవనాలు కొంతమేర పూర్తవగా చాలావరకు పిల్లర్లు, పునాది దశలోనే ఆగిపోయాయి. నిర్మాణాల గోతుల్లో గతంలో కురిసిన వర్షపునీరు అలాగే ఉంది. పరిసర ప్రాంతాల్లో కంపచెట్లు పెరిగిపోయాయి. సొంత ఇంటికోసం కలలుగన్న లబ్ధిదారులకు కన్నీళ్లు మిగిలాయి.

6/14
  సాధారణంగా పంజరంలో చిలుకలు, వివిధ రకాల పిట్టలను బంధించి పెంచుతుంటారు. కుక్కలను పంజరంలో బంధించి పెంచడం ఎక్కడైనా చూసారా విశాఖపట్నం జిల్లా  జి.మాడుగుల మండలంలోని కుంబిడిసింగి గ్రామంలో టి.సుబ్బారావు ఇంట్లో పంజరంలో కుక్కపిల్లలను పెంచుతున్నారు.

7/14
ఏలూరు మండలం గుడివాకలంక సమీపంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన అతిథి గృహాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. మాధవపురంలోని కొల్లేరు వలస పక్షుల విడిది కేంద్రాన్ని అభిÅవృద్ధి చేసినా ఆశించిన స్థాయిలో పర్యాటకులు రావడం లేదు. ఇక్కడ బోటు షికారుకు ఇప్పటికీ అనుమతులు రాకపోవడం గమనార్హం. ఏలూరు మండలం గుడివాకలంక సమీపంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన అతిథి గృహాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. మాధవపురంలోని కొల్లేరు వలస పక్షుల విడిది కేంద్రాన్ని అభిÅవృద్ధి చేసినా ఆశించిన స్థాయిలో పర్యాటకులు రావడం లేదు. ఇక్కడ బోటు షికారుకు ఇప్పటికీ అనుమతులు రాకపోవడం గమనార్హం.
8/14
9/14
   కళ్ల ముందే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా.. రవాణాశాఖ, పోలీసు అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు. ప్రమాదకరమని తెలిసినా నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్నారు. గురువారం మెదక్‌లో ప్రధాన రహదారిలో ట్రాక్టర్‌పై ఇలా ప్రమాదకరంగా కూర్చొని ప్రయాణిస్తూ ‘న్యూస్‌టుడే’కు కనిపించారు

10/14
   సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) పేరిట ఈనెల 24న వైజాగ్‌లోని వైయస్‌ఆర్‌ క్రికెట్‌ స్టేడియంలో    నిర్వహిస్తున్న సినీ కళాకారుల క్రికెట్‌ సెమీఫైనల్స్‌ పోటీల గోడపత్రికను  హైదరాబాద్‌లోని  మాదాపూర్‌ ట్రైడెంట్‌ హోటల్‌లో ఆవిష్కరించారు. వాసవి తెలుగు వారియర్స్‌ కెప్టెన్‌ అక్కినేని అఖిల్‌తోపాటు సుధీర్‌బాబు, తమన్, అశ్విన్, సామ్రాట్, ఖయ్యూమ్, సుశాంత్‌ హాజరయ్యారు.  

11/14
 హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో కొత్తగా ప్రారంభమైన ఓ స్టోర్‌లో యువ కథానాయికలు సందడి చేశారు. శ్రీలేఖ, రితిక చక్రబర్తి, కృతిక రాయ్, నిషాత్‌ షేక్‌ తదితరులు సంప్రదాయ, డిజైనర్‌ వస్త్రాలు ధరించి సందడి చేశారు. 

12/14
వాతావరణం చల్లబడి, చిరుజల్లులు కురుస్తుండటంతో శుక్రవారం  హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ ఉద్యానవనంలో ఓ నెమలి ఇలా పురివిప్పి కనువిందు చేసింది.

13/14
   భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) దక్షిణ ప్రాంతీయ వార్షిక  సమావేశం శుక్రవారం   హైదరాబాద్‌లోని  బంజారాహిల్స్‌లో జరిగింది. కార్యక్రమానికి  అతిథులుగా బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, టెన్నిస్‌ తార సానియా మీర్జా హాజరై మాట్లాడుకుంటూ ఇలా నవ్వులు చిందించారు.

14/14
   అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌క్లెమెంటేలో కొండ చరియలు విరిగిపడటంతో ధ్వంసమైన ఓ నివాస భవనం పరిసరాలు

మరిన్ని